ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7 | Pragathi Premikulu episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 6, 2023 · 16 MIN

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7 | Pragathi Premikulu episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 7' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “సార్!” అన్న కోటయ్య పిలుపుతో వివేకానంద ఆలోచనలు ఆగిపోయాయి. ద్వారం వైపు చూచాడు. "ఏకాంబరం సార్ వచ్చివున్నారు సార్. " చెప్పాడు కోటయ్య. "రమ్మనండి. ” ఏకాంబరం సెల్యూట్ చేసి లోనికి వచ్చాడు. వివేకానంద కూర్చోమన్నాడు. అతను కూర్చొని, "సార్.. పి. పి. గారు మీతో ఒకసారి మాట్లాడాలన్నారు సార్.. ” అన్నాడు. “నేను మాట్లాడుతాను. ” పి. పి నెంబర్ను తీసికొని వివేకానంద యింటికి వెళ్ళిపోయాడు. రాత్రి భోజనానంతరం తల్లి భువనేశ్వరి, మామ ఆదిశేషయ్యలు ఫోన్ చేసి అన్నదమ్ముల యోగక్షేమాలు తెలిసికొన్నారు. చివరగా ఆదిశేషయ్య, ధనుంజయరావు వ్యవహారాల్లో జాగ్రత్తగా వర్తించవలసిందిగా హెచ్చరించాడు. తను ఆ వూరికి రాబోయే ముందు తల్లి, మామయ్య చెప్పిన మాటలు వివేకానంద మనోఫలకం మీద ప్రతిబింబించాయి. “అమ్మా.. !” హాల్లో సోఫాలో కూర్చొని వున్న తల్లిని పిలిచాడు యస్. ఐ వివేకానంద యింట్లోకి రాగానే. “ఏం నాన్నా. ” నవ్వుతూ అంది భువనేశ్వరి. “నాకు ప్రమోషన్ మీద ట్రాన్స్పర్ అయిందమ్మా. ” "ఏ వూరికి.. ?" “మన వూరికి. ” భువనేశ్వరి విచారంగా తలదించుకొంది. తల్లి వాలకం వివేకానందకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నవ్వుతూ ఆమె ప్రక్కన కూర్చున్నాడు. "ఏమ్మా.. ! నీకు సంతోషంగా లేదా.. !" “ఆ వూరి కాకుండా, వేరే ఏ వూరికైనా మార్పించుకోగలవా.. !” ఆర్ద్రతతో అతని ముఖంలోకి చూస్తూ అడిగింది భువనేశ్వరి. "సాధ్యం కాదమ్మా.. ! అవునూ.. అది మన సొంతవూరే కదమ్మా.. !" ప్రశ్నార్థకంగా తల్లి ముఖంలోకి చూచాడు వివేకానంద. “సొంత.. !” హా.. హా.. విరక్తిగా నవ్వింది భువనేశ్వరి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/xW6IA0nbQ8Q

Episode metadata supplied by the publisher feed · Published Jul 6, 2023

Embed this episode

NOW PLAYING

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7 | Pragathi Premikulu episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 16:32

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 16 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 6, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!