EPISODE · Dec 15, 2022 · 6 MIN
పున్నమి రాత్రి | Punnami Rathri | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పున్నమి రాత్రి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆదివారం ఉదయాన్నే లేచిన కొడుకుని "అప్పుడే ఎందుకు లేచావు, కాసేపు పడుకో.. సెలవే గా" అన్నాడు త్రినాధ్ రావు. "లేదు డాడీ, నేనూ మా ఫ్రెండ్స్ కలిసి కారులో శ్రీశైలం రోడ్డులో వున్న వాటర్ఫాల్స్ చూడటానికి వెళ్తున్నాము" అన్నాడు శశి. "ఒరేయ్! అంతదూరం కారులో ఎందుకు, కావాలంటే ఏ సినిమా కో వెళ్ళండి. అసలే అమ్మ అమెరికా లో వుంది. కారులో నిన్ను పంపించానని తెలిస్తే గొడవ పెడుతుంది" అన్నాడు త్రినాద్ రావు కొడుకు తో. "సరే డాడీ, మిమ్మల్ని కారులో మీ ఆఫీసులో దింపేసి నేను కారు తీసుకువెళ్తాను. రిటర్న్ లో మిమ్మల్ని పికప్ చేసుకుంటాను" అని అన్నాడు. 'వాడి పంతం వాడిది, కూతురు చాలా భయస్తురాలు, వీడికే ఈ దుందుడుకు స్వభావం వచ్చింది' అనుకుని, తను కూడా త్వరగా తయారై ఆఫీస్ లో దిగి, కారు కొడుకు కి యిచ్చి, "జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి, స్పీడ్ వద్దు" అని చెప్పి పంపించాడు. రాత్రి 7గంటలు అయినా కొడుకు తనని తీసుకువెళ్ళడానికి రాలేదు సరికదా, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. త్రినాధ్ రావు కి కంగారు పుట్టింది. 9 అయింది, ఆఫీస్ లో తను తప్ప ఎవరూ లేరు. కొడుకు మీద విపరీతంగా కోపం, ఏమైందో అని భయం తో సతమత పడుతావుండగా, కొడుకు నుంచి ఫోన్ వచ్చింది. "డాడీ, car కి ఆక్సిడెంట్ అయింది, మాకు ఏమి దెబ్బలు తగలలేదు, కానీ కారు బాగా దెబ్బతింది. కదలడం లేదు" అన్నాడు. "ఎక్కడ జరిగింది?" అని అరిచాడు త్రినాధ్ రావు. "శ్రీశైలం అడివిలో జరిగింది" అన్నాడు బయపడుతో. "అక్కడికి ఎందుకు చచ్చావ్, నువ్వు సినిమా కి అని శ్రీశైలం ఎందుకు వెళ్ళావు? "అన్నాడు కోపం పట్టలేక కొడుకుతో. అటునుంచి జవాబు లేదు. ఏమిచేయాలో పాలుపోక, చివరికి తన వనపర్తి ఆఫీస్ ఇంజనీర్ కి ఫోన్ చేసి, జరిగింది చెప్పి, "ఎలాగైనా వాళ్ళని మీ దగ్గర కి తెప్పించండి" అని అడిగాడు త్రినాధ్ రావు. ఆఫీస్ లో మంచి పేరు వుండటం తో, త్రినాధ్ రావు అడగగానే, ఆ ఇంజనీర్, "కంగారు పడకండి రావు గారు, పిల్లలు కి ఏమి కాలేదుగా.. నేను ఆ రోడ్డు కాంట్రాక్టర్ ని పంపి మీ పిల్లలు ఎక్కడ వున్నారో తెలుసుకుని, సేఫ్ ప్లేస్ లో రాత్రి కి వుంచుతాను" అన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/OAzvcwJ82oc
Embed this episode
NOW PLAYING
పున్నమి రాత్రి | Punnami Rathri | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.