EPISODE · Jun 24, 2023 · 7 MIN
Sanchika Pongindi - Episode 1 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 1 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 1' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక ప్రారంభం రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "బిజియా?" "లేదు లేదు. చెప్పు." "నీతో మాట్లాడాలి." "మాట్లాడుతున్నావుగా." నవ్వుతుంది సంచిక. ఎడమ చెవి వైపు నుండి సెల్ఫోన్ ను.. కుడి చెవి వైపుకు మార్చుకున్నాడు శ్రీకర్. "హలో. ఏమైంది. మాట్లాడు." సంచిక గందిక ఐంది. "ఇలా కాదు. నీతో కల్సి మాట్లాడాలి." విషయం చెప్పాడు శ్రీకర్. "సరే. ఎలా." "ఎక్కడ ఉన్నావ్." అడిగాడు శ్రీకర్. "ఇంట్లోనే." చెప్పింది సంచిక. "ఏం చేస్తున్నావ్." అడిగాడు శ్రీకర్. "మమ్మీ.. డాడీ డ్యూటీస్ కు వెళ్లారు. నేను జికె బుక్ చదువుతున్నాను." చెప్పింది సంచిక. "చిక. నేను బయట ఉన్న. ఇటు నుండి నీ వద్దకు వస్త. అర గంటలో నీ చెంత ఉండగలను." "వెల్కమ్ కర్." శ్రీకర్ ఆ కాల్ కట్ చేసేశాడు. సంచిక తన బెడ్రూంలో ఉంది. చేతిలోని సెల్ఫోన్ ను మంచం మీద పడేసింది. మంచం దిగి.. దిండు మీద ఉన్న బుక్ ను తీసి షెల్ఫ్ లో సర్దింది. తన బెడ్రూం నుండి హాలు లోకి వచ్చింది. సోఫాలో కూర్చుంది. టీపాయ్ మీది న్యూస్ పేపర్ తీసుకుంది. సంచిక, శ్రీకర్ మంచి పరిచయస్తులు.. ఒకరికి ఒకరు హితులు.. స్నేహితులు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో.. ఇద్దరికీ పరిచయం మొదలైంది. ప్రస్తుతం.. ఇద్దరూ పిజీలు చేసి.. జాబ్స్ కై ప్రయత్నాలు చేస్తున్నారు. అర గంట తర్వాత.. 'ఇంకా కర్ రాలేదేంటి.' అనుకుంది. చేతిలో పేపర్ టీపాయ్ మీద పడేసింది. లేచింది. తన బెడ్రూం లోకి వెళ్లింది. తన సెల్ఫోన్ తో తిరిగి హాలు లోకి వచ్చింది. మళ్లీ సోఫాలో కూర్చుంది. శ్రీకర్ కు ఫోన్ చేసింది. అప్పుడే.. శ్రీకర్.. సంచిక ఇంటి దరిన బైక్ ఆపాడు. వస్తున్న కాల్ కు కనెక్ట్ అయ్యాడు. "చిక." అన్నాడు. "ఎక్కడ." అడిగింది సంచిక. "ఇంట్లో." నవ్వుకుంటున్నాడు శ్రీకర్. "అదేంటి. రావడం లేదా." విస్మయమవుతుంది సంచిక. "ఇదిగో బయలు దేర్త." "అర గంటలో తగలడతానన్నావ్." చిరాకవుతుంది సంచిక. "అన్నానా." సరదాగా అన్నాడు శ్రీకర్. కోపమయ్యింది సంచిక. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/U2dc7oNLo3Y
Embed this episode
NOW PLAYING
Sanchika Pongindi - Episode 1 | సంచిక పొంగింది - ఎపిసోడ్ 1 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.