సమానం కంటే ఎక్కువే | Samanam Kante Ekkuve | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com episode artwork

EPISODE · Nov 2, 2022 · 6 MIN

సమానం కంటే ఎక్కువే | Samanam Kante Ekkuve | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సమానం కంటే ఎక్కువే!  రచన: కే. లక్ష్మీ శైలజ ఆ రోజు రవళి తో పాటు ఆమె ఇంటికి రమ్య కూడా వెళ్ళింది, వాళ్ళ పాపను చూడటానికి. తల్లీ కూతుళ్ళు ఇద్దరికీ వారం రోజులనుంచి జ్వరమని సెలవు పెట్టి రవళి ఆ రోజే ఆఫీస్ కు వచ్చింది. 'ఆడవాళ్ళు ఎప్పుడూ సెలవు పెడ్తారు. అలాంటప్పుడు ఇంట్లో వుండొచ్చు కదా. పని చెయ్యకుండా జీతం తీసుకుంటారు' అని ఆఫీసర్ బాగా అరిచేటప్పటికి రవళి బాగా ఏడ్చేసింది. అందుకని రమ్య కూడా రవళి తో పాటు వాళ్ళింటికి వచ్చింది, రవళిని ఇంట్లో వదిలి, బాబు ను చూసి పోవచ్చని. అప్పుడు రవళి ఆఫీస్ లో జరిగిన విషయాన్ని భర్త రమేష్ కు చెప్పి, కళ్ళనీళ్ళు పెట్టుకుంది. రమ్య కూడా "మేము ఎదిరించి మాట్లాడలేక పోతున్నాము. ఇలాంటి మాటల వల్ల ఆఫీస్ పని సరిగా చెయ్యలేక పోతున్నాము. ఇంటికి వెళ్ళినా మనసుకు కష్టంగానే వుంటోంది. ఆఫీస్ లో పనిచేసే ముప్ఫై మందిలో మేము ఇద్దరమే అమ్మాయిలమవడం కూడా మగవాళ్ళు మమ్ములను ఇలా ఎగతాళి మాటలు మాట్లాడే దానికి కారణమయ్యిందేమో. కేరళ, ఉత్తరప్రదేశ్ లల్లో పనిచేసే అధికారులలో ఆడవాళ్ళే ఎక్కువట. అక్కడికి వెళ్ళి పనిచేస్తే మాకు గౌరవంగా వుంటుందని అనిపిస్తోంది, " అంది ఆవేదనగా. "దిగులు పడకండి. మీరు బాధపడుతున్నారని తెలిస్తే అవతలి వాళ్ళు ఇంకా ఎక్కువ మాటలు అనగలరు. అతను మారాలంటే ముల్లును ముల్లుతోేనే తీద్దాం. మీ ఆఫీసర్ కూతురు మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ గా చేసే కాలేజ్ లో సైన్స్ లెక్చరర్ గా పని చేస్తోంది. ఆ అమ్మాయి ద్వారా మనం అతనికి బుధ్ధి చెబ్దాం, " అన్నాడు రమేష్. " కొంచెం త్వరగా మాట్లాడండి, " అని రవళి బ్రతిమిలాడింది. "అలాగే. ఇప్పుడే మా ఫ్రెండ్తో మాట్లాడతాను, " అన్నాడు రమేష్ మొబైల్ చేతిలోకి తీసుకుంటూ. రమ్య ఇంటికి వెళ్ళింది. మర్నాడు సాయంత్రం ఆఫీసర్ కూతురు మౌనిక కాలేజ్ నుంచి ఎనిమిది గంటలకు లేటుగా ఇంటికి వచ్చింది. వస్తూనే, హ్యాండ్ బ్యాగ్ సోఫాలో విసిరేసి ఏడుస్తూ కూర్చుంది. అక్కడే టి.వి. చూస్తున్న ఆఫీసర్, "ఏమైంది మౌనికా, "అన్నాడు ఆదుర్దాగా. "చూడు నాన్నా, మా ప్రిన్సిపల్ ఈరోజు, 'మీరు వంటింట్లో వంట చేసుకుంటూ వుండక, తగుదునమ్మా అని ఉద్యోగాల కెందుకు వస్తారు?' అన్నాడు, " అంది గట్టిగా అరుస్తూ. ఆ అరుపులకు కిచెన్ లో నుంచి వాళ్ళమ్మ మహేశ్వరి బయటకు వచ్చింది. "అదేమిటి? ఎమ్మెస్సీ చదివావు, ఉద్యోగం చేస్తే తప్పేంటి?" అంది. "ఎవరామాట అన్నది? " కోపంగా అన్నాడు ఆఫీసర్. "ఇంకెవరూ! మా ప్రిన్సిపల్, " అంది రోషంగా. "ఏం జరిగిందో కాఫీ తాగి నిధానంగా చెప్పమ్మా, " అందామె అనునయంగా. ఒకపది నిముషాల తరువాత ఇలా చెప్పింది మౌనిక. "ఈ రోజు మా కాలేజ్ లో మీటింగ్ జరిగిందమ్మా. ఒక్కో సబ్జెక్ట్ లో ఏ పద్ధతి లో ఎలా టీచ్ చేస్తున్నారు. లాస్ట్ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు ఈ మంత్ జరిగిన ఎగ్జామ్స్ కు స్టూడెంట్స్ ఎంత ఎక్కువ మార్క్స్ స్కోర్ చేశారు. ఇంక వేరే ఏ పద్దతి లో ఉన్నతంగా మనం విద్యను అందించవచ్చు అనే విషయంగా చర్చించాము... Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/WiAS-_rGeu4

Episode metadata supplied by the publisher feed · Published Nov 2, 2022

Embed this episode

Ready to play

సమానం కంటే ఎక్కువే | Samanam Kante Ekkuve | Telugu short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com

0:00 6:46

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 6 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on November 2, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!