రేడియో కొన్నాము | Radio Konnaamu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 10, 2022 · 8 MIN

రేడియో కొన్నాము | Radio Konnaamu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రేడియో కొన్నాము రచన: లక్ష్మి మదన్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజుల్లో వినోదానికి రేడియోలు ఎక్కువగా ముఖ్యపాత్ర పోషించాయి. కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సినిమా హాళ్లు ఉండేవి. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చి ఆహాలులో సినిమాలు చూసేవాళ్ళు.. కానీ అందరికీ వీలు అయ్యే విషయం కాదు కదా! రేడియో అయితే ఇంటింటా ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడేది. అయితే మా ఇంట్లో రేడియో ఉండేది కాదు. చుట్టుపక్కల అందరిళ్ళల్లో పాటలు వస్తుంటే మాకు రేడియో కావాలని ఎంతో ఆశగా ఉండేది... కానీ మా బాపు ఎందుకో రేడియో కొనడానికి సుముఖంగా లేడు.... కొన్నాళ్లు గడిచాక మా ఇంటికి ఒక కోమట్ల ముసలమ్మ వచ్చేది. ఆమెను ఇంట్లో వాళ్ళు సరిగా చూసేవాళ్ళు కారట. అందుకని ఎవరో చెప్పారట మా ఇంటికి వెళ్ళమని.. అప్పటి నుండి రోజు పొద్దున మా ఇంటికి వచ్చి రాత్రి వరకు కూర్చొని వెళ్ళిపోయేది. ఉన్నంతలో అమ్మ ఆమెకు భోజనం పెట్టేది . "అమ్మా! మీ బ్రాహ్మణుల సొమ్ము తింటున్నా నేను" అని బాధపడింది .. అయితే అమ్మ చెప్పింది.. “అట్లా అనుకోవద్దు. మాకు ఉన్నంతలో నీకు పెడుతున్నాము. తృప్తిగా భోజనం చేయి" అని చెప్పింది.. ఆమె ఎంతో సంతోషంగా రోజు భోజనం చేసేది. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఒక 100 రూపాయలు తీసుకుని వచ్చి మా అన్నయ్య చేతిలో పెట్టి నమస్కారం చేసింది.. "అయ్యో ఎందుకమ్మా ఈ పైసలు మాకిస్తున్నావ్ ?” అని అందరము అడిగాం.. కానీ ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని “మా ఇంటి వాళ్లే నన్ను చూడలేదు.. మీరు ఇన్ని రోజులు నుండి నన్ను చూస్తున్నారు.. నాకు ఉన్నంతలో మీకు ఇస్తున్నా. నన్ను బాధ పెట్టకుండా తీసుకోండి" అని బ్రతిమిలాడింది. ఇంక చేసేది లేక ఆ డబ్బులు తీసుకున్నాము. అయితే ఆ రోజుల్లో 100 రూపాయలు చాలా గొప్ప విషయం. "అమ్మో! వంద రూపాయలా"😨😊 అని అనుకున్నాము. ‘వీటితో ఏం చేయాలి’ అని ఆలోచించుకున్నాము. తర్జనభర్జనలు చేసిన పిమ్మట ‘మనకు రేడియో లేదు కదా.. రేడియో కొనుక్కుందా’మని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా మా అందరి గల్లా సొరుగుల నుండి డబ్బులు తీసాము. అన్నీ కలిపి దాదాపు 180 రూపాయలు అయ్యాయి... వాటిని తీసుకొని మా ఇంటికి ఎదురుగా ఉన్న మా బంధువుల మనిషికి ఇచ్చాము . అతని పేరు విశ్వన్న... "మాకు మంచి రేడియో తెచ్చి పెట్టు విశ్వన్నా..." అని అడిగాము.. "ఏం కంపెనీ రేడియో తేవాలి " అని అడిగిండు... " ఏదైనా సరే ఈ డబ్బులకు వచ్చేది తీసుకొని రా "అని చెప్పాము. ఒక వారం తర్వాత ఆయన పట్నం వెళ్ళినప్పుడు ఒక రేడియో కొనుక్కొని తెచ్చాడు. ఫిలిప్స్ అనుకుంటా.. ఇంక మా సంతోషానికి అవధులు లేవు. ‘మా ఇంట్లో రేడియో ఉంది.. మా ఇంట్లో రేడియో ఉంది💃🏽💃🏽’ అని మురిసిపోతూనే ఉన్నాము. ఎదురుగా ఒక కొయ్య కొట్టి ఆ కొయ్యకు ఈ రేడియో తగిలించాము.. దాని చుట్టుపక్కలే కూర్చొని అన్ని కార్యక్రమాలను వినేవాళ్ళం ... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/JIudxOLEyZ4

Episode metadata supplied by the publisher feed · Published Dec 10, 2022

Embed this episode

Ready to play

రేడియో కొన్నాము | Radio Konnaamu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com

0:00 8:31

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 10, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!