EPISODE · Sep 26, 2022 · 6 MIN
సైనైడ్ ఎపిసోడ్ 1 | Cyanide Episode 1 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ ఎపిసోడ్ 1 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి విశాఖపట్నం లోని అతిపెద్ద బిజీ సెంటర్లో ఒక పేరుగాంచిన నాలుగు అంతస్తుల ఏసీ మాల్ ఉంది. అందులో దగ్గర దగ్గర 50 షాపులు ఉన్నాయి. పొద్దున పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అత్యంత రద్దీగా ఉండే ఈ మాల్ లో మొత్తం ఎస్కలేటర్ లు ప్రతిక్షణం పైకి - కిందకి జనాలని తీసుకువెళుతూ, ఆ మాల్ కి కొత్తగా వచ్చిన వారిని సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తుతాయి. చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన యాత్రికులు కూడా మొదట ఆర్కే బీచ్, రుషికొండ లాంటి పర్యాటక ప్రాంతాలలో సముద్రపు ఒడ్డున ఆనందించి, ఆ తర్వాత ముఖ్యంగా హోటల్స్, సినిమా హాల్స్ ఉన్న ఈ ఏసీ మాల్ కు వచ్చి తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. అసలే దసరా పండుగ రోజులు.. ఆ సెంట్రల్ ఏసి మాల్ జనాలతో కిక్కిరిసిపోయింది. చిన్న పిల్లల గోల. యుక్తవయసులోని వారు తమ అందచందాలతో, ఓర చూపులతో కుర్రకారు మతిని పోగొట్టేస్తున్నారు. ఆ రోజు ఎందుకో మాల్ అంతా మూసేసి ఉంది. అక్కడకు వచ్చిన జనాలు ఆశ్చర్యంతో “ఏమైంది సార్! అంతమంది పోలీసులు ఉన్నారు? ఈ మాల్ చూడడానికి చాలాదూరం నుంచి వచ్చాము” అంటూ అక్కడ కాపలా కాస్తున్న పోలీసులను వేధిస్తున్నారు. అంతలో అక్కడికి వచ్చిన పోలీస్ సూపరింటెండెంట్ మైక్ లో “ఇవాళ నుంచి వారం రోజుల పాటు ఈ మాల్ తెరవకూడదు” అని చెప్పగానే, ఎంతో నిరాశకు గురయి, కారణం తెలియని జనాలు తిరిగి వెళ్ళిపోయారు. అదే రోజు ప్రెస్ మీట్ లో పోలీస్ కమిషనర్ గారు మాట్లాడుతూ “నిన్న రాత్రి మాల్ కు వచ్చిన ఒక వ్యక్తి హత్యకు గురై ఎస్కలేటర్ క్రింద భాగం లో పడి ఉన్నారు. ఆయన పేరు శేఖర్ అని, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అని ఆయన ఐడి కార్డు ద్వారా తెలుసుకున్నాము. ఆ మృతుని కుటుంబ వివరాలు, ఉద్యోగ విషయాలపై ఆరా తీస్తున్నాము. మాకు తెలిసిన వివరాలను బట్టి ఆయన ఢిల్లీలో DRDO office లోని అత్యంత సీనియర్ గెజిటెడ్ ఆఫీసర్ అని, చాలా మంచి వాడు అని, తన సొంత ఊరు విశాఖపట్నం అని, నెల రోజుల పాటు కుటుంబంతో పాటు వచ్చాడని తెలిసింది.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/8dAQ6Rb0xno
Embed this episode
NOW PLAYING
సైనైడ్ ఎపిసోడ్ 1 | Cyanide Episode 1 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.