EPISODE · Jun 19, 2022 · 7 MIN
పూల బాట వెయ్యండి | Pula Bata Veyyandi | Telugu Short Story | Ramakuru Lakshmimani | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పూల బాట వెయ్యండి రచన:రామకూరు లక్ష్మి మణి “అబ్బా! హాయిగా ఉందండి, నారాయణ గారు.. మీ ఇంటి వాతావరణం ...చక్కగా బోల్డు చెట్లు వేశారు ఇంటి ముందు..” అన్నాడు కేశవ్. లోపలి ప్రవేశిస్తూనే, మంచి గాలి వీస్తూ పచ్చని చెట్లతో కనులవిందుగా అనిపించింది. ఇంట్లోకి ప్రవేశించే మెట్ల పక్కన రంగురంగుల పూలతో కుండీలు స్వాగతం పలికాయి. నారాయణ, కేశవ్ ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులు...నారాయణ కేశవ్ కన్నా సీనియర్. కేశవ్ నారాయణ చేసే బ్యాంకు కి కొత్తగా ట్రాన్స్ఫర్ అయి వచ్చాడు. బ్యాంకు కి దగ్గరగా ఇల్లు చూసుకోడానికి నారాయణ సహాయం అడిగాడు. ఇదివరకు చేసే బ్రాంచ్ కి దగ్గరలో ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే అది చాల దూరం అవటం వలన ప్రస్తుతం చేస్తున్న చోటికి రావడానికి రోజూ ఇబ్బంది పడుతున్నాడు. తమ రోడ్డులోనే ఇల్లు ఖాళీగా ఉంది, చూడటానికి రమ్మని తనతోబాటు తీసుకు వచ్చాడు నారాయణ .. ఇల్లు చూసారు, చాలా నచ్చింది కేశవ్ కి. మర్నాడు భార్యని కూడా తీసుకొచ్చి చూపించి అడ్వాన్స్ ఇస్తానని ఇంటి ఓనర్స్ కి చెప్పి వచ్చాడు. ఇంతదూరం వచ్చారు మా ఇంటికి రండి అంటూ నారాయణ ఆహ్వానంతో వాళ్ళింటికి వెళ్ళాడు. నారాయణ భార్య రాధిక లోపల్నించి వచ్చి నమస్కారం చేసింది. ముందు రూమ్ లో కూర్చున్నారు. అన్నీ చక్కగా నీట్ గా మంచి కళాత్మకంగా సర్ది ఉన్నాయి. ఇంతలో నారాయణ ఇద్దరు కొడుకులు లోపల్నించి వచ్చారు. మంచినీళ్ల గ్లాసులతో ఒకరు, టీ కప్స్ పట్టుకుని ఒకరు. నారాయణ పరిచయం చేసాడు. చిన్నవాడు టెన్త్ క్లాస్, పెద్దవాడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వాళ్ళు వినయంగా నమస్కరించి లోపలి వెళ్లి పోయారు.. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/LLdKq7d-aK0
Embed this episode
NOW PLAYING
పూల బాట వెయ్యండి | Pula Bata Veyyandi | Telugu Short Story | Ramakuru Lakshmimani | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.