EPISODE · May 25, 2023 · 12 MIN
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1 | Pragathi Premikulu episode 1 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 1' Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అంకితం.. మన హైందవ జాతి పితామహులు... మన సనాతనాధ్వయిత వేదాంత తత్వాన్ని... ఆధ్యాత్మిక చింతనా విధానాలను... హైందవ ధర్మ సిద్ధాంతాలను... విశ్వానికి చాటి చెప్పిన భరతమాత ముద్దుల బిడ్డ... కారణ జన్ములు... శ్రీ రామకృష్ణపరమహంస ఏకలవ్య శిష్యులు... కీర్తి శేషులు... అయిన శ్రీ వివేకానందస్వామీజి వారి దివ్య పాదపద్మములకు... అంకితం. చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ "ఈశ్వర్..! బయలుదేరుదాం." జీప్ లో కూర్చుంటు అంది బి.డి.ఓ. అమృత. ఈశ్వర్ తన స్థానంలో కూర్చొని జీప్ ను స్టార్ట్ చేశాడు. "ఆ పుస్తకాలను అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు పంచండి. అందరూ తప్పక చదవాలి.” నవ్వుతు చెప్పింది అమృత. మండల సమావేశానికి వచ్చి, ఆమె జీప్ చుట్టూ వున్న వారంతా తలలు ఆడించారు. అందరికి బై చెప్పింది అమృత. జీప్ మండల కార్యాలయ ప్రాంతాన్నిదాటి రోడ్డులో ప్రవేశించింది. ఇరవై నిముషాల తర్వాత జీప్ హైవే పైకి వచ్చేసింది. సమయం సాయంత్రం ఆరుగంటల ప్రాంతం. వారు చేరవలసిన గమ్యానికి ముక్కాలు గంట పడుతుంది. మేఘావృతంగా ఉన్న ఆకాశం నుండి సన్నటి తూర ప్రారంభమయింది. ఈశ్వర్ రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న ఒక కారును దాటి ముందుకు వెళ్ళాడు. ఆ కారు బ్యానెట్ తెరిచి వుంది. డ్రైవర్ వంగి యంత్రాన్ని పరిక్షిస్తూ ఉన్నాడు. ప్రక్కన ఒక యువకుడు నిలబడి ఆకాశానికేసి చూస్తూ ఉన్నాడు. వాన వేగం హెచ్చింది. బహుశా... ఆ కారులో ఏదో ప్రాబ్లం అయ్యి వుండవచ్చు. సాయం కావాలా అని అడగటం ధర్మంగా భావించింది అమృత. కారును వెనక్కు త్రిప్పమని ప్రక్కనే ఉన్న ఈశ్వర్ తో చెప్పింది అమృత. రెండు వైపులా చూచుకొని ఈశ్వర్ బండిని రివర్స్ లో వెనక్కు నడిపాడు. జీప్ కారును సమీపించింది. అమృత జీప్ దిగి ఆ కారును సమీపించింది. ఆ యువకుడు దగ్గరగా వచ్చిన ఆమెను చూచాడు. “సార్… కెన్ ఐ హెల్ప్ యు..?” వందనంగా అడిగింది అమృత. “యింజన్లో ప్రాబ్లమండి. మీరేం సహాయం చేయగలరు..?” నవ్వుతూ అన్నాడు వివేకానంద. "మీరు ఎక్కడికి వెళ్ళాలి..?” "కడప." మీకు అభ్యంతరం లేకపోతే మీరు నాతో మా జీప్ లో రావచ్చు. మా డ్రైవర్ కు తెలిసిన మంచి మెకానిక్ వున్నాడు. మనం దిగిపోయి వారిరువురినీ యిక్కడికి పంపుదాం. ఆ మెకానిక్ మీ బండిని బాగు చేయగలడు.” తను చెప్పదలచుకొన్న విషయాన్ని స్పష్టంగా చెప్పింది అమృత. ఆమె తత్వానికి, మాటలకు వివేకానంద సంతోషించాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ovsvjVoAjps
Embed this episode
NOW PLAYING
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1 | Pragathi Premikulu episode 1 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.