EPISODE · Aug 23, 2023 · 9 MIN
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2 | Raghupathi Raghava Rajaram Episode 2 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
'Raghupathi Raghava Rajaram Episode 2 - New Telugu Web Series Written By Parupalli Ajay Kumar 'రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: పారుపల్లి అజయ్ కుమార్ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాలేజీ లెక్చరర్ గా పని చేస్తుంటాడు రఘుపతి. కాలేజ్ దగ్గర స్పృహ కోల్పోయి పడున్న స్త్రీని చూస్తాడు. ఆ యువతిని గ్రామంలో తమ ప్రత్యర్థి సీతయ్య బావమరిది శేషగిరితో చూసినట్లు పోలీసులతో చెబుతాడు. స్పృహ వచ్చిన ఆయువతి తనని శేషగిరి, అతని స్నేహితులు సామూహిక అత్యాచారం చేసినట్లు చెబుతుంది. ఇక రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2 చదవండి.. వెంకటాయపాలెం లో మోహన్ గాంధీ మోతుబరి రైతు. గాంధీ తండ్రి బలరామయ్య స్వాతంత్ర సమరంలో పాల్గొన్నాడు. పక్కా గాంధేయవాది. లేక లేక పుట్టిన తన కొడుకుకు జాతిపిత గాంధీ గారి పేరు పెట్టుకున్నాడు. మహాత్మా గాంధీ ఆశయాలను తాను త్రికరశుద్ధిగా పాటిస్తూ వాటిని కొడుకు కు నూరి పోసేవాడు. గాంధీకి తండ్రి అంటే వల్లమాలిన ప్రేమ. తండ్రి మాటను ఎప్పుడూ జవదాటలేదు. సత్యం, అహింస మొదలైన సుగుణాలన్నీ తండ్రినుండి పుణికి పుచ్చుకున్నాడు. గాంధీ భార్య సత్యవతి కూడా భర్తకు తగ్గ ఇల్లాలే. మామగారిని తండ్రిలా ఆదరించి గౌరవించేది. గాంధీకి ముగ్గురు మగపిల్లలు. బలరామయ్య వారికి రఘుపతి, రాఘవ, రాజారాం అని పేర్లు పెట్టాడు. ముగ్గురూ తాతగారి స్వాతంత్ర పోరాట కథలను వింటూ పెరిగారు. ముగ్గురిలో రఘుపతి నెమ్మదైన వాడు. రాఘవ కొద్దిగా ఆవేశపరుడు. రాజా మధ్యస్తంగా వుండేవాడు. రఘుపతి M . sc . చదివి కాలేజ్ సర్వీస్ కమీషన్ పరీక్ష పాస్ అయి మండల కేంద్రం లో వున్న ప్రభుత్వ జానియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. రాఘవ ఇంటర్ తో చదువుకి స్వస్తి పలికి వ్యవసాయం చేస్తున్నాడు. రాజారాం మెకానికల్ ఇంజనీరింగు ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ముగ్గురు అన్నదమ్ములు ఒకేమాట, ఒకే బాట అన్నట్లుగా వుంటారు. ఒకరంటే ఒకరికి ఎనలేని ప్రేమ. అనురాగాలకు, అనుబంధాలకు ఆ ఇల్లు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది. ఉద్యోగం రాగానే రఘుపతికి పెళ్ళి చేసారు. విశాల డిగ్రీ చదివింది. ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలిగా బాగా కలిసిపోయింది. రాఘవ, రాజా వదిన దగ్గర బాగా గారాలు పోతారు. ఏది కావలసిన ముందుగా వదినకే చెపుతారు. విశాల కూడా వారి కోరికలను నవ్వుతూ నెరవేరుస్తుంది. తల్లి తండ్రులతో, అన్నతో పంచుకోలేని విషయాలను కూడా వదినతో చెపుతుంటారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/VWU7uQEFOGM
Embed this episode
NOW PLAYING
రఘుపతి రాఘవ రాజారాం ఎపిసోడ్ 2 | Raghupathi Raghava Rajaram Episode 2 | Telugu Web Series | Parupalli Ajay Kumar | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.