శాంతి కోసం | Santhi Kosam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 9, 2022 · 10 MIN

శాంతి కోసం | Santhi Kosam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాంతి కోసం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రతి ఒక్కరికీ జీవితగమనంలో శాంతి, మనస్సుకు చాలా అవసరం. వివాహితులకు ఆ శాంతి లభ్యపడాలంటే... వారు జీవిత నాటకాన్నిచాలా శ్రద్దగా ఎదుటివారికి (అర్ధాంగికి, ఆఫీస్ కి) ఆనందాన్ని కలిగించే రీతిగా నర్తించాలి మరి... రంజిత్, రేవంత్ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు. రంజిత్ సీనియర్. రేవంత్ జూనియర్. యిద్దరూ యం.కాం గ్రాడ్యుయేట్లు. ఒకే వూరి వారు. ఒకే స్కూలు... కాలేజిలో చదివినవారు. మంచి స్నేహితులు. రంజిత్ కన్న రేవంత్ మూడేళ్ళు చిన్న. యిరువురికీ వివాహం అయింది. రేవంత్ సహన సంపన్నుడు. రంజిత్ అసహనభూషణుడు. రేవంత్ భార్య కాపరానికి వచ్చింది. ఆసమయానికి రంజిత్ భార్య అమ్మగారి యింటికి వెళ్ళివుంది. ఆ రోజు యిద్దరూ ఆఫీసుకు వచ్చారు. "గురూ!... ఈ రాత్రికి మీ డిన్నర్ మా ఇంట్లో. సాయంకాలం నీవు నాతో మా యింటికి రావాలి." సాదరంగా ఆహ్వానించాడు రంజిత్‌ను రేవంత్. "ఏంట్రా విశేష?..." "మా ఆవిడ నిన్న వచ్చింది గురూ!..." "వస్తే!..." ఆశ్చర్యంగా రేవంత్ ముఖంలోకి చూచాడు రంజిత్. "వదిన ఊర్లో లేదు కదా!... ఈరోజు మా యింటికి వచ్చి మీ మరదలి వంటకాలను సేవించాలని నా కోరిక.." నవ్వుతూ చెప్పాడు రేవంత్. "నిన్ననేగా తను వచ్చింది. కొద్దిరోజులు గడవనీ." "ఏం ఫర్వాలేదు గురూ!... మొహమాట పడకు. యీ సాయంత్రం నీవు నాతో మాయింటికి వస్తున్నావు..." "తప్పదంటావా!..." "తప్పదు. నీవు నాతో వస్తున్నట్లుగా యింట్లో చెప్పి వచ్చాను." "అలాగా!" "అవును"  "సరే వస్తాను..." గురువుగారు తన కోర్కెను మన్నించినందుకు రేవంత్ ఆనందించాడు. యిరువురూ వారి వారి పనుల్లో మునిగిపోయారు.   ***  యింటర్ కమ్‌లో రంజిత్ ‌ను బాస్ రామదాసు పిలిచాడు. ఆయన యిల్లు ఆఫీసుకు దగ్గరలోనే. ప్రతిరోజు ఆఫీస్ బాయ్ తిరుపాలు ఒంటిగంటకు వారి యింటికి వెళతాడు. రామదాసుగారి అర్ధాంగి అనసూయ క్యారియర్ చేసి వుంచుతుంది. తిరిపాలు దాన్ని తీసికొని వచ్చి రామదాస్ గారి టేబుల్  పైన పెట్టి వెళ్ళిపోతాడు. రంజిత్ బాస్ క్యాబిన్ లో ప్రవేశించాడు. "రంజిత్ భోంచేశావా?..." "లేదు బాస్. బయటికి వెళ్ళాలి..." "తెచ్చుకో లేదా!..." "లేదు సార్..." "మా ఆవిడ వూరెళ్ళింది..." "బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుందని తెలీదూ?..."  "తెలుసు సార్... కానీ పరిస్థితి..." "నీ సమస్య నాకు అర్థమైంది. చేతులు కడుక్కొని రా... నా క్యారియర్ వచ్చింది. యిద్దరం షేర్ చేసుకొందాం" అప్యాయంగా చెప్పాడు రామదాసు. "వద్దు సార్... నేను బయటికి వెళతాను. మీరు భోంచేయండి..." అనునయంగా చెప్పాడు రంజిత్.  "బాస్ మాటను కాదంటావా?...." కాస్త కఠినంగా వినిపించాయి ఆ పలుకులు రంజిత్ చెవులను. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/2pClXgTGFeU

Episode metadata supplied by the publisher feed · Published Dec 9, 2022

Embed this episode

NOW PLAYING

శాంతి కోసం | Santhi Kosam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 10:52

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 10 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 9, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!