సైనైడ్ ఎపిసోడ్ 10 | Cyanide Episode 10 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 4, 2022 · 9 MIN

సైనైడ్ ఎపిసోడ్ 10 | Cyanide Episode 10 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 10 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో ఏ-వన్, తనను తప్పించమని బి-వన్ ని కోరుతాడు. అతనికి కావలసిన టికెట్స్ ఆరెంజ్ చేస్తానని, న్యూఢిల్లీ ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కమని చెబుతుంది బి-వన్. స్టేషన్ కి వెళ్లే దారంతా బలమైన నిఘా ఉంటుంది. ఇక సైనైడ్ చివరి  భాగం చదవండి ఆరోజు ఏ-వన్ కి సాయంత్రం చీకటి పడుతున్న వేళ, ఒక వ్యక్తి వచ్చి ఒక కొరియర్ ఇచ్చాడు. కొరియర్ విప్పి చూసుకునే సరికి, తాను వెళ్లబోయే డెస్టినేషన్ కి అన్ని రైల్వే టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చాయి. అంతకు ముందు రోజే ఏ-వన్ అకౌంట్లోకి చాలా పెద్ద మొత్తంలో లో మనీ ట్రాన్స్ఫర్ కూడా అయింది. ఇలా అన్ని విధాల బి-వన్ పంపించే సరికి ఎక్కడలేని ధైర్యం, ఉత్సాహం వచ్చాయి ఏ -వన్ కి. అయినా అంచెలంచెలుగా ఉన్న పోలీసు భద్రత వలయాన్ని ఎలా చేధించుకుని విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరుకోవాలో.. అన్న విధంగా ఆలోచిస్తూ, గ్లాసు లో ఉన్న విస్కీ తాగుతూ ఆలోచించసాగాడు ఏ-వన్. ఆ మర్నాడు తెల్లవారుజామున ఏ-వన్ తయారై, తన ఉనికి తెలియకుండా మంచి క్యాప్ పెట్టుకున్నాడు. ఒక అఫీషియల్ లాగా వైట్ షర్టు టక్ చేసుకుని, నీటుగా తను కొన్న షూస్ వేసుకుని, తన కుంటినడక ను చాలా వరకు తగ్గించి, మెల్లగా నడుస్తూ మధ్య మధ్యలో అటు ఇటు గమనిస్తూ, షేర్ ఆటో కోసం మధురవాడ హైవే కి వచ్చాడు. అప్పటికే రాత్రంతా గస్తీ తిరుగుతున్న పోలీసులు అలిసిపోయి, తమ తమ జీపుల్లోనే కూర్చుని NH-16, హైవే లో పోతున్న అన్ని వెహికల్స్ ని, "విశాఖపట్నంలో సిటీ లోకి ఎంటర్ అవుతున్న ప్రతి బస్సును, కార్లను , తనిఖీ చేస్తూ ఉండగా, సరిగ్గా అదే సమయానికి కి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ డ్యూటీ కి వెళ్ళవలసిన వారు, కనబడిన షేర్ ఆటోలను ఎక్కుతూ, తెల్లవారుజామున ఎంతో సందడిగా ఉంది మధురవాడ హైవే. ఏ-వన్ మధురవాడ హైవే మీద ఉన్న బోర్డులకు తన ఊహ ముఖచిత్రం తానే చూసుకుంటూ, మనసులో బెంగగా ఉన్నా, అప్పుడే వచ్చిన ఒక షేర్ ఆటో ఎక్కి, తనకు తెలిసిన మద్దిలపాలెం జంక్షన్ దగ్గర దిగి పోయాడు. ఒకవేళ తనను ఎవరైనా పోల్చి పోలీసులకు చెబితే, ఆ షేర్ ఆటో ను వెంబడిస్తారు! కనుక మద్దిలపాలెం డిపో నుంచి NAD కొత్త రోడ్ వరకు, మరో షేర్ ఆటో ఎక్కి అలా ఎవరికీ అనుమానం రాకుండా, NAD జంక్షన్ నుంచి మళ్లీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు మరో షేర్ ఆటో గాభరాగా ఎక్కుతున్న సమయంలో , కాలు సరిగ్గా పడక ఆటోలో కూర్చో లేకపోవడం వలన, రోడ్డు మీద పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న జనాలు అతని లేపి చూశారు. చెవి వెనుక భాగాన రక్తం కారడం గమనించి వెంటనే 108కి ఫోన్ చేశారు. అప్పటికే స్పృహతప్పి పడిపోయిన ఏ-వన్ ను గవర్నమెంట్ హాస్పిటల్ (K G H) కు తీసుకువచ్చారు అంబులెన్స్లో. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/fQpwFNrEAQw

Episode metadata supplied by the publisher feed · Published Dec 4, 2022

Embed this episode

NOW PLAYING

సైనైడ్ ఎపిసోడ్ 10 | Cyanide Episode 10 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com

0:00 9:50

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 9 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 4, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!