పునర్జన్మ | Punarjanma | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 23, 2022 · 19 MIN

పునర్జన్మ | Punarjanma | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పునర్జన్మ రచన, పఠనం: కే. లక్ష్మీ శైలజ ఆ రోజు ఆదివారం. ఉదయం అమ్మ, నాన్న లతో కలిసి కాఫీ తాగుతూన్నప్పుడు సునయన ఇలా అంది. "అమ్మా, నేను కళ్ళు, ఇంకా ఒక ఐదు అవయవాలు దానం చేయడానికి ‘ఆర్గాన్ డోనర్ కార్డు’ తీసుకుందామనుకుంటున్నాను" అంది. "అంటే" అన్నది అయోమయంగా వాళ్ళమ్మ. "అంటే, నేను నా మరణానంతరం నా కళ్ళు, ఇంకా ఏ అవయవాలు ఇతరులకు దానం ఇవ్వవచ్చో అవి దానం ఇస్తాను, అని హాస్పిటల్ వాళ్లకు వ్రాసి ఇవ్వడమన్న మాట. " అంది సునయన. "అయ్యో, అయ్యో, అవేమి మాటలే?" రమ గట్టిగా అన్నది. "ఏమిటమ్మా" ఆందోళన గా అన్నాడు, వాళ్ళ నాన్న చలపతి. "నాన్నా, నిన్న మా స్నేహితురాళ్ళమందరం కలిసి ‘బ్లైండ్ చిల్డ్రన్ హోం’ కు వెళ్ళాము. అక్కడ కళ్ళు లేని పిల్లలను చూశాము. వాళ్ళనలా చూస్తుంటే ఎంతో బాధనిపించింది నాన్నా. మన ఊర్లోనే ఇంత మందికి కళ్ళు లేకుంటే ఇంక మిగతా ఊర్లల్లో ఎంత మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో కదా! మనం చనిపోయిన తరువాత మన కళ్ళు దానం చేస్తే ఇద్దరి జీవితాలు ప్రపంచాన్ని చూస్తాయి. మనం చనిపోయి మళ్ళీ పుట్టిన వాళ్ళ మవుతామమ్మా!" అంది వాళ్ళ నాన్నకు, అమ్మకు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తూ. చలపతి కూడా అవయవదానం విషయం విని వున్నాడు కనుక ఆందోళన పడకుండా ఆలోచిస్తున్నాడు. కానీ అప్పట్నుంచి వాళ్ళమ్మ.. అవయవ దానమంటే ఏదో విపరీతమన్నట్లుగా బాధ పడ్తోంది. "ఎందుకమ్మా అలా, కన్నీళ్లు పెట్టుకొంటావు?" అన్నది సునయన నిస్సహాయంగా వాళ్ళమ్మ రమను చూస్తూ. "ఒక్కగానొక్క నలుసువి. ఎన్నో పూజలు చేసి కన్నాను నిన్ను. నువ్విలాంటి అశుభం మాటలు మాట్లాడితే కళ్ళనీళ్ళు పెట్టుకోక ఏం చేయను?" అంటూ కళ్ళు తుడుచుకుందామె. అది చూసి, సునయన వాళ్ళ నాన్న కూడా "అదికాదమ్మా, అసామాన్యమైన పనులు మనకెందుకు చెప్పు?" అన్నాడు, అనునయం గా. "అదేంలేదు నాన్నా, మనం తలచుకుంటే ఇదేమంత కష్టమైన పనేమీ కాదు. ఎంతో అవసరమైన పని. మన జీవితానికి మరో జన్మనిస్తుంది. మనం పోతూ.. పోతూ.. ఒక మంచి పనిని చేసిన వాళ్ళమవుతాము. అయినా అది ఎప్పటి సంగతో కదా, ఇప్పుడు 'డిక్లరేషన్' కదా ఇస్తున్నది. దానికెందుకింత భయం? " Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/udl7ttLfmII

Episode metadata supplied by the publisher feed · Published Dec 23, 2022

Embed this episode

NOW PLAYING

పునర్జన్మ | Punarjanma | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

0:00 19:47

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 23, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!