EPISODE · Jan 6, 2023 · 4 MIN
పరోపకారం | Paropakaram | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరోపకారం రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తాతా! ఒక కధ చెప్పవా..” అంటూ సుబ్బారావు మనవడు గారాలుపోతో అడిగాడు. చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి "వెళ్లి మీ నాన్న ని అడగరా, కధలు బాగా చెపుతాడు. చిన్నప్పటినుండి నాకు మీ నాన్న చెప్పిన కధలు యిన్ని, అన్నీ కావు. అందుకనే ఇంజనీర్ కావలిసినవాడు, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు" అన్నాడు మనవడితో. "మధ్యలో నన్ను లాగుతారెందుకు, యిప్పుడు మాత్రం ఏమైంది, ఇంజనీర్ కంటే మా జీతమే ఎక్కువ "అన్నాడు కొడుకు కృష్ణ. "సరే పద, ఆలా మంచం మీద పడుకుని కధ చెప్పుకుందాం " అంటూ లేచాడు సుబ్బారావు. గొంతు సవరించుకుని, మనవడికి కధ చెప్పడం మొదలుపెట్టాడు. ‘పూర్వం’ అనగానే మనవడు, “ఛీ పూర్వపు కధ కాదు, నాకు యిప్పటి కధ చెప్పు తాతా” అని అడ్డం తగిలాడు. “అయితే విను. రామయ్య, సీతమ్మ లకు శంకర్ అనే కొడుకు వున్నాడు. తల్లిదండ్రుల కి ఒక్కడే కొడుకు కావడం తో శంకర్ ని అతిగారాభంగా పెంచడంతో పాటు మంచి బుద్దులు కూడా నేర్పించారు. పరోపకారార్థమే మనకి భగవంతుడు ఈ శరీరాన్ని యిచ్చాడని, వీలున్నంతవరకు అవసరమైన వారికి ఉపకారం చేయాలని చెప్పడం తో, శంకర్ తన తోటి స్నేహితులకు అవసరం పడినప్పుడు డబ్బు సహాయం చేయడం, ప్రతీ సెలవు రోజు దగ్గరలో వున్నా అనాధాశ్రమం లో పండ్లు, పాలు పంచిపెట్టడం చేసేవాడు. కొడుకు చేస్తున్న మంచి పనులకు అతని తల్లిదండ్రులు మురిసిపోతూవుండేవారు. కొన్నాళ్ళు కి శంకర్ కి పెళ్లి జరిగింది. పెళ్ళైన నుంచి అతని భార్య సెలవు రోజులలో బయటకి వెళ్లనివ్వకుండా అడ్డం పడేది. భార్య ని బాధ పెట్టడం యిష్టం లేక, సహాయ కార్యక్రమాలు ఆపి, యింటి పట్టునే వుండేవాడు. భార్య కి ఎన్నో విధాల యితరులకు సహాయపడటం వలన కలిగే ఆనందం గురించి చెప్పి చూసాడు. అయితే, ఆమె పిసినారి కావడం వలన, డబ్బంతా సహాయాలంటూ ఖర్చు చేస్తే మనం రోడ్డున పడాలిసివస్తుంది అని గొడవ పెట్టేది. ఒక రోజున యింట్లో ఎవరూలేని సమయంలో ఆమెకి విపరీతంగా కడుపునొప్పి వచ్చి, ఏడుస్తూ పక్క యింటి వారి సహాయం తీసుకుని, హాస్పిటల్ లో చేరింది. డాక్టర్ గారు ఆవిడని పరీక్షించి, ఆవిడ కడుపులో రక్తస్రావం అవుతోంది అని, వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/DJbbQxkp21w
Embed this episode
NOW PLAYING
పరోపకారం | Paropakaram | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.