EPISODE · Apr 4, 2023 · 9 MIN
ప్రేమ చేజారితే 9 | Prema Chejarithe 9 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 9 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత)గత భాగంలో జరిగినది డాక్టర్ నితిన్ పిల్లలకు అర్థమయ్యే విధంగా కుశాల్, కుశాల్ క్లాస్మేట్లకు కౌన్సెలింగ్ కొనసాగిస్తుంటాడు . ఇక ఈ భాగం చదవండి... ఆరోజు ఉదయం కుశాల్ ఉలిక్కిపడి కలవరిస్తూ లేచాడు, మనసులో ఏవో తెలియని భావనలు, అదోమాదిరి అలజడి, విపరీతమైన బాధ... ఎవరో ఎక్కడినుండే పడ్తున్నట్టుగా, ఏదో లీలగా కనిపిస్తుంది, ఏంటా అని ఆలోచించే ప్రయత్నం చేస్తే చాలు తలనొప్పిగా అనిపిస్తోంది. ఎందుకలా అని ఆలోచించటానికి లేకుండా తలనొప్పి... అమ్మానాన్నలకు కూడా చెప్పాలనిపించలేదు. కుశాల్ ఎంత ప్రయత్నిస్తున్నా ఆలోచనలు కుదుటపడటం లేదు, ఇంకా తల నొప్పి పెరుగుతన్నట్టుగా అనిపించింది... కుశాల్కు స్కూల్కెళ్ళి డాక్టర్ నితిన్ని కలిస్తే బాగుంటుందనిపించి, వెంటనే రెడీ అయ్యి స్కూల్కు బయలుదేరాడు, షాలిని టిఫిన్ తినమని పిలుస్తున్నా వినకుండా, తినకుండా స్కూల్కు వెళ్ళి పోయాడు కుశాల్. అక్కడే వున్న కుమార్ షాలినీతో, "పర్వాలేదులే నేనీరోజు నానీ స్కూల్కు వెళ్తున్నాను, క్యారియర్ కట్టి వుంచు నేనే తీస్కెళ్తాను," అని చెప్పాడు. షాలిని,"అలాగే," అంది. కుశాల్ స్కూల్కెళ్ళగానే క్లాస్మేట్ 'హసీ' కనిపించి, "ఏంటి కుశాల్! అలా వున్నావు? మళ్ళీ తల నొస్తుందా? అయితే తొందరగా మన డాక్టర్ని కలవమని సలహా ఇచ్చి, బై చెప్పి", వెళ్ళి పోయింది. డాక్టర్ నితిన్ కుశాల్ వాళ్ళకు కౌన్సెలింగ్ మొదలెట్టినప్పటి నుండి స్కూల్కు అస్సోసియేట్గా వున్న హెల్త్ కేర్ యూనిట్లోనే ప్రతిరోజూ వచ్చి స్కూల్ టైమంతా అక్కడే వుంటున్నాడు. పిల్లలకు అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వటమే కాక పూర్తిగా తను వాళ్ళను గమనిస్తున్నాడు కూడా. ఎవరైనా ఇతరులు నితిన్ని అర్జెంటుగా కన్సల్ట్ చేయాలంటే అక్కడికే వారిని రమ్మంటున్నాడు, లేకపోతే ఆన్లైన్లోనే వారికి కావాల్సిన సలహాలిస్తున్నాడు. కుశాల్ కూడా హసీకి బై చెప్పి స్కూల్లోని 'హెల్త్ కేర్ యూనిట్' దగ్గరకు వచ్చాడు. సైకియాట్రిస్ట్ నితిన్ అక్కడ కూర్చుని కనిపించాడు. ఇంకా ఉదయమే కావటాన ఫ్రెష్గా కనిపిస్తూ, ఇస్త్రీ చేయబడిన శుభ్రమైన లేత రంగు షర్ట్కు ముదురు రంగు పాంట్ వేసి, టక్ చేసి, టై, షూస్తో పైన డాక్టర్ కోట్తో చూస్తూనే డాక్టర్ లా ప్రశాంతంగా కనబడుతున్నాడు. అతని వయసు అరవై పైనే వున్నా అస్సలంత వయసున్నట్టే కనబడడు. మరి ఆయన మైండ్ స్పెషలిస్టు కదా, ఎప్పుడు, ఎలా ఆ మనసును ఆధీనంలో వుంచుకోవాలో, ఎలా దాన్ని ఆనందంగా వుంచాలో బాగా తెలిసిన వ్యక్తి. మనసు ఆనందంగా వుంటే శరీరంలో ఎంతో వయసు తగ్గినట్లు కనిపిస్తుందన్నదానికి ఆయనో నిలువెత్తు నిదర్శనం. సైకియాట్రిస్ట్ నితిన్ అప్పుడే వచ్చిన కుశాల్ని చూసి, "కమ్ నానీ" అంటూ పిలిచి కూర్చోమన్నాడు. (కుశాల్ను వాళ్ళ నాన్న పిలిచే పేరు 'నానీ' అని ముందు చెప్పాను గుర్తుంది కదా) ... నితిన్ కావాలనే కుశాల్ను ముద్దు పేరుతో పలకరించాడు. దానివల్ల దగ్గరితనం పెరిగి మనసులోనిది బయటపెడ్తాడనేమో. "ఏంటి ప్రాబ్లం నానీ?" అని అడిగి, "మళ్ళీ తనే అదే ప్రాబ్లమా" అని అడుగుతుండగానే ఒక ఇద్దరు జూనియర్ సైకియాట్రీ డాక్టర్లు వచ్చారు. వాళ్ళను కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చోమన్నాడు నితిన్. వాళ్ళు వెళ్ళి పోయాక మళ్ళీ నానీ వంక చూసాడు, అప్పుడు నానీ "అవునని సమాధాన"మిచ్చాడు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video linkhttps://youtu.be/hpahx8Z3Dok
Embed this episode
NOW PLAYING
ప్రేమ చేజారితే 9 | Prema Chejarithe 9 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.