EPISODE · Jun 1, 2023 · 23 MIN
ప్రేమంటే తెలుసా మీకూ - 3 | Premante Thelusa Miku - 3 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) https://www.manatelugukathalu.com/post/premante-telusa-miku-3-telugu-story-1880 'Premante Thelusa Miku - 3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'ప్రేమంటే తెలుసా మీకూ - 3' తెలుగు కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. కొద్దిరోజులకు పుట్టింటికి వచ్చిన అతని కూతురు కుమారి తనకు, భర్తకు మధ్య సఖ్యత లేదని చెబుతుంది. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు సహజమేనని కూతురికి నచ్చజెబుతారు, సీతారామయ్య, సీత దంపతులు. ఇక 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ మూడవ భాగం చదవండి.. "నాన్న, మిమ్మల్నో మాట అడుగుతాను, ఏమి అనుకోరుగా " అంది కుమారి. ప్రేమగా కుమారి తల నిమిరి, కళ్ళతోనే సౌంజ్ఞ చేసారు అడగమన్నట్టు. "అమ్మది, మీది ప్రేమ కధ చెప్పండి నాన్నా" ఉత్సుకతగా అడిగింది కుమారి. "చెపుతాను కానీ, మా ప్రేమ కధ కన్నా, నీకు ముందు ఇంకో ప్రేమకథ చెప్పితీరాలి రా. చెప్పనా ?" సరే అన్నట్టుగా, బొటనవేలితో థంప్స్ అప్ చూపించింది. “మనింటి దగ్గరున్న బస్తీలో దేవుడమ్మ, ఈశ్వర్ రావు ఉండేవారు. మొదటి రెండు పెళ్లిళ్లు విఫలమవడంతో, దేవుడమ్మని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు ఈశ్వరరావు. దేవుడమ్మ కూడా ఈశ్వరరావు ని గాఢంగా ప్రేమించింది. వాడికి తాగుడు అలవాటుంది. రాత్రిపూట తాగొచ్చి దేవుడమ్మతో గొడవపడి, బాగా కొట్టేవాడు. అయినా దేవుడమ్మ లో ప్రేమ ఇసుమంతైనా తగ్గలేదు. తాగనప్పుడు మాత్రం దేవుడమ్మని ఓ దేవతగా చూసుకునేవాడు. దేవుడమ్మకి వాణిశ్రీ పాటలంటే ఇష్టమని, ఓ రేడియో కొనిచ్చాడు. సడెన్ గా ఓరోజు గుండెపోటొచ్చి దేవుడమ్మ చనిపోయింది. వాణిశ్రీ పాటలు లౌడ్ స్పీకర్ లో పెట్టి, దేవుడమ్మకి తుది వీడ్కోలు పలికాడు. తనకిష్టమైన పాటలు వింటూ తాను పయనమవ్వాలని వాడి కోరిక. అందరు ఈసడించుకున్నారు, శవం ఉండగా ఆ సినిమా పాటలేంటి అని. తనకి గుర్తుగా ఆ బస్తీకి "దేవుడమ్మ బస్తీ " అని పేరు పెట్టేడు. అంతా విని, కన్నీరు పెట్టుకుంది కుమారి. "ఎంత గొప్ప ప్రేమికులు కదా నాన్నగారూ" అంది తేరుకుని. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/dEgd_MY2bes
Embed this episode
NOW PLAYING
ప్రేమంటే తెలుసా మీకూ - 3 | Premante Thelusa Miku - 3 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.