EPISODE · Mar 5, 2023 · 12 MIN
శాంతి నికేతన్ | Santhi Nikethan | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శాంతి నికేతన్ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సూర్యోదయాన పక్షుల కిలకిలా రావాలు, కోకిల కుహు కుహూలు శ్రావ్యంగా వినిపిస్తుంటే నిద్ర లేచి కనులు తెరిచి ఎదురుగా ఉన్న దేవుని పటానికి రెండు చేతులూ జోడించి నమస్కరించి హాలులోకి వచ్చింది రాధమ్మ. అంతక్రితమే నిద్రలేచి తన కాలకృత్యాలను పూర్తి చేసుకుని పాతకాలం నాటి పడకుర్చీలో కూర్చుని ఉన్న భర్త రాఘవయ్యగారిని చూసి చిరునవ్వుతో "మీరు నిద్ర లేచి ఎంత సేపయిందండీ? అయ్యో! నాకివాళ ఆలశ్యంగా మెలకువ వచ్చింది. మీతోపాటే నన్ను లేపచ్చుగా!" అంది రాధమ్మ. " హాయిగా పడుకుని మంచి నిద్రలో ఉన్న నిన్ను లేపబుద్ది కాలేదు. నిద్రలో కూడా నీవు ఎంత అందంగా ఉన్నావో తెలుసా "? అన్నారు రాఘవయ్యగారు చిరునవ్వుతో భార్యను చూస్తూ. "చాల్లేండి! మీ కబుర్లు. ఎవరన్నా వింటే నవ్విపోతారు. మనమేమన్నా క్రొత్త దంపతులమా?" అంది రాధమ్మ. "ప్రేమానురాగాలకు వయసు అడ్డం రాదోయ్! ప్రేమించే మంచి హృదయం ఉంటే చాలు. జీవితమంతా స్వర్గమే" అన్నారు రాఘవయ్యగారు. "మీరు ప్రక్కన ఉంటే నాకెప్పుడూ స్వర్గమే నండి. మీలో సగం నేనే. " అంది అనురాగంగా రాధమ్మ. "మన తనువులు వేరైనా మన మనసులు మాత్రం ఒకటేనోయ్!" అన్నారు రాఘవయ్యగారు ప్రేమగా. భర్త మాటలకు, తనపై ఆయనకున్న ప్రేమకు మనసులో లోలోపల సంతోషంగా ఉన్నా పైకి మాత్రం అది బయటపడకుండా క్రొత్త పెళ్లికూతురిలా సిగ్గు పడిపోతూ పెరటిలోకి వెళ్లి తన పనులను పూర్తి కానిచ్చి వంటగదిలోకి వెళ్లింది రాధమ్మ. కాసేపటికి చిక్కటి కాఫీ కలిపి తీసుకొచ్చి భర్త చేతికందించి తనూ కాఫీ త్రాగుతూ ప్రక్కన కూర్చుంది. "నీ చేతిన కాఫీ కూడా అమృతంగా ఉంటుందోయ్!" అన్నారు రాఘవయ్యగారు. ఆయన వైపు నవ్వుతూ చూసింది రాధమ్మ. " రాధమ్మగారూ ! మన ఆశ్రమంలో ఈరోజు కూరగాయలమ్మిన పైకమిదిగోనమ్మా" అని తన కొంగుకు కట్టిన ముడిలోంచి పైకం తీసి ఆవిడ చేతికందించింది లక్ష్మి. దాన్నందుకుని భర్త చేతికి ఇచ్చింది రాధమ్మ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/RQ39341Mfuo
Embed this episode
NOW PLAYING
శాంతి నికేతన్ | Santhi Nikethan | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.