రియల్ హీరో | Real Hero | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com episode artwork

EPISODE · Jul 2, 2023 · 4 MIN

రియల్ హీరో | Real Hero | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Real Hero' New Telugu Story Written By Hanumantha T 'రియల్ హీరో' తెలుగు కథ రచన: T హనుమంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మామిడి తోరణాలు, పూలమాలలు, మారుమ్రోగే మైక్సెట్లు, కిలకిల నవ్వే పరిచయాలు, ముహూర్తం తొందర పడుతుందనే హడావుడి.. అరటి దిండులతో పందిరి వేసి పూలతో అలంకరించారు. వధూవరులకు పసుపు నీటితో స్నానాలు చేయించారు. ఊరుఊరంతా వివాహ వేడుకను చూడవచ్చారు. పంతులు గారు ఆలస్యమైందని తొందర చేస్తున్నాడు. వరుడికి పంచకట్టు, తలపాగా చుట్టటానికి నానా అవస్థలు పడుతున్నారు. వధూవరులు పెళ్లిపీటలు మీద కూర్చున్నారు పంతులు గారు ఆలస్యమైందని తొందరగా జీలకర్ర బెల్లం తలపై పెట్టించి, మంత్రాలు చదివి మూడుముళ్లు వేయించాడు. అక్షింతలు వేసి వారు తెచ్చిన కానుకలు ఇస్తూ వారికి నచ్చిన విధంగా శుభాకాంక్షలు తెలియజేశారు. భోజనాలు ముగించుకుని చుట్టాలంతా వెళ్లి పోయారు. షామియానా, లైట్లు, వంటసామాన్లు, కుర్చీలు అన్ని టెంట్ హౌస్ దగ్గరికి జాగ్రత్తగా చేర్చడానికి నానా కష్టాలు పడుతూ అమ్మాయ్య అనుకుంటూ అరుగు మీద కూర్చొన్నాడు. తన చెల్లి నీళ్ళు ఇస్తూ, కళ్ళు తుడచు కొంటూ “అదృష్టవంతురాలు అన్నయ్య! మంచి అబ్బాయి దొరికాడు” అంటే.. బాధను బయట పెట్టేలేక తల ఊపుతూ లోపలికి వెళ్లి పోయాడు. రాత్రి 7 గంటలు కావస్తోంది ఉదయం మిగిలిన వంటకాలను చుట్టుపక్కల వారికి పంచిపెట్టి పెళ్లి కూతురు తండ్రి, అతని చెల్లెలు తిని చెల్లిని ఇంటి దగ్గరే ఉండమని చెప్పి వరుడి ఇంటికని బయలుదేరుతాడు. వధూవరులు ఊరేగింపును వరుడి ఇంటివారు అద్భుతంగా నిర్వహించారు, రాములోరి గుడిగుడిలో పూజా కార్యక్రమం ముగించుకుని ఇంటికి చేరుకునే సరికి 10 గంటలు అయింది. వరుడు భోజనం తర్వాత అలా పెరట్లో కూర్చొన్నాడు. వధువు తండ్రి “ఏం బాబు.. ఏమైనా ఇబ్బందా?” అని అడిగాడు. వరుడు లేచి “అలాంటిది ఏమీలేదు మామా” అని అన్నాడు. వెంటనే వధువు తండ్రి అతని భుజం పై తలవాల్చాడు. “పిచ్చి పిల్లని నువ్వే చూసుకోవాలి బాబు, మీ ఇంట్లో వద్థన్నా కూడా ఒప్పించి మరీ చేసుకున్నావు. నీ ఋణం ఎలా తీర్చుకోను..” అని బాధ పడ్డాడు. వధువు తండ్రి బాధకు కారణం తెలుసుకుందాం.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి.

Episode metadata supplied by the publisher feed · Published Jul 2, 2023

Embed this episode

NOW PLAYING

రియల్ హీరో | Real Hero | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com

0:00 4:13

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 4 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on July 2, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!