EPISODE · Mar 14, 2023 · 13 MIN
ప్రేమ చేజారితే 7 | Prema Chejarithe 7 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 7 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) అలా గతం గుర్తొస్తుంటే, ఆలోచిస్తూ కూర్చున్న కుమార్కు రాఘవరావు గొంతు దగ్గుతూ షాలినీని పిలిచినట్టు వినబడి గతం తాలూకు ఙ్ఞాపకాల నుండి బయటపడి రాఘవరావు పడక గది వైపుకు కదిలాడు. వెళ్తూ షాలినీనడిగి మంచి నీళ్ళు తీస్కుని రాఘవరావు దగ్గరకు చేరాడు కుమార్. "ఏంటి నాన్నా! ఏదో ఇబ్బంది పడ్తున్నారు," అని అడిగి, ‘దగ్గొస్తున్నట్టుంది నీళ్ళు త్రాగండ’ని రాఘవరావును లేపి మెల్లిగా నీళ్ళు త్రాగించాడు. “ఏంటి నాన్నా!? ఏమాలోచిస్తున్నారు? నేను చాలా వయసయ్యాక పెళ్ళి చేస్కున్నానని షాలిని గురించి, కుశాల్ గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి... నేటి కాలంలో మహిళా సాధికారతంటూ, మేము మాత్రమే ఎప్పుడూ ఇంట్లోనే వుండి ఇంటిని చూస్కోవాలా అంటూ, సొంత తల్లులే పిల్లలను వేరే వారికి అప్పజెప్పి ఉద్యోగాలు చేయాలనుకునే కాలం. పెద్ద వారిని వృద్దాశ్రమాలలో, పిల్లలను హాస్టల్లల్లో వుంచుతూ తాము కూడా ఉద్యోగాలు చేసి ఏదైనా సాధించాల్సిందే అనుకునే కాలం. షాలినితో మనకు ఆ ఇబ్బందే లేదు, చూస్తున్నారు కదా కుశాల్ని, మిమ్మల్ని ఎంత బాగా చూస్కుంటుందో, ఆపైన నేనుండనే వున్నాను. మీరు నిశ్చింతగా పడుకోండి” అని చెప్పి కుమార్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు. తర్వాత షాలిని మద్యాహ్నము నాలుగింటికి స్కూలుకు వెళ్ళి కుశాల్ని ఇంటికి తీస్కొచ్చింది. మళ్ళీ వాడికి స్నానం చేయించి, స్నాక్స్ తినిపించి, హోమ్ వర్కు చేయించి, మధ్య, మధ్యలో రాఘవరావుకు కావాల్సినవన్నీ చూస్కుంటూనే వుంది. ఇంతలో కుమార్ ఆఫీసు నుండి వచ్చాడు, అది చూసి కుశాల్ పరుగెత్తుకుంటూ కుమార్ దగ్గరకు వెళ్ళి లోపలికి వస్తున్న కుమార్ను పలకరిస్తూ, ఆ రోజు తాను చేసినవన్నీ ఏకధాటిన చెప్తూ లోపలికి తీస్కొచ్చాడు. అదంతా లోపలున్న రాఘవరావుకు వినిపిస్తుంటే, ఎంతో ఆనందపడిపోయాడు... కుటుంబము, పిల్లలు వుంటే ఆ ఆనందమే వేరు... ఇన్నాళ్ళూ, దీనికోసమేగా నా ఎదురు చూపు... హమ్మయ్య! నాకింకే కోరికా లేదని మనస్పూర్తిగా అనుకున్నాడు రాఘవరావు. కుమార్ వెళ్ళి ఫ్రెషప్ అయ్యివచ్చి, తండ్రి రాఘవరావుతో, కొడుకు కుశాల్తో కాసేపు గడిపాడు. తర్వాత రాత్రికి షాలిని చేసిన చపాతీలను, షాలిని, కుశాల్కు తినిపిస్తే, కుమార్, రాఘవరావుకు తినిపించి, తర్వాత తనూ తిన్నాడు. షాలిని, కుశాల్ని వాడి రూమ్కు తీస్కెళ్ళి కథలు చెప్తూ పడుకో బెట్టి, నిద్ర పోయాక తన రూమ్కు వెళ్ళి పోయింది. కుమార్ రాఘవరావుకు కాసేపు ఏదో చదివి వినిపిస్తూ, ఆయన నిద్రపోగానే తన రూమ్కెళ్ళి తన ఆఫీసు పనులన్నీ చూస్కోని ఎప్పటికో పడుకున్నాడు. ఇది ఆ ఇంట్లో ప్రతిరోజూ జరిగే మామూలు దినచర్య. వారి జీవితం గత కొద్ది కాలంగా ఇలా ఆనందంగా గడిచి పోతోంది. అలాగే కుశాల్ ముద్దు, ముద్దు మాటలతో, వాడు అడిగే ఎక్కడలేని డౌట్లతో గిర్రున కాలం తెలీకుండానే గడిచిపోసాగింది. ఇప్పుడు కుశాల్కు ఏడేళ్ళు వచ్చాయి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/XCr7uftsHr0
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 7 | Prema Chejarithe 7 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.