శుభారంభం | Subharambham | Telugu Short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com episode artwork

EPISODE · Oct 8, 2022 · 7 MIN

శుభారంభం | Subharambham | Telugu Short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

 (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) శుభారంభం రచన : సుస్మితా రమణ మూర్తి నగరానికి దూరంగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీ పార్కులో విశ్రాంత జీవులు లోకాభిరామాయణంలో బిజీగా ఉన్నారు. ఉదయం, సాయంత్రం కలుసుకుని పలకరింపులు, కబుర్లు, వార్తలు, విశేషాలు, అందరి క్షేమ సమాచారాలు తెలుసుకోవడం వారికి పరిపాటి. వారిది అరవై సభ్యులున్న సీనయర్స్ సంఘం. శ్రీరామ్ వారి ప్రెసిడెంట్. సంవత్సరానికి వెయ్యేసి రూపాయలు సభ్యుల నుంచి తీసుకుని, పుట్టిన రోజులకు, పిక్నిక్ పార్టీలకు ఖర్చు చేస్తూ మిగిలింది బేంకులో జమ చేసే బాధ్యత కేషియర్ సుదర్శనంది. ఉదయం తొమ్మిదిన్నరకే చాలామంది కమ్యూనిటీ పార్కులో బెంచీలపై కూర్చున్నారు. “ అందరికీ నమస్కారం! “ అంటూశ్రీరామ్ వచ్చి కూర్చున్నాడు . “తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!...” “పేపర్ల వాళ్ళు రాసేది వాతావరణ శాఖ వారి సమాచారమే! ఒక్కోసారి చినుకులు కూడా పడవు!...” “వారి లెక్కల ప్రకారం చెప్పిందే పేపర్లో వస్తుంది” “అంతే! అంతే! పడితే పడొచ్చు. లేకుంటే లేదు “ “అవునవును. బొమ్మ బొరుసు వ్యవహారం!” మిత్రుల కబుర్ల ప్రవాహం సాగుతోంది. శ్రీరామ్ అందరిలో ఉన్నా, వారి మాటలపై ధ్యాస లేదు నిన్నటి లోకల్ పేపర్ వార్తల ఆలోచనల్లోనే ఇంకా. “ సహృదయులైన పాఠకులకు మనవి. ఈ సరస్వతీ పుత్రికకు దయచేసి సహాయం చేయండి. ఇంటర్లో తొంభై అయిదు శాతం మార్కులు వచ్చాయి పై చదువులు చదువుకోలేని పరిస్థితి!...” “ దయగల మారాజులు మా అనాథ శరణాలయంలోని పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయండి. నిరాదరణకు గురైన వారిని ఆదుకోండి” ఆ వార్తలకు శ్రీరామ్ మనసు కకావికలమైంది ‘ డబ్బున్న వారికి చదువబ్బదు. బాగా చదువుకునే వారికి డబ్బుండదు…అనాథ పిల్లలు,..ఆఖరి దశలో దాతల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్న వృద్ధులు…. దయనీయమైన పరిస్థితి!... ఆశ్రమానికి, అమ్మాయి చదువుకి ఎలాగైనా సహాయం చేయాలి…. పార్టిలకు పిక్నిక్కులకు వేలకు వేలు తగలేస్తున్నాం!….,ఎంతోకొంత సహాయం చేయగల స్థితిలో ఉన్నాం కనుక, మిత్రుల దృష్టి సహాయ కార్యక్రమాల వేపు మళ్ళించాలి!....’ “ ఈరోజు అధ్యక్ష మహాశయులు దీర్ఘాలోచనలో పడ్డారు. విషయం ఏమిటో!?...” ఓ మిత్రుడు నవ్వుతూ అడిగాడు. శ్రీరామ్ లో స్పందన లేదు. ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ‘ ముందుగా సామాజిక స్పృహ, సేవాబావం గల సుదర్శనం గారితోను, కవిగారితోను మాట్లాడాలి…’ చినుకులు పడుతుంటే అందరూ వెళ్ళిపోయారు. శ్రీరామ్ కవిగారిని, సుదర్శనంని వారి ఇంటిలో కలిసి తన ఆలోచనలకు వారి ప్రశంసలు పొందాడు. ***** మిత్రులు అందరూ మిర్చీ బజ్జీ పార్టీలో బిజీగా ఉన్నారు. “ వచ్చే నెలలో మన సుబ్బారావు గారు పుట్టిన రోజు పార్టీ స్టార్ హోటల్లో ఇస్తారట! “... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/0q4fiX7jeNE

Episode metadata supplied by the publisher feed · Published Oct 8, 2022

Embed this episode

NOW PLAYING

శుభారంభం | Subharambham | Telugu Short Story | Susmitha Ramana Murthy | manatelugukathalu.com

0:00 7:24

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 7 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on October 8, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!