EPISODE · May 7, 2022 · 18 MIN
రిటైర్ మెంట్ | Retirement | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
రిటైర్ మెంట్ B,లక్ష్మీశర్మ త్రిగుళ్ళ “ఏమండి… కాఫీ చల్లారిపోతుంది ఏమిటాలోచిస్తున్నారు? ముందు కాఫీ తాగండి ఎంతసేపయింది మీకు కాఫీ ఇచ్చి. మర్చిపోయారా! ఏమిటో అంత పరధ్యానం” అంటూ తను ప్రక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ. “అరే, మర్చిపోయాను” అంటూ కాఫీ కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ, “అన్నపూర్ణ… నీతో కొన్ని విషయాలు చెప్పాలి. విన్న తరువాత నన్ను అపార్థం చేసుకోవు కదా” అడిగాడు సాంబమూర్తి. “ఏమండి… మీరు నన్నర్ధం చేసుకున్నది ఇంతేనా! ఇన్నాళ్ళ మన కాపురంలో నేనెప్పుడైనా మిమ్మల్ని తప్పుపట్టాన చెప్పండి? అయినా… అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు, తరువాత బాధపడడం ఎందుకు చెప్పండి, ” అంది అన్నపూర్ణ. “అదికాదు పూర్ణా!…నిన్ను పెళ్ళి చేసుకున్ననాటి నుండి, నీతో ప్రేమగా మాట్లాడిందిగానీ, నిన్ను ఆప్యాయంగా చూసిందిగానీ లేదు. అయినా నువ్వు నిండుకుండలా అన్నింటికీ భూమాతలా సహనం వహించావు. ఏనాడూ నన్ను నిలదీసి ఎందుకిలా చేస్తున్నావు అని అడిగింది లేదు. నీలాంటి ఉత్తమురాలి మనసు బాధపెట్టానేగానీ, నిన్ను అర్థంచేసుకుని నీకు బాసటగా నిలబడలేకపోయాను. పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణా! నువ్వు నన్నడిగిన చిన్న కోరిక ఇప్పటివరకు తీర్చలేకపోయాను. అందుకే నీ క్షమాపణ పొందాలని వుంది” అన్నాడు సాంబమూర్తి. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/Qd6sEFEc38g
Embed this episode
NOW PLAYING
రిటైర్ మెంట్ | Retirement | Telugu Short Story | B Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.