ప్రేమంటే తెలుసా మీకూ - 2 | Premante Thelusa Miku - 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com episode artwork

EPISODE · May 29, 2023 · 12 MIN

ప్రేమంటే తెలుసా మీకూ - 2 | Premante Thelusa Miku - 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ రెండవ భాగం 'Premante Thelusa Miku - 2' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'ప్రేమంటే తెలుసా మీకూ - 2' తెలుగు కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ... అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. కొద్దిరోజులకు పుట్టింటికి వచ్చిన అతని కూతురు కుమారి - తనకు, భర్తకు మధ్య సఖ్యత లేదని చెబుతుంది. ప్రేమంటే తెలుసా మీకూ - 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ రెండవ భాగం వినండి. సీతకి ఏమి మాట్లాడాలో తెలీడంలేదు. కూతురు చెప్పే పితూరీలేవి అంత పెద్దవిగా అనిపించ లేదు. ఈ కాలం పిల్లలు ప్రతిదీ ఓ పెద్ద గడ్డు సమస్యగా అనుకుని తెగ బాధ పడిపోతూ ఉంటారు. ఎదుటివారికి తమ మీద ప్రేమ లేదని ఖచ్చితంగా అనేసుకుంటూ ఉంటారు. ఒకరినొకరు ప్రేమించి, బాగా ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కాబట్టి, ఇద్దరూ కూర్చుని స్నేహంగా చర్చించు కుంటే, అన్నీ సర్దుకుంటాయేమో అని అనిపించింది సీతకి. అనుభవాల అ, ఆ లు కూడా ఎరుగని వయసు, ఆ వయసు పిల్లలది. ఏ అనుభూతినైనా, ఎక్కువసేపు మనసున పదిల పరుచుకోలేరు, దాన్ని సమగ్రంగా చదవనూ లేరు. అప్పుడే కావాలనుకుంటారు, మరుక్షణంలో దాన్ని వద్దనుకుంటారు. మంచి చెడుల విచక్షణలని అంచనా వేయలేని వయసు వేగం వీరి స్వంతం. పైగా తన శ్రేయోభిలాషులు, పెద్దలూ చెపితే వినడానికికూడా వారి మనసంగీకరించదు. అదే వయసు గారడీ. పిల్లలవంతు కూడా సంయమనం పాటించాల్సింది పెద్దలే మరి! పిల్లలు పెద్దవుతున్నా కూడా వారు ఎప్పటికీ పసివారే! అమ్మా, నాన్నలు ఆదిగురువులై, చిన్న చిన్న లెక్కల్లో వచ్చే అవకతవకల్ని సరిదిద్ది, వారి జీవితం లో ఎదురయ్యే "తప్పుడు లెక్కలకి " మంచి "సూత్రం" సూచిస్తూ సరైన మార్గాన నడిపిస్తారు. "మీ అత్తగారి మాటే కరెక్ట్ ఏమోరా, సర్దుకుపోరా కన్నా, ఇంకా రాహుల్ తో కూల్ గా మాట్లాడి పరిష్కరించుకో, నీ క్లాస్ మేటే కదరా, నీ బాధని అర్ధం చేసుకుంటాడులే. ఇలాంటి పద్ధతులు మనింట్లోనే ఉండి ఉంటె ఏమి చేసే దానివి చెప్పు. నీకలవాటైపోయి ఉండేది కదా ఈ తరహా జీవితం. మన ఇల్లుని, మమ్మల్ని వదిలి అయితే వెళ్లేదానివి కాదుగా? పైగా అందరిలో మంచి చెడులు ఉంటాయి రా. ఇప్పుడు నేనున్నాను నేను మొత్తంగా నీకు నచ్చకపోవచ్చు, నాలోనూ నీకు నచ్చని గుణాలు ఉండి ఉంటాయి, అయితే నామీద నీకున్న ప్రేమ, ఆ నచ్చని గుణాలని వదిలేసి, నచ్చినవే తీసుకునేలా చేస్తోంది. రాహుల్ లో మంచి గుణాలను అంటే నీకు నచ్చే వాటిని మాత్రమే చూసుకుంటూ, నచ్చని వాటి జోలికి వెళ్లకురా. ఇప్పుడు మనం నడిచి వెళ్తున్న రోడ్ లో, ముళ్ళు, రాళ్ళూ ఉండే త్రోవ ఉంటుంది, సాదా త్రోవ ఉంటుంది, మనం ఏ త్రోవ ని ఎంచుకుని ముందుకెళతాము ? జీవితమూ అంతేరా!” తనకి ఉన్న పరిజ్ఞానం మేరకు, తెలిసినంతలో నచ్చ చెప్పింది. అమ్మ చెప్పింది విని కన్విన్స్ అయినట్టుంది, మౌనంగా ఉండిపోయింది కుమారి. ఈలోగా, చెల్లెళ్ళు, అన్నయ్యలూ వచ్చారు, పెళ్లయ్యాక కుమారి రావడం ఇదే మొదటిసారి కనక, ఒకటే కోలాహలం చోటు చేసుకుంది. అందరూ ఒకచోట చేరి, మాట్లాడుకోడం ప్రారంభించారు. **** అప్పుడు సీతారామయ్య, సీత, వివరంగా చర్చించుకున్నారు, ఇద్దరూ ఒక విషయం ఆకళింపు చేసుకున్నారు. కుమారి, రాహులు మధ్య ప్రేమకి లోటు లేదు, ఇద్దరూ రెండు నేపధ్యాల్లోంచి వెళ్ళినవారు కావడం, వారి వారి పరిస్థితులను వారు జీర్ణించుకోలేకపోడం.. ఇదే పెద్ద కారణం వారి మధ్య పొంతన కుదరకపోడానికి. “తనకి కావాల్సిన దాన్ని రాహుల్ ఇవ్వకపోయినా, తను చేస్తానన్న పనికి వద్దని బ్రేక్ వేసినా, మనమ్మాయి, రాహుల్ కి తనమీద ప్రేమ లేదని తనలో తానే నిర్ధారించేసుకుని, బాధ పడి పోతోంది. రాహుల్ కూడా అంతే. ” తేల్చి చెప్పేసారు సీతారామయ్య. సీత తనకున్న అనుభవంతో అందుకుంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xMxUM8BK_Ms

Episode metadata supplied by the publisher feed · Published May 29, 2023

Embed this episode

NOW PLAYING

ప్రేమంటే తెలుసా మీకూ - 2 | Premante Thelusa Miku - 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com

0:00 12:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 12 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on May 29, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!