EPISODE · Mar 3, 2023 · 5 MIN
పుస్తకం | Pusthakam | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పుస్తకం రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రైలు స్పీడందుకుంది. కిటికీ లోంచి గాలి చల్లగా తగులుతుంది. నా లోయర్ బెర్త్ న నేనే ఉన్నాను. నాకు నచ్చినట్టు సర్దుకు కూర్చున్నాను. చేతిలోని పుస్తకం ఊరిస్తుంది. మడత పెట్టుకున్న పేజీ లగాయితు.. తిరిగి చదవడం మొదలు పెట్టడానికి.. పుస్తకం తెరుస్తుండగా.. ఎదురు బెర్త్ వైపు నుండి మాటలు చకచకా వినిపించగా.. పుస్తకం మూసి అటు చూసాను. ఎదురు లోవర్ బెర్త్ మీద ఇద్దరు ఉన్నారు. ఒకరు యువకుడు.. మరొకరు పెద్దాయన. "నీ బెర్త్ ఎంత." అడిగేడు యువకుడు.. పెద్దాయనని. ఆయన తన కుడి చేతి బొటన వేలుతో పైకి చూపాడు. "అప్పరా." అడిగాడు యువకుడు. "కాదు. మిడిల్." చెప్పాడు పెద్దాయన. "ఈ బెర్త్ నాది. ఖాళీ చేయ్." చెప్పేసాడు యువకుడు.. కాస్త కటువుగానే. "ఇది పగలు కదా. కూర్చోవచ్చుగా." పెద్దాయన చెప్పాడు. "డబ్బులు కట్టి దీన్ని నాకై బుక్ చేసుకున్నా." అసహనం చూపుతున్నాడు యువకుడు. "పడుకుంటావా." అడిగేడు పెద్దాయన. "కూర్చుంటాను." విసుగవుతున్నాడు యువకుడు. "మరి కూర్చొనే ఉన్నావుగా." తేలిగ్గా అనేసాడు పెద్దాయన. నన్ను వింత పరుస్తుంది వాళ్ల సంభాషణ. "అయ్యా. నాకు ఇలా నచ్చదు. ఖాళీ చేయ్." చిరాకయ్యాడు యువకుడు. "నేను మిడిల్ కు వెళ్తే.. ఏం కూర్చోగలవు." అమాయకంగా అన్నాడు పెద్దాయన. సర్రున ఏదో గొణుగుతున్నాడు యువకుడు. పెద్దాయన లేచాడు. ఆ వెంబడే.. నన్ను చూస్తూ.. "ఇక్కడ కూర్చొవచ్చా." అడిగాడు. నేను కదిలాను. తిరిగి సరిగ్గా కూర్చున్నాను. "సరే." అన్నాను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/7NBvZ6el530
Embed this episode
NOW PLAYING
పుస్తకం | Pusthakam | Telugu Short Story | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.