ప్రేమ చేజారితే 8 | Prema Chejarithe 8 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com episode artwork

EPISODE · Mar 28, 2023 · 15 MIN

ప్రేమ చేజారితే 8 | Prema Chejarithe 8 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 8 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) ఇంతలో డాక్టర్ వచ్చి కుమార్తో మీ అబ్బాయికి న్యూరలాజికల్గా(అంటే మెదడు కణాలలో) ఏ ఇబ్బందీ లేదు. కేవలం చూసిన విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నాడు. అసలేం జరిగిందో వివరంగా చెప్పండని అడగగా, కుమార్ జరిగిన విషయం చెప్పి, నిజానికి పడిపోయిన వాళ్ళమ్మకు పెద్దగా దెబ్బలేవీ తగలలేదనీ, కాకపోతే షాలిని అలా పడటంతో, ఆమె మెడకున్న ఎర్రని స్కార్ఫ్ తల చుట్టూ పడింది, పైనుండి దాన్ని చూసిన కుశాల్ రక్తమనుకుని భయంతో మూర్చపోయాడనుకుంటాను అని చెప్పాడు కుమార్. అదంతా విన్న డాక్టర్లు, అయితే సైకియాట్రిస్టైతేనే దీనికి తగిన ట్రీట్మెంట్ చేయగలడన్న నిర్ణయానికి వచ్చి కుమార్తో కుశాల్కు సైకియాట్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నామని చెప్తారు. డాక్టర్లు చెప్పింది విన్నాక, కుమార్ తమ కాలనీ హాస్పిటల్కే షిఫ్టయ్యి, అక్కడి సైకియాట్రిస్టుకే చూపించటానికి ఆ డాక్టర్ల దగ్గర అనుమతి తీస్కోని, కాలనీ హాస్పిటల్కు కుశాల్ను షిఫ్ట్ చేస్తాడు. అక్కడ సైకియాట్రిస్టైన నితిన్ను కలిసి జరిగిన విషయమంతా చెప్తాడు కుమార్. నితిన్ ఆ కాలనీవారి కోసం అక్కడే వుంటున్న సైకియాట్రిస్టు, ఆయనకు ఆ కాలనీ గురించి, ఆ కాలనీ వాసుల గురించి పూర్తిగా తెలుసు. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల పిల్లలకు ఎలాంటి మనస్తాపం కలుగకుండా వుండేందుకు గాను ముందునుంచే పిల్లల మానసిక స్థితిని పర్యవేక్షుస్తున్నాడు నితిన్. "కుశాల్ తన తల్లికి తనవల్లే ఏమో అయ్యిందనీ, ఇంక తనకు తల్లి దక్కదేమోనన్న షాక్కు లోనయ్యి, మూర్చనుండి లేవగానే మళ్ళీ అది గుర్తుకు వచ్చి మూర్చపోతున్నాడు, " అని చెప్తాడు నితిన్. మళ్ళీ తనే కుమార్తో, " షాలిని క్రింద పడినప్పుడు, కుశాల్ కానీ షాలినిని గురించి ఏమైనా గమనించి వుంటాడంటావా ?" అని అడిగాడు. దానికి కుమార్, "అదే నాకూ అర్థం కావటం లేదు, " అని అంటాడు నితిన్తో. ఆ విషయం గురించి నితిన్ బాగా ఆలోచించి, " 'కుశాల్కు షాలిని గురించి తెలిసినా, తెలియకపోయినా ఏ ఇబ్బంది కలగని విధంగా మనమొకటి చేయవచ్చు. అదేమంటే, కుశాల్ మెదడులో నుండి ఆ సంఘటనను మర్చిపోయేలా చేయటమే. దాని వల్ల అదంతా మర్చిపోయి మామూలుగా అవుతాడు, కాకపోతే మెదడులోని ఙ్ఞాపకం తీసేసేప్పుడు, అదొక్కటే తీసేయలేము, దానికి ముందు కొన్ని రోజుల ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు. అయినా ఆ ఙ్ఞాపకాలు పూర్తిగా చెరిగి పోవు సబ్ కాన్షియస్ లో అలానే వుంటాయి, మళ్ళీ అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు గుర్తుకు వచ్చే ప్రమాదమైతే వుంది, ' అని చెప్పి. 'అలాగే ఇప్పటి నుండి, కుశాల్ ఎప్పుడు తన తల్లి ప్రేమను కోల్పోతానేమోనన్న అభద్రతా భావానికి లోనయ్యి ఏదైనా ఆలోచించే ప్రయత్నం చేస్తాడో అప్పుడు తలనొప్పి వచ్చే ప్రమాదముంది. అప్పుడు కుశాల్కు అన్నీ చెప్పి కౌన్సెలింగ్ ఇవ్వక తప్పదు, ' " అని సైకియాట్రిస్ట్ నితిన్ అంటాడు కుమార్తో. దానికి కుమార్, "సరే"నని ఒప్పుకుంటాడు. నితిన్ తన హిప్నొటైజేషన్ టెక్కిక్తో కుశాల్ మెదడులోని 'షాలిని గుంతలో పడి బండ రాయిని గుద్దుకుని రక్తం చిందిన ఙ్ఞాపకాన్ని' మరిచి పోయేలా చేస్తాడు. దానితో పాటు ఇంకొన్ని రోజుల మామూలు ఙ్ఞాపకాలు కూడా మరిచిపోతాడు కుశాల్. ఆ ట్రీట్మెంట్ తర్వాత కుశాల్ మూర్చ నుండి బయటికొచ్చి, తను కొన్ని సంఘటనలు మర్చిపోయినట్టు తెలియక మామూలుగా మాట్లాడసాగాడు. అప్పటికి కానీ కుమార్ ఆందోళన తగ్గలేదు. తర్వాత ఆనందంగా, మనస్పూర్తిగా నితిన్కు కృతజ్ఞతలు తెలుపుతాడు కుమార్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/XahrVAJ4MmI

Episode metadata supplied by the publisher feed · Published Mar 28, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమ చేజారితే 8 | Prema Chejarithe 8 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com

0:00 15:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on March 28, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!