EPISODE · Aug 16, 2023 · 10 MIN
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4 | Premante Idena Part 4 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Premante Idena Part 4' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత జరిగిన కథ: విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ. వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంటారు. ఆనంద్ వైజాగ్ లో బ్యాంకు లో పనిచేస్తుంటాడు. వారికి సహాయం చేస్తుంటాడు. రాజీ కి బ్యాంక్ జాబ్ వచ్చింది. హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారు. విరిజ గ్రూప్స్ కి సెలెక్ట్ అవుతుంది. ఇక ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4 చదవండి. రోజులు గడుస్తున్నాయి. రాజీ అపుడప్పుడు కాల్స్ చేస్తూ.. ఉంది. అది హైదరాబాద్లో బాగానే క్లిక్ అయింది. "ఇంటిలో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నాకు విరిజా” "మరి చేసుకోవే ఒక పని అయిపోతుంది మీ అమ్మ వాళ్లకు" అన్నాను. "లేదే! ఒకసారి రవిని, ప్రేమించి, మోసపోయాను, ఇపుడు, చేసుకునేవాళ్ళను, జాగ్రత్తగా చూసి, విచారించి, చేసుకోవాలి. " "గుడ్! అలా ఆలోచించి తీసుకోవే! మంచి నిర్ణయం. " "ఏ విరిజా !ఆనంద్ ను చేసుకుంటే ఎలా ఉంటుం”దన్నది! ఒక్కసారి నాకు గుండెలో కలుక్కుమంది.. అయినా తోట్రుపడకుండా, "బానే ఉంటుంది. మీ నాన్న గారిని ఒకసారి ఆనంద్ వాళ్ల అమ్మానాన్న కి కాల్ చేసి కనుక్కోమనవే" అన్నాను. "అవును కదా! ఇపుడే చెపుతాను. థాంక్స్ విరిజ ఒకసారి ఆనంద్ తో నువ్వు కూడా మాట్లాడవా!” అంది. "ఆనంద్ కలకత్తా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉంటే మాట్లాడేదాన్ని" అన్నాను. "కానీ మంచివాడే కదా!” అంది. “ఏమోనే! నేనేమి అతన్ని దర్మామీటర్ పెట్టీ కొలవలేదు రాజీ. ఎంత గుడ్ ఎంత బాడ్" అని ఫోన్ పెట్టేసాను విసుగ్గా. 'దీనికీ ఏమైందీ! సడెన్గా ఫోన్ కట్ చేసింది. కొంప దీసి విరిజ, ఆనంద్ ను లవ్ చేయటం లేదు కదా. !' అదేమికాదు, విరిజకు లవ్వంటేనే, గిట్టదు ఛాన్స్ లేదు. అది ప్రేమించదు, సో ఆనంద్ నా వాడే..’ అనుకుంది రాజీ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/4jpA4lfNiF4
Embed this episode
NOW PLAYING
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4 | Premante Idena Part 4 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.