EPISODE · Oct 25, 2022 · 4 MIN
సైనైడ్ ఎపిసోడ్ 5 | Cyanide Episode 5 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 5 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ధారావాహిక 'సైనైడ్' ఐదవ భాగం గత ఎపిసోడ్ లో హత్య చేయబడిన శేఖర్ కంప్యూటర్ మేధావి. అతను డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ఆర్మీలోనూ, నేవీలోనూ, ఎయిర్ ఫోర్స్ లోనూ వాడుతున్నారు. అతనికి పాత స్నేహితుడు ఏ - వన్ తో పరిచయం పెరుగుతుంది. అతని ద్వారా బి - వన్ అనే యువతి పరిచయమవుతుంది. ఆమె అతన్ని ఆకర్షిస్తుంది. ఇక సైనైడ్ ఐదవ భాగం చదవండి. ఒకరోజు బి - వన్ ఫోన్ చేసి తన తియ్యని మాటలతో, “శేఖర్! ఈ జీవితంలో అనుకోని అదృష్టం వచ్చింది, మీ డిపార్ట్మెంట్ లోని సాఫ్ట్వేర్, ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లో డెవలప్మెంట్ అప్డేట్ చేస్తున్న కంపెనీలు 'eastern naval command,(navalbase),Hpcl,Indian Air force, Atomic reserch centres, Artillery departments. 'DRDO', ఇలాంటి వాటికి, భారతదేశపు రక్షణ వ్యవస్థకు అంత మంచి సాఫ్ట్వేర్ ఇచ్చి, దిగ్విజయంగా నడిపిస్తుంది, దాన్లో 'DRDO' ఎంతో ఎక్కువ టెక్నాలజీ తో డెవలప్ చేసిన 'ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ missiles' కూడా 'లాంగ్ రేంజ్ ఫైరింగ్' లో మీ 'కంప్యూటర్ టెక్నాలజీతో' బాగా అభివృద్ధి చెందింది. కనుక నువ్వు ఈ అన్ని డిపార్ట్మెంట్ల కి వెళుతూ, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నావు! అదే టైంలో లో నువ్వు చేసిన ప్రోగ్రామింగ్, వాటి సమర్ధత, నువ్వు చేసే విధానం.. నాకు గాని ఇవ్వగలిగితే, నేను కూడా మరో 'రెండు దేశాలకు ఆ టెక్నాలజీ ఇస్తాను. భారతదేశంలో లాగే వారు కూడా అభివృద్ధి చెందుతారు. ఇందులో దేశద్రోహం ఏమీ లేదు. జస్ట్ నాకు నువ్వు ఎలా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అప్ డేట్స్ చేస్తావో, ఆ విషయాలు నాకు అందజేస్తే, నేను ఆ దేశాలకి అదేవిధంగా తయారు చేసి ఇస్తాను. దానివల్ల మనకు ఆఫర్ చేసిన మొత్తం 100 కోట్లు. ఇలాంటి అవకాశం మరి ఎప్పుడూ, ఎక్కడా రాదు! నువ్వు ఆ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అన్నీ నాకు పంపించి, ఆ తర్వాత నీ భార్యకు విడాకులు ఇచ్చి, కెనడాకు వచ్చేయి. నువ్వు రాగానే మనం పెళ్లి చేసుకుని, ఆ డీటెయిల్స్ తో ప్రాజెక్ట్ తయారుచేసి, ఆ దేశాలకు ఇస్తే ముందుగా మనకు 50 కోట్లు ఇస్తారు. ఆ తర్వాత మరో 50 కోట్లు ఆ ప్రోగ్రామ్స్ ని వాళ్ల దేశాలలో మనం ఇన్స్టాల్ చేసి, సక్సెస్ ఫుల్ గా నడిపిస్తే ఇస్తారు. ఈ డబ్బు మనకు జీవితంలో కూర్చొని తిన్నా, పది తరాలకు సరిపోతుంది. కనుక బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో! ముందు నువ్వు వైజాగ్ లో ఉన్న naval base, HPCL లో ఉన్న 'కంప్యూటర్ సాఫ్ట్వేర్ 'ఎలా పనిచేస్తుంది?, నేవల్ బేస్ లో ఎన్ని వార్ షిప్స్ ఉన్నాయి,? అందులోనే ‘న్యూక్లియర్ submarines’ ఎన్ని ఉన్నాయి? వాటి కెపాసిటీ, ఒకవేళ యుద్ధం వస్తే ఎన్ని రకాల ‘Torpedos’ (నీటిలో ప్రయోగించే యుద్ధ బాంబులు) వాడతారు? అలాగే మొత్తం 'అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్' కూడా కావాలి... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/5D2K6Z8-SwA
Embed this episode
NOW PLAYING
సైనైడ్ ఎపిసోడ్ 5 | Cyanide Episode 5 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.