EPISODE · Sep 26, 2022 · 22 MIN
సింగినాదం జీలకర్ర | Singinadham Jilakarra | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సింగినాదం జీలకర్ర రచన: దాసు రాధిక కారు గరాజులోకి తీసుకొచ్చి ఆపాడు ఆనంద్. కుడి పక్కకు వెళ్లి కారు డోర్ తీసి నిలబడ్డాడు... ఒక అరవైఐయిదేళ్ల పెద్దావిడ అందులోంచి తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని దిగింది. "వెల్కమ్ హోమ్ అమ్మా" అన్నాడు ఆనంద్ తల్లి వైపు వెలిగిపోతున్న మోహముతో, సంతోషము పట్టలేక... " ముందు మీ నాన్న కు ఫోన్ చేసి చెప్పు రా, నేను క్షేమంగా చేరానని... కాసేపట్లో మాట్లాడుతా నేనె" అన్నది ఆనంద్ తల్లి శ్రీదేవమ్మ. ఇంతలోకే కారు చప్పుడు కి గరాజు లోనుండి ఇంట్లో కి వెళ్లే తలుపు తెరుచుకొని కోడలు పద్మ గబగబా వచ్చి పెట్టెలు లోపల పెట్టేందుకు తన భర్తకు సాయము చేస్తూ, అత్తగారిని పలకరించింది, " హాయ్ అత్తయ్య, బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా" అని. శ్రీ దేవమ్మ బానే జరిగిందని నవ్వుతూ సమాధానము చెబుతూనే లోపలికెళ్లింది. ముందుగా వచ్చింది భోజనాల గది, పక్కనే వంటిల్లు. అందుకని శ్రీదేవమ్మ కాళ్ళు కడుక్కోవాలంది. ఆనంద్ ఆమె కు ఇంట్లో వేసుకునే చెప్పులు చూపించి వేస్కోమన్నాడు. "ఎంత తక్కువ తడి లోకి వెళ్తే అంత మంచిది" అన్నాడు ఆనంద్. "అయినా నువ్వు కూడా ఇలా అయిపోయావెంటమ్మా , ఇది నాన్న పద్ధతి కదా" అన్నాడు. " కాదురా, ముందే తినే చోటికీ వచ్చాం... అందుకే అడిగాను.. దొడ్డి దోవన ఇంట్లోకి జొరబడ్డట్లుందిరా, ఇంటి వాకిలేది?" అడిగింది శ్రీదేవమ్మ. "ఇక్కడ ఇన్తేనమ్మా" అన్నాడు కొడుకు.. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి Video link https://youtu.be/JUfRVf1OiB4
Embed this episode
NOW PLAYING
సింగినాదం జీలకర్ర | Singinadham Jilakarra | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.