EPISODE · Jun 4, 2022 · 8 MIN
'శ్రీవారికి ప్రేమలేఖ' | Srivariki Premalekha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శ్రీవారికి ప్రేమలేఖ రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము శ్రీవాణికీ శ్రీధర్‌కీ పెళ్ళి నిశ్చయించారు. శ్రీధర్ ఎనభై వేలు తెచ్చుకునే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. శ్రీవాణి యాభై వేలు తెచ్చుకుంటూ వేరే కంపెనీలో పనిచేస్తోంది. అన్నీ ఓకే అయ్యాక ముహూర్తాలు పెట్టుకున్నారు. ఫిబ్రవరిలో ( మాఘమాసం) లో పెళ్ళి. శ్రీధర్‌కి ఒకరోజు పోస్ట్‌మెన్ ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. ఉత్తరం విప్పుతూంటే గుప్పుమంది పరిమళభరితమైన సెంటు వాసన. విప్పాక అందమైన చేతివ్రాత దర్శనమిచ్చింది. కళ్ళు పరుగులు తీశాయి. "ప్రియాతి ప్రియమైన ధర్... అదే శ్రీధర్ గారూ, ఆ రోజు మిమ్మల్ని చూసాను. మొదటి చూపులోనే నా మనసు మీ వశమైంది. లాభం లేదు…. నా మనస్సును లాగి బైట పడేయలేను. ధర్ ! నిన్ను వదిలి నేను వుండలేను. ఇంత గాఢంగా ప్రేమించానేంటి మిమ్మల్ని... నేనూ అందగత్తెనే. శ్రీవాణి కన్నా మంచి రంగు నాఒళ్ళు. . . . శ్రీవాణిని మరిచిపోయి, ఆ పెళ్ళి ఆపు చేసి నన్ను పెళ్ళి చేసుకో.. విచ్చుకున్న విరిదండలా ఆకర్షిస్తూ మరుమల్లెలా గుబాళిస్తూ వుంటాను. మీ ఫోటో నా దగ్గర వుంది. నా గుండెలో మీ ప్రతిమ గూడు కట్టి వుంది. స్వఛ్ఛమైన హంస లాంటి మనసు నాది. ముట్టుకుంటే కంది పోయే కనకాంబరంలా సుతిమెత్తని తనువు నాది. నా కేమీ కోరికలు లేవు. ఒక్క మిమ్మల్ని పెళ్ళాడాలన్న కోరిక తప్ప. శ్రీవాణిని మరిచిపొండి.... ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/2IwuIHGz0TI
Embed this episode
NOW PLAYING
'శ్రీవారికి ప్రేమలేఖ' | Srivariki Premalekha | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.