ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 | Pragathi Premikulu episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 13, 2023 · 19 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 | Pragathi Premikulu episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'Pragathi Premikulu episode 12' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు యస్. ఐ. వివేకానంద పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం పూర్తి చేసాడు అతడు. రాజకీయ నాయకుడు ధనుంజయరావు, ఎస్సై వివేకానందను తన అదుపాజ్ఞలలో పెట్టుకోవా లనుకుంటాడు. వివేకానంద తండ్రి మృతి సహజం కాదనీ, అందులో వివేకానంద పినతండ్రి ధనుంజయ రావు ప్రమేయం ఉందని చెబుతాడు మేనమామ ఆదిశేషయ్య. తన బర్త్ డే కి విజయ్ ని ఇన్వైట్ చేస్తుంది అమృత. ధనుంజయరావు. కొడుకు ఉపేంద్రను హత్యానేరంపై అరెస్ట్ చేస్తాడు వివేకానంద. ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షను విదిస్తుంది కోర్ట్. హాస్పిటల్ కోసం కడుతున్న బిల్డింగ్ కూలిపోవడంతో 'ఏఈ' గా పనిచేస్తున్న తన తమ్ముడు విజయానందను, కాంట్రాక్టర్ ధర్మలింగాన్ని అరెస్ట్ చేస్తాడు వివేకానంద. ఇక ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 చదవండి. జైలునుండి విడుదలైన విజయానంద, ధర్మలింగాలను అమృత, వివేకానందలు కలిసి, జోగయ్య బృందం వలన మీకు హాని కలుగకుండా ఉండేదానికి అరస్ట్ చేయవలసి వచ్చిందని, మీరు నిర్దోషులని అసలు నేరస్తులను, జోగయ్యను పట్టుకొన్నామని, వారిచేత నేరాన్ని ఒప్పించామని, వారికి శిక్ష తప్పదని వివరించారు. ఆ నేరస్థులకు రొండు సంవత్సరాల కారాగార శిక్ష, తలా పాతికవేల జరిమానా జడ్జిమెంటులో వెల్లడయింది. ఆ రాత్రి వివేకానంద తమ్ముడు విజయానందను తన క్వార్టర్ కు రమ్మన్నాడు. విజయ్ వెళ్ళాడు. తమ్ముడిని సాదరంగా లోనికి ఆహ్వానించాడు వివేకానంద. “విజయ్..! నీకు నా మీద కోపంగా వుండా..!" అతని ముఖంలోకి దీనంగా చూస్తూ అడిగాడు వివేక్. అన్నగారి కళ్ళల్లో చుట్టుకొంటున్న కన్నీటిని చూచాడు విజయ్. అతని హృదయంలో తన అన్నయ్య పట్ల ఉన్నది గౌరవం, అభిమానం, ప్రేమ. వివేక వాలకాన్ని చూచిన విజయ్ కళ్ళల్లో కన్నీరు… "అన్నయ్యా..! నీవు నా అన్నయ్యవని చెప్పుకొనే దానికి నాకు గర్వంగా వుందన్నయ్యా..! నాకు నీ మీద కోపమా..! ఇప్పుడే కాదు అసలు ఎప్పటికీ రాదు. కారణం నీ వృత్తిని నీవు ఆరాధిస్తావు. కర్తవ్య నిర్వహణలో నీకు పక్షపాతం అన్నది లేదు. కొందరు ప్రజల్లో ఉన్న స్వార్ధం, ధ్వేషం, మోసం, అవినీతి, అహంకారం, నశించాలంటే నీలాంటి పోలీస్ ఆఫీసర్ ఈ రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో అవసరం. అప్పుడే గుండాలు, రౌడీలు అణగిపోతారు. వారి మనస్తత్వాల్లో సాటి వారికి పడ్డ శిక్ష సింహాస్వప్నం అవుతుంది. ఈ సిద్ధాంతాలు నమ్మి, ఆచరచించే నీవు నాకు అన్నవైనందుకు నాకు గర్వం, ఎంతో సంతోషం అన్నయ్య. ఏ నేరము చేయని నేను, నీవు నన్ను అరెస్ట్ చేసినప్పుడు భయపడలేదు. నిన్ను తలచుకొని ఎంతగానో ఆనందించాను." ఎంతో ఆవేశంతో చెప్పాడు విజయ్. తమ్మునికి తన పట్ల వున్న నమ్మకానికి, గౌరవానికి వివేకానంద సంతోషించి విజయ్ ను తన హృదయానికి హత్తుకొన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/8HhvnNCOS7Q

Episode metadata supplied by the publisher feed · Published Aug 13, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 | Pragathi Premikulu episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 19:04

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 13, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!