ప్రేమలేఖ | Premalekha | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com episode artwork

EPISODE · Sep 1, 2023 · 5 MIN

ప్రేమలేఖ | Premalekha | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Premalekha' - New Telugu Story Written By D V D Prasad 'ప్రేమలేఖ' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: డి వి డి ప్రసాద్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ఎదురింట్లో ఉన్న అపర్ణని మనసారా ప్రేమించిన సుందర్ తన ప్రేమని అమెకెలా తెలపాలో తెలియక ఒకటే సతమతమవుతున్నాడు. సుందర్ పేరుకి తగ్గట్టే అందగాడు, పైగా మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఎవరినైనా ఇట్టే ఆకర్షించే పర్సనాలిటీ అతని సొత్తు. అందుకే అపర్ణని ఆకర్షించే పనిలో పడ్డాడు. తనని ఆమె తప్పకుండా ప్రేమిస్తుందనే అతని ప్రగాఢ విశ్వాసం. అయితే, తనని చూసి అపర్ణ చిరునవ్వు చిందిస్తుంది తప్పితే తనంటే ఇష్టముందో లేదో మాత్రం ఎంత ప్రయత్నించినా తెలుసుకోలేకపోయాడు సుందర్. ఆమె సంప్రదాయానికి విలువిచ్చే బాపూ బొమ్మలాంటి అందమైన అమ్మాయి. ఓ రచయిత్రి కూడా! సాహిత్యం అంటే ముక్కూ చెవులూ కూడా కోసుకొనే సుందర్ ఆమెని ప్రేమించాడు. తన ప్రేమ విషయం ఆమె కెలా చెప్పాలో అర్థం కాక అమ్మాయిల వెంటపడి ప్రేమించడంలో బాగా అనుభవం సంపాదించిన తన స్నేహితుడు ప్రేమానందం సలహా అడిగాడు. "ఏముంది, ఓ మంచి రోజు చూసి నవ్వుతూ ఆమెకి ఎదురెళ్ళి ఓ గులాబీ పువ్వు ఇచ్చి నీ ప్రేమ విషయం చెప్పేయ్! అంతే! సింపుల్!" చెప్పాడు చాలా తేలిగ్గా. "అమ్మో! ఇంకేమైనా ఉందా! ఆమెకి కోపం వస్తే!" అంటూ చెంపలు తడుముకున్నాడు సుందర్. "అంత పిరికివాడివి నువ్వెలా ప్రేమించావు మిత్రమా! చిత్రంగా ఉంది సుమా!" విసుక్కున్నాడు ప్రేమానందం. "నా ప్రేమని వ్యక్తం చేసే ధైర్యమైతే ఉంది కాని అలా ముఖాముఖీ చెప్పడం అంటే ఎంతైనా కొంచెం కష్టమే, ఇంకేమైనా ఉపాయం చెప్పరా?" స్నేహితుడ్ని అభ్యర్థించాడు సుందర్. "సరే! అపర్ణ ఫోన్ నంబర్ నీకెలాగూ తెలుసు కాబట్టి వాట్సప్లో సందేశం పెట్టు. ఆమె నుంచి సమాధానం వస్తుందేమో చూడు." అన్నాడు. స్నేహితుడి సలహా ప్రకారం ఆమెకి సందేశం పంపాడు, అయినా ఆమె నుండి ఏ విధమైన స్పందన లేదు. కానీ ఎప్పటిలా తను కనపడినప్పుడల్లా కాల్గేట్ ప్రకటనలా చిరునవ్వులు చిందిస్తూనే ఉందామె. దానితో ఆమె కూడా తనని ఇష్టపడుతోందని గ్రహించాడు. అయితే ఏ విషయమూ తెలియనిదే ఎలా ముందుకెళ్ళాల్లో తెలియక తికమక పడుతున్నాడు పాపం సుందర్. అలా ఆలోచిస్తూంటే బ్రహ్మాండమైన ఉపాయం తట్టింది. అపర్ణ పూర్తిగా పాతం కాలం అమ్మాయి. ఆమెకి ఇలా సందేశం పెడితే నచ్చి ఉండకపోవచ్చు, అందులోనూ రచయిత్రి కూడా! ప్రేమలేఖ రాస్తే స్పందిస్తుందేమో అన్న ఆలోచన వచ్చిందే తడువు, ఆచరణలో పెట్టాడు. బాగా ఆలోచించి, చాలా కష్టపడి కిందమీదా పడి చివరికి ఓ ప్రేమలేఖ తయారు చేసి, గులాబి రంగు కవరులో పెట్టి ఆమెకి అందించాడు. నవ్వుతూ ఆమె ఆ కవరు అందుకుందే గానీ, రెండు రోజులు గడిచినా ఆమె నుండి ఏ విధమైన జవాబు రాలేదు. దానితో కొంచెం నిరాశ చెందినా తన బుర్రకి మరింత పదును పెట్టాడు. అప్పుడు మెదడులో ఓ మెరుపు మెరిసింది. తక్షణం తన ఆలోచన ఆచరణలో పెట్టాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2muH2C9I-1g

Episode metadata supplied by the publisher feed · Published Sep 1, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమలేఖ | Premalekha | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com

0:00 5:16

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on September 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!