EPISODE · Jul 21, 2023 · 6 MIN
రక్షణేది | Rakshanedi | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Rakshanedi' - New Telugu Story Written By Pitta Gopi 'రక్షణేది' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ప్రస్తుతం ప్రపంచమంతా హత్యలు, ఆత్మహత్యలు, రేప్ లు, గ్యాంగ్ రేప్ లు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలతో నిండి కిటకిటలాడుతున్నది. డబ్బులు కోసం పరాయివారినే కాదు సొంత వాళ్ళని సైతం చంపుకునే రోజులు, ఇక ఆడపడుచులు అంటే ఈ సమాజానికి లెక్కే లేదు. ఎక్కడైనా ఆడపిల్లలు కనపడితే ఇంకో ఉద్దేశ్యం తో చూడటమే.. కొందరు ప్రేమ అని వెంటపడతారు, మరి కొందరు పెళ్ళి చేసుకో అంటూ వెంట పడతారు. ప్రేమిస్తే తల్లిదండ్రులు, పెద్దల నుండి ఒక బాధ, ప్రేమించకపోతే ప్రియుడు ఏ యాసిడ్ పోసేస్తాడో.. లేక గొంతు కోసేస్తాడో.. లేక పొట్టలో ఎన్నిసార్లు కత్తితో పొడిచి చంపేస్తాడో తెలియని బాధ. ప్రేమించేవాడు మంచోడైతే తల్లిదండ్రులు ఒప్పుకోరు, పెద్దలు చూసిన పెళ్ళైనా కట్నం వేదింపులు తప్పవు. అందంగా లేకపోతే అందంగా లేవంటారు.. అందంగా ఉంటే అనుమానంతో రగిలిపోతారు. ఏదైతేనేం నలిగిపోతుంది ఈ ఆడపిల్ల బతుకు.. " కూర్చుని కూరగాయలు తరుగుతూ పురంధరేశ్వరి అంటున్న మాటలు ఇవి. సైలాక్ అనే అమ్మాయికి యుక్త వయస్సు వచ్చి MBBS లో చేరి హాస్టల్ లో ఉండటంతో నానమ్మ పురంధరేశ్వరి ఆలోచనంతా మనుమరాలు మీదనే ఉంది. "మా రోజుల్లో ఏ పగా లేదు ప్రతికారం లేదు. దొంగలు లేరు, దోపిడి దారులు లేరు. చక్కగా పెద్దలు కూర్చే పెళ్ళిరోజే కట్నకానుకలు, మంచిచెడులు మాట్లాడుతారు. అదే ఫైనల్. తర్వాత ఏ వేధింపులు ఉండవు. కానీ ఇప్పుడు ఆడపిల్లలపై చెడు వార్తలు రాకుండా ఆసలు రోజు గడిచిందే లేదు. వీళ్ళకేమో.. అలవాటు అయిపోయిందో, లేక వీళ్ళు పుట్టిన నుండే ఈ దారుణాలు జరుగుతున్నాయనో ఏమో.. పట్టించుకోరు. పైగా దూరం పంపుతారు" అంటూ కొడుకు కోడల్ని తిడుతుంటుంది. "అబ్బా ఏంటే ముసలి.. ఏదో ఒకటి గొణుగుతూనే ఉంటావు.. తన చదువు ఎలాగూ కొన్ని రోజుల్లో పూర్తి అయిపోతుందిగా. నీ మనుమరాలికి ఏమీ కాదు. తాను మహా శక్తివంతురాలు. అలాగే డాక్టర్ అయి తిరిగి వస్తుంది. ముందు నీకే వైద్యం చేయిస్తాలే" కొత్త చొక్కా వేసుకుంటూ తల్లి పురంధేశ్వరి ని ఆటపట్టిస్తాడు దాసు. బుంగమూతి పెట్టి కొడుకుని వెక్కిరిస్తూ.. "హుమ్.. మనుమరాలితో ఆడుకోనివ్వకుండా చిన్నప్పుడు నుండే బాగా పే.. ద్ద.. చదువులని ఎక్కడో ఉంచి చదివించారు. ప్రేమగా ఒక ముద్దు పెట్టుకుందామన్నా.. హత్తుకుందామన్నా.. సాధ్యం కాదు " అంటూ బాదపడుతుంది. "మోకాళ్ళ పై తల్లి దగ్గర కూర్చుని సైలాక్ MBBS పదిరోజుల ముందే పూర్తి అయిపోయిందమ్మా.. డాక్టర్ గా తన ప్రాక్టీస్ ఏర్పాట్లకు ఇన్ని రోజులయ్యాయి. ఇప్పుడే ఫోన్ చేసింది. అందరూ వెళ్ళిపోయారట. తాను ఒక్కతే ఉందని, త్వరగా రమ్మని చెప్పింది. వెళ్లి తీసుకొస్తా " అంటూ నవ్వుతూ వెళ్తాడు. సైలాక్ రాగానే నానమ్మ నే హత్తుకుంటుంది ముందు. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు ఆఫీసుకి వెళ్ళిపోతే మంచి బుద్దులు నేర్పింది, దైర్యం నింపేది తానే, అన్ని చూసుకుంది తానే. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ObwolulTcQc
Embed this episode
NOW PLAYING
రక్షణేది | Rakshanedi | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.