EPISODE · Oct 17, 2022 · 6 MIN
సైనైడ్ ఎపిసోడ్ 4 | Cyanide Episode 4 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 4 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో తాను చేసిన పోస్ట్ మార్టం వివరాలు రాజశేఖర్ కి చెబుతాడు డాక్టర్ కిరణ్. తరువాత మాల్ దగ్గరికి వెళతాడు రాజశేఖర్. చనిపోయిన శేఖర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటాడు. ఇక సైనైడ్ నాలుగవ భాగం చదవండి.. హత్య చేయబడిన శేఖర్ నిజానికి ఒక మంచి విద్యావంతుడు. బిట్స్ పిలానీలో తన కంప్యూటర్ ఇంజనీరింగ్ లో ఎన్నో మంచి ఆవిష్కరణలు చేసి ప్రాక్టికల్స్ లో అందరికన్నా ఎంతో తెలివిగా ర్యాంకులు సాధించడంతో అగ్రగణ్యుడయ్యాడు. క్యాంపస్ సెలక్షన్స్ లో అత్యధిక వేతనంతో ఒక ప్రైవేట్ కంపెనీలో లో నియమింపబడ్డాడు శేఖర్. అలాగే "యూపీ ఎస్సీ గ్రూప్ వన్ "లో సెలెక్ట్ అయ్యి "Defence reaserch development org ."! Delhi లో సీనియర్ ఆఫీసర్ గా అపాయింట్మెంట్ రావడంతో తన జీవిత ధ్యేయం సాధించినట్టు భావించి, అదే ఉద్యోగంలో కొనసాగ సాగాడు. అన్ని కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ డిపార్ట్మెంట్ లకి ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ వచ్చినా స్వయంగా శేఖర్ తన నైపుణ్యంతో ఆ సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్స్ ని మళ్లీ ఆక్టివేట్ చేసి ఎంతో చాకచక్యంగా మిలటరీ ఆర్మీ బేస్ లు, నేవల్ బేస్ లు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న కంప్యూటర్ సాఫ్ట్వేర్.. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అందరి అభిమానాన్ని చూర గొన్నాడు. అంచెలంచెలుగా ఎదిగి గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకింగ్ పొంది అత్యున్నత స్థాయి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కి వెన్నుముకగా నిలిచాడు శేఖర్. సరిగ్గా అదే సమయంలో తను మొదట పనిచేసిన సాఫ్ట్వేర్ కంపెనీలో శేఖర్ కి ఆత్యంత సన్నిహితంగా మెలిగే స్నేహితుడి పేరు ఏ - వన్ (పేరు రాయడం లేదు). ఆ ఇద్దరూ కలిసి రెండు సంవత్సరాల పాటు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కలిసిమెలిసి ఉండేవారు. శేఖర్ కి డి ఆర్ డి వో లో ఉద్యోగం వచ్చాక కొంచెం ఎడబాటు కలిగింది. అయినా ప్రతివారం ఇద్దరూ కలుస్తూ బార్ కి వెళ్లి ఓ గంట సేపు హాయిగా కూర్చుని తాగుతూ ఉండేవారు. అసలు ఏ - వన్ ఒక ప్రాజెక్టు పని మీద కెనడా నుంచి వచ్చి, అదే కంపెనీలో శేఖర్ తో కలిసి పనిచేయడం జరిగింది. అలా వారి స్నేహం ఘాడమై శేఖర్ కు పెళ్లయిన తర్వాత కూడా వారి ఇంటికి వచ్చి ఏ - వన్ మన మన సౌత్ ఇండియా రుచులన్నీ మరిగి ఎంతో క్లోజ్గా ఉండే వాడు. ఆరోజు ఏ - వన్ ఇంటికి వచ్చి “ఒరేయ్ శేఖర్! ఇవాళ మీ ఆవిడ ఇడ్లీ సాంబారు చేస్తానన్నది కదా! దాన్లో కొబ్బరి చెట్నీ కూడా వేయించు. ఆ రుచి నేను జన్మజన్మలకు మర్చిపోను. ఇదే విషయం మా కజిన్ సిస్టర్ బి - వన్(పేరు పెట్టలేదు) కి కూడా చెప్పాను. ఆమె నీతో ఎలాగైనా మాట్లాడాలి అని అంటున్నది” అంటూ ఫోన్ కలిపి తన కజిన్ సిస్టర్ బి - వన్ చేత మాట్లాడించాడు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/2XgD_058qyg
Embed this episode
NOW PLAYING
సైనైడ్ ఎపిసోడ్ 4 | Cyanide Episode 4 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.