రంగుల లోకం | Rangula Lokam | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 7, 2022 · 8 MIN

రంగుల లోకం | Rangula Lokam | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రంగుల లోకం రచన: వేలూరి ప్రమీలాశర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నేనెప్పుడూ చూడని మా నాన్నకి ప్రేమతో, ఈ  రంగురంగుల లోకంలో ఎన్నో ఆశలతో ఎదగాలని ఉంది నాన్నా! కానీ ఈ విశాలమైన ప్రపంచంలో ఏ మూలకి పోయినా, నా కేర్ ఆఫ్  అడ్రస్ అడుగుతున్నారు. ఏమని చెప్పను. అమ్మని అడిగితే నీ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడదు. "మోసగాడు" అంటుంది. ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటుంది. ఓదార్చే ధైర్యం చేస్తే, దూరంగా వెళ్లిపోతుంది. నీరక్తం నాలో ఉందని అసహ్యమేమో... అలాగని నాపై ప్రేమను చంపుకోలేకపోతోంది. అంటే నీమీద కూడా తన మనసులో ఏదో ఒక మూలన ప్రేమ ఉందనే కదా! ప్లీజ్... ఒక్కసారి వచ్చి ప్రేమగా మమ్మల్ని దగ్గరకి తీసుకోవూ... ఓ తండ్రి కన్న కూతురుగా అమ్మ... తన జీవితంలో ఓడిపోయి ఉండొచ్చు. కానీ, ఈ తండ్రి... తాను కన్న కూతురిని గెలిపించడానికి వస్తాడని ఆశతో చూస్తున్నాను. వస్తావు కదూ! నిన్ను తీసుకు వస్తానని అమ్మకి మాటిచ్చాను. కానీ, నీకోసం ఎక్కడని వెతకాలి? అందుకే ఈ లెటర్, దేవుడి హుండీలో వేస్తున్నాను. తప్పకుండా వస్తావు కదూ! ఇట్లు, నీ  చిట్టితల్లి. లక్ష్మీ నృసింహస్వామి గుడిలో పరకామణి సేవలో హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న సుదర్శనానికి, నగదూ కానుకలతో పాటు, హుండీలో ఉన్న ఈ లేఖ దొరికింది. "ఎవరు రాసి ఉంటారబ్బా?" అందమైన దస్తూరీతో ఉన్న ఆ తెల్లకాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసాడు. రాసినవారి పేరు లేకపోయినా, ఆర్ద్రత నిండిన అక్షరాల వెంబడి అతని కళ్ళు పరిగెత్తినప్పుడు, కళ్ళవెంట అప్రయత్నంగా నీళ్లు ఉబికి వచ్చాయి. మసకబారిన జ్ఞాపకాల వైపు ఆలోచన మళ్లింది. 'అంటే... ఛాయ ఇక్కడే ఎక్కడో ఉందన్నమాట. ఈ లెటర్ ఛాయ కూతురే రాసి ఉంటుంది' అనుకుంటూ ఆ కాగితం పట్టుకుని ఆలయ ప్రధాన అర్చకుడిని కలవడానికి వెళ్ళాడు. "చూడండి బాబూ! నిత్యం ఎంతోమంది ఈ గుడికి వస్తూ, పోతూ ఉంటారు. అందులో ఈ లేఖ రాసినది ఎవరని చెప్పగలం? మీ ఆత్రుత నాకు అర్థమవుతోంది. కానీ ఈ విషయంగా నేనే సహాయమూ చెయ్యలేను" హుండీలో దొరికిన లేఖను ఆసాంతం పరీక్షగా చూస్తూ చెప్పాడు పూజారి. కళ్ళు మూసుకుని, మనసులో ఆ నృసింహస్వామిని తలచుకొని, పూజారికి నమస్కరించి, అక్కడ్నుంచి కోనేరు వైపు వచ్చాడు సుదర్శనం. కోనేరులో దిగి, ఆ పవిత్ర జలాన్ని తలపై చల్లుకుని, తిరిగి మెట్లు ఎక్కుతుండగా, ఓ పక్కగా మెట్లపై విచారంగా కూర్చున్న ఓ పదహారేళ్ళ అమ్మాయి కనిపించి, ఆగిపోయాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/P6WHsjclgNY

Episode metadata supplied by the publisher feed · Published Dec 7, 2022

Embed this episode

NOW PLAYING

రంగుల లోకం | Rangula Lokam | Telugu Short Story | Veluri Prameela Sarma | manatelugukathalu.com

0:00 8:05

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 8 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 7, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!