EPISODE · Jun 24, 2023 · 18 MIN
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 5 | Pragathi Premikulu episode 5 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 5' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 5' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 21 రోజులు నీటిని త్రాగలేదు. నీటితో నోరు పుక్కిలించి నప్పుడు కూడా, ఒక్కచుక్క నీరు గొంతులో క్రిందికి దిగకుండా నోటి కండరాలు మూసుకుపోయేవి. శిష్యులు యీ స్థితిని చూచి, తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినప్పుడు "మనస్సులో దృఢంగా నిశ్చయించుకొన్నప్పుడు, శరీరం దాన్ని అనుసరించి తీరాలి." నవ్వుతూ స్వామీజీ.. జవాబు చెప్పేవారు. ఆ రోజుల్లో వెలువడిన ఎన్ సైక్లోపీడియా బ్రిటానికా, కొత్త కూర్పును స్వామీజీ చదువసాగారు. ఆ పెద్ద గ్రంథాన్ని చూచిన ఒక శిష్యుడు దీన్ని పూర్తిగా చదవడానికి 'ఒక జీవిత కాలమైనా చాలదు' అన్నాడు. ఆ గ్రంధాన్ని శిష్యుని చేతికి యిచ్చి ప్రశ్నలను అడగమన్నారు. శిష్యుని ప్రశ్నలకు సరియైన సమాధానాలు యివ్వడమేకాక, ఆ సంపుటిలోని భాషనే తు. చ. తప్పకుండా విశదీకరించారు. అస్ఖలిత బ్రహ్మచర్యం పాటించే వారికందరికీ ఇది సాధ్యమే అని స్వామీజీ తెలియజేశారు. శిష్యుడు స్వామీజీ వారి ప్రతిభకు ముగ్ధుడైనాడు. చివరి రోజుల్లో ఒకనాడు సాయంత్రం స్వామీజీ వారు మఠ ఆవరణలో వున్న మామిడి చెట్టు క్రింద కూర్చొని వుండగా, వారి నుండి అద్భుతమైన ఆధ్యాత్మిక మహాశక్తి వ్యక్తమైంది. నేత్రాలు ఉజ్వల కాంతితో శరీరం దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ వుండగా, తన చుట్టూ చేరియున్న సన్యాసులను, బ్రహ్మచారులను, వుద్దేశించి స్వామీజీ ఇలా చెప్పారు. "బ్రహ్మాన్ని ఎక్కడ వెదుకుతావు.. ? అతడు ప్రతి జీవిలోనూ అంతర్నిహితుడై వున్నాడు. హృదయభాగాన్ని వత్తమాంగాన్ని చూపుతూ, ఇదిగో యిక్కడే ప్రత్యక్ష బ్రహ్మం వుంది. ఈ ప్రత్యక్ష బ్రహ్మాన్ని విడిచి, మరచి, ఇతరుల కోసం పాకులాడేవారు, హీనులు, కరతలామలకాల మాదిరి ఇదిగో యిక్కడే వుంది. ప్రత్యక్ష బ్రహ్మం. ” ప్రత్యక్షానుభూతితో కూడుకొన్న స్వామీజీ ఆ పలుకులు అక్కడ గుమికూడి వున్న వారి మనస్సులను తక్షణం వున్నత శిఖరాలకు లేవనెత్తాయి. ధ్యానానుభూత శాంత ఆనందాలతో వారి మనస్సులు తేలిపోతూ వుంటే, నిశ్చేష్టులై కొన్ని క్షణాల వరకూ అందరూ అచేతనంగా నిలబడి పోయారు. శారీరక రుగ్మతలు స్వామీజీ వారి మానసిక, ఆధ్యాత్మిక, శక్తులను వీసమంతైనా తగ్గించలేకపోయాయి. తాను ఇక ఎక్కువ కాలం జీవించబోనని ఎరిగిన స్వామీజీ క్రమక్రమంగా పనుల భారాన్ని సోదరశిష్యులకు, యితర శిష్యులకు అప్పగించారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/wE4tcnEHjk4
Embed this episode
NOW PLAYING
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 5 | Pragathi Premikulu episode 5 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.