EPISODE · Feb 1, 2023 · 19 MIN
పరివర్తన | Parivarthana | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరివర్తన రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తమది సామాన్యమైన కుటుంబం. నాన్న ఒక్కరిదే సంపాదన. తనూ, అమూల్య వారి సంతానం. డిగ్రీ పూర్తి అయింది తనకు. అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి మరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయింది. దాని అదృష్టం ఉన్న ఊళ్లోనే సీట్ రావడం. తనూ ‘ అమూ’ ఎంతో సన్నిహితంగా ఉంటారు. చెప్పాలంటే మంచి స్నేహితులులాగ. తనకి అమూల్య అంటే పంచ ప్రాణాలు. దానికీ అంతే. అమ్మా నాన్నా మాట వినని అది తను ఎంత చెపితే అంత. తనకు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకోకుండా ఒక రోజున తెలుగు మాట్రిమోనీ లోని మీ అమ్మాయి సమీర ప్రొఫైల్ మాకు చాలా నచ్చింది, మా అబ్బాయి రిక్వైర్ మెంట్స్ కి బాగా కలసిందంటూ ఎవరో స్వర్ణలత అనే ఆవిడ ఫోన్ చేయడం, ఆ తరువాత పెళ్ళి చూపులూ అవీ చక చకా జరిగిపోయాయి. స్వర్ణలత కొడుకు ఐ. ఓ. సీ. ఎల్ లో కెమికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. పైగా స్తితిమంతులు. అమ్మా నాన్నకూ సంబంధం బాగా నచ్చడంతో ' ఏమ్మా 'మీరా', అదృష్టవంతురాలివి, సంబంధం నిన్ను వెతుక్కుంటూ వచ్చింది' నీకు ఆ అబ్బాయి నచ్చాడు కదూ అనేసరికి మౌనంగా తల ఊపింది. బాంబే లో దివాకర్ తో తన వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడుస్తుందని ఊహలల్లుకుంది. కానీ అటువంటి ఊహలకు, సరదాలకు, ప్రేమావేశానికి అర్ధమేమిటో తెలియని తన భర్తత తో నిస్సారమైన సంసారం మొదలైపోయింది. తప్పతాగి ఎప్పుడో అర్ధరాత్రి గాని ఇల్లు చేరడు. ఎంతకీ ఇల్లు చేరని భర్తకోసం నిండుయవ్వనంలో ఉన్న తను ఎదురు చూస్తుంటే అత్తగారు మాత్రం బాగా అలంకరించుకుని మామగారితో పార్టీలకు ఫంక్షన్సుకూ వెళ్లిపోయేది. అత్తగారితో చెపితే ‘వాడంతే, సర్దుకుపోవాలంటూ’ చెప్పేదేకానీ, కొడుకుతో తాగుడు మానేయమని గానీ, భార్యను ప్రేమగా చూసుకోమని గానీ చెప్పకపోవడం తనకు ఆశ్చర్యరంగా అనిపించేది. పైగా అత్తగారి తృణీకార ధోరణి, నిరాదరణ, డబ్బుగల వాళ్లమనే అహం, ఆ ఇంట్లో తన స్తానమేమిటో అర్ధం అయ్యేది కాదు. అందరూ తనను దూరంగానే ఉంచేవారు. స్వర్ణలత లేడీస్ క్లబ్ సెక్రటరీ. తన కొడుక్కి ఒక మధ్యతరగతి అమ్మాయిని కోడలుగా చేసుకుందని మంచి మనసున్న వ్యక్తి అని బయట మెప్పు సంపాందించింది. తన భర్త వ్యసనపరుడని, ములుకుల్లాంటి మాటలతో అత్తగారు, ఆడపడుచులు తనను గాయ పరుస్తున్నారన్న వాస్తవాన్ని అమ్మా, నాన్నకూ కనీసం తన ప్రియమైన చెల్లెలు 'అమూ' కి ఎందుకో చెప్పలేకపోయింది. ప్రేమకోసం, ఆదరణకోసం తపించే మనసు ఏ అమావాస్యకో పున్నమికో చాచిన అతని చేతుల్లో ఆత్మాభిమానాన్ని విడిచి కరగిపోయేది. అతనిలో ఏమాత్రం ప్రేమరాహిత్యం ఉండేదికాదు. తాగుడుమైకంలో ఇంటికి చేరడం, తిండి తినేసి దుంగలా పక్కమీద చేరి నిద్రపోవడం, పొద్దుట లేవగానే ఆదరాబాదరా ఆఫీసుకి పరుగెత్తడం. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/pDAZ6BMpeYI
Embed this episode
NOW PLAYING
పరివర్తన | Parivarthana | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.