సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2 | Sala Mai Tho Celebrity Bangaya Part 2 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com episode artwork

EPISODE · Aug 5, 2023 · 14 MIN

సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2 | Sala Mai Tho Celebrity Bangaya Part 2 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' - New Telugu Story Written By Vasundhara 'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: నన్ను సెలబ్రిటీగా చూడాలన్నది నా భార్య కృప కోరిక. కాలేజిలో తన సీనియర్ చంద్ర టివి యాంకర్ అయినట్లు తెలుస్తుంది కృపకి. నన్ను చంద్ర నిర్వహిస్తున్న ‘చిలకా గోరింకా’ ప్రోగ్రాం కి సెలెక్ట్ చెయ్యమని చంద్రని కోరుతుంది. ఇక సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పెద్ద కథ చివరి భాగం చదవండి.. ఆ తర్వాత నేను నాకు తెలియకుండానే రచయితనయ్యాను. ఎటొచ్చీ ఆ విషయం కూడా తర్వాతే తెలిసింది. ఎలా? ఆ రోజు సాయంత్రం ఐదు. పడక గదిలో మంచంమీద కూర్చున్న నేను- ‘సీ యూ టుమారో, బై’ అని ఒళ్లోని లాప్‌టాప్‌లో టైపు చేసి- ఓ పక్కనుంచి కింగులా దిగాను. అదే సమయానికి మంచంమీద మరో పక్కనుంచి క్వీనులా దిగింది కృప. నేనిలా మంచం దిగి, అలా కృపని చూశానో లేదో- జేబులో సైలెంటు మోడ్‌లో ఉన్న మొబైల్ అదిరింది. చూస్తే కొత్త నంబరు, “నేను చంద్ర. సీటివిలో ‘చిలకా గోరింకా’ యాంకర్ని. పది నిముషాల్లో వస్తున్నా. మీ దంపతులు నాకోసం ఓ గంట స్పేర్ చెయ్యాలి” అని కట్ చేశాడా చంద్ర. ఫోన్ మళ్లీ అదిరింది. కారణం ఆ కబురుకి నా బాడీ, మైండూ అదిరాయి. ఫోను అదురుతున్న నా చేతిలో ఉంది. కృప ఉత్సాహంగా నన్ను సమీపించి, “ఎవరూ, చంద్రేనా? గంటనుంచి చాట్ చేస్తున్నాడు. పది నిముషాల క్రితం ఓకే చేశాను. నాకులా సైమల్టేనియస్ చాటింగు నీకు రాదంటే, ఆఫీసు టైమవగానే నీకు ఫోన్ చేస్తానన్నాడు. నా విషయంలో తను మహా ప్రాంప్ట్” అంది కృప గర్వంగా. మా ఇంట్లో దేనికైనా పర్మిటింగ్ అథారిటీ తనదేననీ, ఏ టాలెంటులోనైనా తన తర్వాతే నేననీ- చెప్పుకుందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోదు కృప. అమ్మ, నాన్న, తోడబుట్టినవాళ్లతో సహా- మొత్తం నా బంధుమిత్రులందరికీ ఈ విషయం తెలిసి కనీసం రెండున్నరేళ్లు అయింది. ఆ జాబితాలో తాజా ఎంట్రీ చంద్రది. “చంద్ర ప్రాంప్ట్‌నెస్ విషయం సరే, మనమింకా సెలబ్రిటీసు కాలేదుగా!” అన్నాను. “కాకపోవడమేంటి? గతవారం- ‘చంచల’ వెబ్ మాగజైన్లో నీ మొదటి కథ పడింది. ఆ కథని నాలుగు వాట్సాప్ గ్రూపుల్లో పెడితే, 400 మంది వహ్వా అన్నారు. వాళ్లలో చంద్ర ఒకడు. సో, తనకి నువ్వు సెలబ్రిటీ” అంది కృప వెంటనే. నేనెప్పుడు కథ వ్రాశానూ అనబోయాను కానీ, కృప నన్ను మాట్లాడనివ్వలేదు. “చంద్ర టైం చాలా విలువైనది. డౌట్లు తర్వాత! ముందు నువ్వు ఫ్రెష్షయి రా” అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/1cFgjLgsd00

Episode metadata supplied by the publisher feed · Published Aug 5, 2023

Embed this episode

Ready to play

సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2 | Sala Mai Tho Celebrity Bangaya Part 2 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com

0:00 14:01

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 14 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on August 5, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!