EPISODE · Aug 3, 2023 · 8 MIN
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 | Premante Idena Part 2 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Premante Idena Part 2' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2' తెలుగు ధారావాహిక పార్ట్ 2 (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత మరుసటి రోజు బ్యాంక్ కు వెళ్లాను. ఆనంద్ బాగా బిజీగా ఉన్నాడు కౌంటర్ లో. “బ్యాంక్ అకౌంట్ ఒపెన్ చేయాలండి” ఆన్న నా గొంతు విని "విరిజా గారు.. బాగున్నారా" అన్నాడు ఆనంద్. "బావున్నానండీ! కొంచం బ్యాంక్ అకౌంట్..” అనెలోగా "ఓ ష్యూర్" అంటూ “ముందు ఈ ఫార్మ్ పూర్తిచేసి ఇక్కడ సైన్ చేయం”డని ఒక ఫామ్ ఇచ్చాడు. తర్వాత పాస్ బుక్ ఇస్తే, నాన్న ఇచ్చిన డబ్బులు డ్రా చేసుకుని "థాంక్స్ ఆనంద్ గార”ని బయటకు వచ్చాను. నా వెనకాలే వచ్చి “ఇంకా ఏమన్నా హెల్ప్ కావాలంటే మొహమాట పడకుండా అడగండి” అన్నాడు. “మొన్న పద్మ గారు కాల్ చేసి మీరు వస్తారని చెప్పారు”. "నాకు కూడా చెప్పింది పద్మ, మిమ్మలని కలవమని. " “ఇపుడు మనం ఫ్రెండ్స్. అదీకాక ఈ సిటీకి మీరు కొత్త. ఏ అవసరమొచ్చినా కాల్ చేయం”డని సెల్ నంబర్ ఇచ్చాడు. "ఒకే! తప్పక అడుగుతాను. ఇక ఉంటా”నని చెప్పి కదిలాను అక్కడనుండి. ఇపుడిపుడే చదువు లో పడుతున్నాను. నా రూమ్మేట్స్ మాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించ మంటే ఒకరోజు అందరం బ్యాంక్ వెళ్ళాము. ఆనంద్ మమ్మలని చూసి కౌంటర్ బయటకు వచ్చి అకౌంట్ ఓపెన్ చేయించాడు. థాంక్స్ చెప్పి బయటకు వచ్చాము. "సూపర్ గా ఉన్నాడే గురుడు! మంచి జాబ్. మనం కష్ట పడి చదివి జాబ్ తెచ్చుకునే బదులు ఇలాంటివారిని పట్టుకుంటే పోలా" అంది శుభా. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KLBnfFL_L1c
Embed this episode
NOW PLAYING
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 | Premante Idena Part 2 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.