EPISODE · Oct 10, 2022 · 5 MIN
సైనైడ్ ఎపిసోడ్ 3 | Cyanide Episode 3 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 3 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో ఈ కేసుని పరిశోధించడానికి ప్రభుత్వం క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ గారిని నియమించింది. పోస్టుమార్టం చేసిన డాక్టర్ కిరణ్ ని పూర్తి వివరాలు అడుగుతాడు రాజశేఖర్. ఇక సైనైడ్ మూడవ భాగం చదవండి.. రాజశేఖర్ గారు మాట్లాడుతూ, “డాక్టర్ గారూ! ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయమై మన దేశ భద్రత కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని, ఇంకా దేశం లోకి ఇలాంటి నిషేధ పూరితమైన మందులు రాకూడదని, నన్ను ఈ కేసుని కూలంకుషంగా పరిశీలించమని పంపించారు! కనుక మీరు మొత్తం పోస్టుమార్టం ఎలా జరిగిందో వివరించండి” అన్నారు. డాక్టర్ కిరణ్ గారు తన గొంతు సవరించుకుని, “సార్! పోస్టుమార్టంలో సాధారణంగా, బాడీలో ఎక్కడైనా కత్తి గాట్లు, బుల్లెట్ రంధ్రాలు, ఉన్నాయా? అని పరీక్ష చేస్తాను. ఆ తర్వాత మెడ దగ్గర 'ఉరి వేయడం' వల్ల చనిపోయాడా! అనే పరీక్ష చేస్తాను. కానీ ఒక ఆరోగ్యంగా ఉన్న శేఖర్ అనే వ్యక్తికి ఎలాంటి దెబ్బలు గాని, కత్తిపోట్లు, గాని ఉరి లాంటివి గాని ఏమీ జరగలేదు. అసలు ఎలా చనిపోయాడో? అని నిశితంగా పరిశీలించాకే, ఆయన మెడ దగ్గర నుంచి హార్ట్ వరకు రంగు నీలంగా మారి ఉంది. ఇది విష ప్రయోగం అని , అదే రోజు కెమికల్ టెస్ట్ చేశాను. అప్పుడు తెలిసింది, ఇది ఏ పాముకాటు కాదు, అత్యంత విషపూరితమైన ద్రవం శరీరం లోకి వెళ్లి మొత్తం 3 నిమిషాలలో శరీరాన్ని పారలైజ్ చేస్తుంది. గుండె ఆగిపోతుంది. ఆ చేసిన కెమికల్ టెస్ట్ లో మందుల్లో వాడే ప్లాస్టిక్ రేణువుల వల్ల ఇది సైనైడ్ క్యాప్సిల్ గా నిర్ధారించుకున్నాము, అదే రిజల్ట్స్ డిల్లీ ల్యాబ్ నుంచి కూడా వచ్చేసరికి దిగ్భ్రాంతి చెందాము” అంటూ డాక్టర్ గారు నుదిటి మీద పడ్డ చెమట తుడుచుకుంటూ, ఏకబిగిన మాట్లాడడం వలన, దాహంతో గ్లాసుడు నీళ్లు తాగి స్థిమిత పడ్డారు. "ఓకే డాక్టర్ గారు! నేను అన్ని విషయాలు పరిశీలిస్తాను, థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్” అని చెప్పగానే డాక్టర్ గారు వెళ్లిపోయారు. ఆ తర్వాత రాజశేఖర్ గారు అన్ని సీసీ కెమెరాస్ ఫుటేజ్ లు అణువణువు పరిశీలించాక, మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత పోలీస్ కమిషనర్ గారి తో మాట్లాడుతూ, “నన్ను ఒక్కసారి హత్య జరిగిన ప్రాంతానికి.. అదే.. షాపింగ్ మాల్ కు తీసుకు వెళ్ళండి!” అని అనగానే ఇద్దరు 'సీనియర్ ఆఫీసర్స్' ని పంపిస్తూ 'చూడండి, రాజశేఖర్ గారికి ఆ ప్రాంతంలో అన్ని చూపించి, ఏ అవసరం ఉన్న కాల్ చేయండి” అని చెప్పి “సార్! నాకు మీటింగ్ ఉంది, మీరు అన్ని సావకాశంగా పరిశీలించండి” అని ఒక రెడ్ లైట్ వెలుగుతున్న అఫీషియల్ పోలీస్ కార్ లో వారిని పంపించారు. సరిగ్గా ఆ సమయంలో వైజాగ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉన్నా, పోలీస్ ఎస్కార్ట్ తో వస్తున్న కార్ కి సిగ్నల్స్ ఆపి సెల్యూట్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ని చూస్తూ తిరిగి తను కూడా సెల్యూట్ చేస్తూ, "ఆహా.. వైజాగ్ ఎంత అభివృద్ధి చెందింది!, ఎంతో సుందరమైన నగరం, రిటైర్మెంట్ అయిపోయాక వైజాగ్ లోనే ఇల్లు కట్టుకొని స్థిరపడతాను” అన్న ఆలోచనలతో రాజశేఖర్ గారు తనలో తనే ఆనంద పడసాగారు... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/w6mamPKzEV0
Embed this episode
NOW PLAYING
సైనైడ్ ఎపిసోడ్ 3 | Cyanide Episode 3 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.