EPISODE · Feb 6, 2023 · 13 MIN
Shh Tasmath Jagrattha | ష్... తస్మాత్ జాగ్రత్త | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ష్... తస్మాత్ జాగ్రత్త రచన: N. ధనలక్ష్మి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రీతి ఈవెంట్ మేనేజర్. ఓ బాంబ్ బ్లాస్ట్ లో భర్త విజయ్ చనిపోయాడు. వారి ఇద్దరి ప్రేమకు ప్రతి రూపమైన మోక్షజ్ఞ అంటే తనకి పంచప్రాణాలు.. మోక్షజ్ఞను అందరు ముద్దుగా బన్నీ అంటారు. ఎన్ని పనులున్నా బన్నీను స్కూల్ లో దింపడం,అలాగే తీసుకొని రావడం తానే చేస్తుంటుంది. ఆదివారం ఎటువంటి పనులు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉంటూ బన్నీతో ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తుంటుంది.. ప్రతి రోజూ క్రమం తప్పకుండా స్కూల్ లో జరిగిన ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకుంటుంది.. అలా రోజులు సరదాగా గడిచి పోతుండగా.. “రేయ్ బన్నీ! స్కూల్ కి లేట్ అవుతుంది. త్వరగా లేవరా! లేదంటే నిన్ను వదిలేసి నేను వెళ్ళిపోతాను…” “మమ్మీ!!!!! ప్లీజ్ ఇంకా కొంచం సేపు నిద్రపోతాను…” " సరే నీ ఇష్టం! ఇలాగే నిద్రపో. అయితే నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నేను తీసుకొని వెళ్ళలేదని ఫీల్ అవ్వకూడదు. మనం ఈ వీకెండ్ పార్క్ కి వెళ్ళాలి అనుకున్నాము కదా... అది కాన్సిల్. నువ్వు తీరిగ్గా లేచి ఫ్రెష్ అయి మీ గ్రానీతో స్కూల్ కి వెళ్ళి మీ మామ్ చేత తిట్టించుకో.. బై రా కన్నా. నాకు ఆఫీస్ కి లేట్ అవుతుంది. నేను వెళ్తున్న.. ” “నో మమ్మీ ! నేను నీతో పాటు రావాలి! మనం పార్క్ కి కూడా వెళ్ళాలి.. నేను 20 మినిట్స్ లో రెడీ అయి వచ్చేస్తాను. నేను బ్యాగ్ ని ఆల్రెడీ నైట్ చెక్ చేసుకున్న.. సో నో మోర్ వర్రిస్ మమ్మీ.. నువ్వు చెప్తూ ఉంటావుగా మన పనిని మనమే చేసుకోవాలని.. అందుకే ముందుగా నా పనులని చేసేసా”నని చెప్తూ స్నానం చేయడానికి వేగంగా వాష్ రూం లోకి వెళ్ళిపోయాడు... అల్లరి చేస్తాడు కానీ చెప్పిన ప్రతి మాట వింటాడు. ‘బంగారం రా నువ్వు’ అని మురిసిపోతుంది ప్రీతి. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/zU_e0FuppmU
Embed this episode
NOW PLAYING
Shh Tasmath Jagrattha | ష్... తస్మాత్ జాగ్రత్త | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.