EPISODE · Nov 5, 2022 · 13 MIN
శ్రీరామ నవమి | Srirama Navami | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీరామ నవమి రచన: భాగవతుల భారతి "సురుచితా నీకోసం ఎవరో వచ్చారు. " జైల్ సెంట్రీ చెప్పగానే.. ధిగ్గున లేచి, మళ్ళీ ముఖం వివర్ణమై, నిర్వికారం కమ్మేసి, ఈ పాపిష్టి దానికోసం వచ్చేవాళ్ళుకూడా ఉన్నారా? ఐనా నేనింకా బతికేఉన్నానా? చచ్చిపోయాగా! మరి ఈ జీవచ్ఛవం కోసం.... 'అంటే నా మనసులో ఇంకా ఆలోచనలు పుడుతూనే ఉన్నాయా? ఐతే నేను బతికేఉన్నా'.... కలలో నడుస్తున్నట్లుగా జైల్లోని విజిటింగ్ హాల్ మెస్ డోర్ వరకూ వచ్చి, గాజుకళ్ళతో శూన్యంలోకి చూస్తున్నట్లు చూసింది. ఎదురుగా వెలుతురులో ఓ ఆకారం... గుబురుగడ్డమూ, చింపిరిజుట్టూ మాసినబట్టలూ, గుర్తుపట్టటానికి నిమిషం పట్టింది. ఆశ్చర్యపోయింది. ఓ ఉప్పెనే దు:ఖసంద్రమై పొంగుకొచ్చింది. మెస్ డోర్ చువ్వలు పట్టుకుని ఏడుస్తోంది. ఆ ఏడుపుకు ఆ హాలు ప్రతిధ్వనించింది. ఇలాంటి ఏడుపులు శోకాలు అక్కడ సహజమే ఐనా, సెంట్రీ పెద్దగా అదిలించింది. సురుచిత కళ్ళు తుడుచుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కావట్లేదు.. ఎంతసేపు ఏడ్చిందో తెలీలేదు. ఎన్నేళ్ళనుండో గూడుకట్టుకున్న దు:ఖం, కన్నీరై జైలు గోడల్ని కుదిపేస్తోంది. "టైం ఐపోయిందమ్మా! "ఇంకో సెంట్రీ చెప్పాడు. "మాటకూడా మాట్లాడకుండానే టైం" అన్నట్లు బేలగా చూసిందామె. "నువ్వు పుట్టెడు దు:ఖం లో మునిగిపోయావ్. నేను మళ్ళీ వస్తాను " వెనుదిరిగాడతను. "మరి పిల్లలూ?" ఏడుస్తూనే అడిగింది. "వాళ్ళు నా పిల్లలు. నాదగ్గరే ఉంటారు " వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అప్పుడు కళ్ళుతుడుచుకుని స్థిమితంగా వెనుదిరిగి చూస్తే... సెంట్రీ... ఆశ్చర్యం గా... "ఇన్నిరోజులుగా నీ గొంతే వినని ఈజైలు గోడలూ... ఈరోజు నీ ఏడుపు తో ప్రతిధ్వనింప జేసిన అతనెవరూ?" అడిగింది "నాభర్త" అంది. " ఎన్నో భర్త... నువ్వతనికి ఎన్నో భార్య... భర్తను హత్యచేసిన కేసులో కాదూ నువ్వు జైలుకి వచ్చిందీ?"..... మాటల్లోని వెటకారం... గుండెల్ని గుచ్చేస్తున్నా.... "వాళ్ళు నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు ".... అనే మాట చెవుల్లో ప్రతిధ్వనించి... మనసులో ఆవరించిన నిశ్చింతతో... తనసెల్ గదిలోకి వెళ్ళిబోతూ ఆలోచిస్తోంది. బంగారమంటి జీవితాలు.. క్షణంలో ఎంతనాశనమైపోతాయ్? వ్యసనాలకి ఆడామగా తేడాలేదు. వ్యసనం రూపుమారుతుందేమో గానీ అర్ధం ఒకటే. రెండు తప్పులూ చిన్నవేం కాదు. దిద్దుకోటమూ సాధ్యం కాదు. సెల్ కివచ్చి కింద కంబళీమీద కూర్చుని గతం లోకి జారిపోయింది. $$$$$$$ "రాత్రీ తాగేవచ్చావా?మారవానువ్వూ?! నలుగురు ఆడపిల్లల తండ్రివి!... పిల్లలు పెరుగుతున్నారు. చదువులూ పెళ్ళిళ్ళు, ఖర్చులూ, చేతిలో పైసాలేదు. " సురుచిత బాధగా భర్తను నిలదీసింది. "అవునే తాగాను... నా సంపాదనా నాయిష్టం... నీకూ... పిల్లలకీ ఇంత తిండి పారేస్తూనే ఉన్నాగా... పెళ్ళిళ్ళూ గిళ్ళిళ్ళూ తర్వాత చూద్దాం " విసురుగా వెళ్ళిపోయాడు సదాశివ. ఏమిటిదీ?!తిండి పారేయటమేమిటీ? ముష్టివాళ్ళకి వేసినట్టూ! ఎన్నాళ్ళిలా? ఆలోచిస్తుండగానే... ఫోన్ మోగింది... చూస్తే అగర్వాల్.. "మీఆయన షాప్ కి బయలుదేరాడా?! " అడిగాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Cn44bU-FuRE
Embed this episode
NOW PLAYING
శ్రీరామ నవమి | Srirama Navami | Telugu Short Stories | Bhagavathula Bharathi | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.