ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6 | Pragathi Premikulu episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 1, 2023 · 18 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6 | Pragathi Premikulu episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 6' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "హాల్లో అందరూ కూర్చోవడానికి అరేంజ్ చేయండి. కోటయ్యగారూ..!" అని చెప్పాడు వివేకానంద. "అలాగే సార్. పది నిముషాల్లో అయిపోతుంది.” చెప్పి కోటయ్య వెళ్ళిపోయాడు. వివేకానంద కుర్చీనుంచిలేచి, ఆఫీస్లోని అన్ని గదులను, ఆఫీస్ వెనక వున్న ఖాళీ స్థలాన్ని, ముందున్న పరిసరాలను వీక్షించాడు. గదుల్లో ఫైల్సు క్రమంగా అమర్చి లేవు. వెనక వున్న ఖాళీ స్థలంలో నలిపిపారేసిన కాగితాలు ప్లాస్టిక్ కవర్లు, గడ్డి ఏకంగా వున్నాయి. తనకు ముందున్న పరంధామ్ ఆఫీస్ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకొన్నదీ అతనికి అవగాహన అయింది. వెనుదిరిగి హాల్లోకి వచ్చాడు. అందరూ నిలబడి వున్నాడు. వున్న కుర్చీలు, బెంచీలు హాల్లో చేర్చబడ్డాయి. తను ఒక కుర్చీలో కూర్చుంటూ... “అందరూ కూర్చోండి.” అన్నాడు వివేకానంద. అందరూ కూర్చున్నారు. అందరి కళ్ళూ వివేకానంద మీదే. హెడ్ కానిస్టేబుల్, వివేకానంద ప్రక్కగా నిలబడ్డాడు. అతన్ని చూచి, “మీరు కూర్చోండి సార్” అన్నాడు. వెనక వున్న స్టూలు మీద కోటయ్య కూర్చున్నాడు. “ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు మీకందరికీ తెలిసినవే. మీలో చాలామంది నాకంటే పెద్దవారు. ముందుగా అందరూ మీ పేర్లను చెప్పండి." అందరూ వారివారి పేర్లను చెప్పారు. “చాలా సంతోషం మనమందరం ఇకపై కలసి పని చేయబోతున్నాము. మనమధ్య చక్కటి అవగాహన అవసరం. ఇది మీకు తెలిసిందే. యీ ఆఫీస్ పరిసరాలు ఎలా వున్నాయో చూసారా..! మన చుట్టూ వున్న పరిసరాలను శుభ్రంగా వుంచుకోవడం మన బాధ్యత. మనం పబ్లిక్ సర్వెంట్లం. ఎందరో వస్తూ పోతూ వుంటారు. ఇప్పుడు ఆఫీస్ వెనక వున్న స్థితిని చూచి వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించండి. గదుల్లో ఫైల్సు గందరగోళంగా వున్నాయి. వాటినన్నింటిని క్రమంగా ఏది కావాలన్నా వెంటనే తీసుకొనగలిగేలా అమర్చుకోవడం ఎంతైనా అవసరం. ఇక డ్యూటీ విషయంలో సమయానికి విలువనివ్వాలి. విధి నిర్వహణలో తనమన బేధాలు వుండకూడదు. లంచాలను ఆశించకూడదు. నీతికి, న్యాయానికి కట్టుబడి వుండాలి. జనం మన చర్యలకు సంతోషపడాలి. పుట్టిన ప్రతి వ్యక్తి ఒకనాడు పైకి పోవలసిందే. మనం పోయినా, మన చుట్టూ వున్న జనం మనలను గురించి మంచిగా చెప్పుకొనే రీతిగా నడచుకోవడం నాకు ఇష్టం. నా తత్వాన్ని మీకు చెప్పాను. మనమందరం కలసి పనిచేయాలి కాబట్టి. ఇక మీరంతా నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇక మీరంతా మీ డ్యూటీని అటెండ్ చేయండి. జైహింద్, జై ఆంధ్రా." వివేకానందలేచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. వెనకాలే కోటయ్య వచ్చి, టేబుల్ కుడివైపున వున్న ఫైల్సును చూపిస్తూ, “మీరు వాటిని చూచి అవసరం అయితే నన్ను పిలవండి సార్.” వినయంగా చెప్పాడు కోటయ్య. “అలాగే కోటయ్యగారూ!...” Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/MuOwAU3cZVk

Episode metadata supplied by the publisher feed · Published Jul 1, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 6 | Pragathi Premikulu episode 6 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 18:55

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 18 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 1, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!