రైతు బిడ్డ | Raithu Bidda | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com episode artwork

EPISODE · Jun 26, 2023 · 5 MIN

రైతు బిడ్డ | Raithu Bidda | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Raithu Bidda' - New Telugu Story Written By Pitta Gopi 'రైతు బిడ్డ' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎప్పుడూ లేని విధంగా దేశం అంధకారం లో ఉంది. ఎంతగా అంటే.. దాదాపుగా అన్ని రంగాలు మూసుకుపోయాయి. తాగటానికి సమృద్ధిగా నీళ్ళు దొరుకుతున్నా.. వాతావరణం కొద్దో గొప్పో అనుకూలంగా ఉన్నా.. ఎక్కడ చూసినా ఆకలి కేకలు, ఆకలి చావులే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలే కాదు.. నింగికి వెళ్ళి వచ్చేలా అభివృద్ధి సాధించిన మన సాంకేతిక పరిజ్ఞానం, గుండె తీసి గుండెను అమర్చ గలిగే మన మేథాతనము, 5జీ అంటూ పరిచయం అయిన కొత్త నెట్వర్క్ లు కూడా తలవంచాయి. ఇంత అభివృద్ధి చెందిన మన దేశం ఈ సమస్య ను ఎదుర్కోలేకపోయిందంటే.. ప్రతి ఒక్కరు ఆలోచనలో పడాలి. కారణం తెలుసుకోవాలి. ఆ కారణం ఎవరంటే.. ఒక రైతు బిడ్డ.. అతనికి మిగిలిన రైతులు తోడవటంతో ఈ పరిస్థితి వచ్చింది. ఆ రైతు బిడ్డ విశ్వేశ్వర సూరన్న. సూరన్నకు వందేళ్ళు. కాస్త బక్కచిక్కిన వాడైనా.. తన పనులు తాను దర్జాగా చేసుకు తిరగగల శక్తి ఇంకా ఉంది ఆయనలో. దేశం దీనస్థితిలో ఉండటానికి కారణం ఆయనే అంటూ వార్తలు వస్తుండటంతో ఆయన పౌరుషంతో నోరు విప్పాల్సి వచ్చింది. "ఎవడ్రా ఈ వార్తలు రాసింది.. రైతు బిడ్డలం.. వందేళ్ల నా జీవితంలో పొలంలో మా కష్టాలను ఎవడూ పట్టించుకుని వార్తలు రాయలేదు కానీ.. ఇప్పుడు ఎవరో.. వ్యవసాయం తెలియని వాళ్ళు, రైతు కష్టాలు తెలియని వాళ్ళు, మట్టి అంటే అసహ్యించుకునే వాళ్ళు ఆకలితో చస్తే.. తాటికాయంత అక్షరాలు రాస్తారా ".. అన్నాడు. "సార్! ప్రజలంతా ఆకలితో చస్తుంటే.. మీరు ఇలా మాట్లాడ్డమూ.. " సంకోచిస్తు అడిగాడు ఒక రిపోర్టర్. "హే ఆపరా.. ప్రజలంతా కాదు, పొలం ఉన్న ప్రతి ఒక్కరూ, పొలం లేని ప్రతి పేదోడు ఇప్పుడు బాగానే ఉన్నాడు. మిగిలిన చెత్తమంద మాత్రమే ఈ పరిస్థితి అనుభవిస్తున్నారు" అన్నాడు సూరన్న. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WKm9ekZMxD8

Episode metadata supplied by the publisher feed · Published Jun 26, 2023

Embed this episode

NOW PLAYING

రైతు బిడ్డ | Raithu Bidda | Telugu Short Story |Pitta Gopi | manatelugukathalu.com

0:00 5:58

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 5 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on June 26, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!