EPISODE · Feb 6, 2023 · 8 MIN
Sampath Cinema Kathalu - 11 | సంపత్ సినిమా కథలు - 11 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 11 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఓపెన్ ప్లేస్. చుట్టు లారీలు కొన్ని ఆగి ఉన్నాయి. చిన్న షెడ్. ఆ షెడ్ లో రాజరావు, సుజాత, కావ్య, శివమ్మలను బందీలుగా ఉంచారు. ఆ షెడ్ కు ఉన్న కిటికిలోనుండి రాజారావు, అపుడే అక్కడికి వచ్చిన లింగస్వామి అనుచరులతో పాటు ఉన్న విక్రమ్, కిరణ్ లను చూసి "ఒరేయ్ లింగ.... నా కొడుకును తీసుకొచ్చావా... నీవెంత మంచి వాడవు రా....... మరి వీళ్లు ఎవరురా... మనల్ని కిడ్నాప్ చేసి తెచ్చారు... ఎందుకు తెచ్చారో తెలియదు... " ఏమీ తెలియని వాడిలా అన్నాడు. విక్రమ్ కి కిరణ్ కి రాజరావు నాటక ఆడుతున్నాడు అని అర్థం అయ్యింది. ఇంక లింగస్వామి "అవును అవును.. నీ కొడుకును నీకు అప్పజెప్పి ఈ కిడ్నాప్ చెర నుండి విడిపిద్దమని వచ్చాను” అన్నాడు. "అబ్బా.. నమ్మినబంటు అంటే నీలా వుండాలి" అన్నాడు రాజారావు. "రెండు నిమిషాలు ఆగు. నమ్మినబంటో నమిలేబంటో తెలుస్తుంది...... బావ.. ఆలస్యం వద్దు. ముందు ఆ విక్రమ్ దగ్గర ఆ విడియో సెల్ తీసుకో'" అన్నాడు భాస్కర్. "ముందు మా వాళ్ళను ఆ షెడ్ నుంచి తెచ్చి అప్పజెప్పితేనె సెల్ విడియో ఇచ్చేది" కిరణ్ అనగానే విక్రమ్ వీడియో తీసిన సెల్ చేతిలో పట్టుకున్నాడు. "కిడ్నాప్ చేసి షెడ్ లో బంది చేసిన వాళ్లను తీసుకొని రా నరసింహ. " అన్నాడు భాస్కర్. షెడ్ లో రాజరావును, సుజాత, కావ్య, శివమ్మలను ఉన్నా బయటకు తెచ్చారు. బయటకు వచ్చాక రాజరావు "ఏమి లింగ.. ఏమీ జరుగుతుంది" అన్నాడు. "నోరు మూసుకో.. లింగ లేదు లంగా లేదు. " అని లింగస్వామి కొడుకు ఉదయ్ అనగానే. అప్పుడే అక్కడికి వచ్చిన నారాయణ "వాడు లింగ కాదు దొంగ" అంటూ లింగస్వామి వంక చూస్తూ "ఒరేయ్ లింగ అసలు వీడియో సెల్ ఇదిగో" అన్నాడు అక్కడికి తెచ్చిన వీడియో సెల్ చూపిస్తూ. "పిచ్చోడా.. అది కిరణ్ ఎప్పుడో తెచ్చి వాట్సప్ లో పోలీసు అధికారులకు పంపాడు. ఇంక మీరు, ఆ దావుద్ అనుచరులు వారి స్థావరాలు మటాష్. " అన్నాడు. "అరే ఎంత నమ్మకద్రోహం " అంటూ పిస్తోలు తో ముందు రాజరావును షూట్ చేయడానికి పోతే కిరణ్ ఎగిరి దూకి వాళ్ళ నాన్నను కాపాడాడు. ఇంతలో విక్రమ్ అక్కడ ఉన్న లింగస్వామి అనుచరులు, గుండాల మీద దాడి చేశాడు. అప్పుడే నారాయణ రాజరావును సుజాత కావ్య, శివమ్మలను అక్కడే ఉన్న ఒక లారీ వెనుక దాక్కోమన్నాడు. వాళ్ళు అలాగే చేశారు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/ap4XC7uLKcc
Embed this episode
NOW PLAYING
Sampath Cinema Kathalu - 11 | సంపత్ సినిమా కథలు - 11 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.