EPISODE · Nov 9, 2022 · 8 MIN
సైనైడ్ ఎపిసోడ్ 7 | Cyanide Episode 7 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ - ఎపిసోడ్ 7 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి గత ఎపిసోడ్ లో బి - వన్ మాటలకు లొంగిపోతాడు శేఖర్. ఆమె అడిగిన రహస్యాలు సేకరిస్తాడు. సమాచారం లీక్ అవుతున్న విషయం ఇంటెలిజెన్స్ విభాగం గమనించి నిఘా పెడుతుంది. ఏ - వన్ బి - వన్ లు ఒక పావులా వాడుకున్నారని నిర్ధారించుకున్నాడు శేఖర్ ఇక సైనైడ్ ఏడవ భాగం చదవండి శేఖర్ ఎంతో బాధతో,మరొకసారి బి - వన్ కి ఫోన్ చేసి, “నేను సేకరించిన వివరాలు- విశాఖపట్నం లోని నేవల్ బేస్,హెపిసిఎల్ అయిన కేంద్ర ప్రభుత్వ సంస్థల వివరాలను, అన్నీ రికార్డ్ చేసి ఉంచాను! కానీ ఇప్పట్లో నేను ముంబై, ఢిల్లీ వెళ్ళలేను. ఢిల్లీలోని మా ఆఫీస్ లో కూడా తనిఖీలు మొదలుపెట్టారు. నేను ఖచ్చితంగా దొరికి పోతాను! అని బాధపడుతూ చెప్పేసరికి, బి - వన్ ధైర్యం చెబుతూ, “శేఖర్ ! నీకు ఏమీ కాదు, నువ్వు ఢిల్లీ, ముంబై వెళ్లి ఆ పనులు కూడా ముగించి,రెడీగా ఉండు. నిన్ను కెనడా తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నాను. నువ్వు భయపడనవసరం లేదు” అని చెప్పగానే, "ఆర్ యూ మాడ్? ఇక్కడ నా పరిస్థితి గందరగోళంగా ఉంది. గూడచారి విభాగం, అత్యంత రహస్యమైన భారతదేశ రక్షణ వ్యవస్థ కు చెందిన వివరాలు ఎక్కడికో పంపడుతున్నాయి. అందువల్ల ఇంటెలిజెన్స్ విభాగం అన్ని డిఫెన్స్ ఆఫీసులలో హై సెక్యూరిటీ ఎలర్ట్ పెట్టారు. నేను పట్టుబడడం ఖాయం” అంటూ అరుస్తూ, మందు కొడుతూ ఏడుస్తూ మాట్లాడాడు శేఖర్. ఆ సమాధానం విన్న వెంటనే బి - వన్ ఢిల్లీలో ఉన్న తన సహచరుడు ఏ - వన్ కు ఫోన్ చేసి "హాయ్, ప్లీజ్ లుక్ ఆఫ్టర్ మిస్టర్ శేఖర్. ఆయన చాలా పిరికితనంగా మాట్లాడుతున్నాడు. మన చేతిలో పడబోయే భారతదేశ రక్షణ వివరాలు అతనితోనే ఉన్నాయి. నువ్వు ఎలాగైనా అవి సంపాదించి,నాకు పంపించు. ఇది హైకమాండ్ ఆర్డర్... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/_Iau-zH26WE
Embed this episode
NOW PLAYING
సైనైడ్ ఎపిసోడ్ 7 | Cyanide Episode 7 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.