సమతుల్యం | Samathulyam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Dec 16, 2022 · 19 MIN

సమతుల్యం | Samathulyam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సమతుల్యం రచన: సిహెచ్. సీ. ఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అత్త ఆడవారే... అమ్మా ఆడవారే... హోదాలలోని వ్యత్యాసం.... చిత్రమైన స్వభావాలకు కారణం అవుతుంది. క్రొత్తగా కాపురానికి వచ్చిన కోడలిని ఆ అత్తగారు కూతురిలా చూస్తుందా!... అత్తగా చెలరేగిపోతుందా!... ఆ అమ్మాయి ఆ సమస్యను ఎలా ఎదుర్కొంది? త్రాసులోని రెండు గిన్నెలు ఒకే సరళరేఖలో ఎలాంటి ఎగుడు దిగుడూ లేకుండా వుండాలి. అప్పడు తూచిన వస్తువు ఖచ్చితంగా ఎలాంటి మోసం లేకుండా వుంటుంది. అటు విక్రేతకు యిటు కొన్నవారికి తృప్తిగా వుంటుంది. యీ పద్ధతిలో వ్యాపారం చేసే వ్యాపారికి పబ్లిక్ లో మంచి పేరు వుంటుంది. గిన్నె క్రింది చింత పండు దట్టించి తెలివి తనకే సొంతం అని మోసపు వ్యాపారం చేసే వ్యక్తి... ఒక నాడు ఎవరో ఒకరి కంట పడతాడు. వాడు మోసగాడనే కీర్తిని సంపాదించుకొంటాడు. జనం వాడిని నమ్ముకోరు. వెలి వేస్తారు.       అలాగే... క్రొత్తగా యింటికి కాపురానికి వచ్చిన కోడలికి ఒక న్యాయం. తన కన్న కూతుళ్ళకు ఒక న్యాయంగా, సంభాషణ సాగిస్తూ, ఆంక్షలను విధిస్తూ కోడళ్ళను తక్కువ చూపు చూచే అత్తగార్లు రెండవ కోవ వ్యాపారిగా... ఓయమ్మో!... ఆ అత్త గయ్యాళి,... అనే సార్థక నామధేయాన్ని పొందుతారు. అక్కడ వ్యాపారికి సంక్రమించింది అపకీర్తి. యిక్కడ యీ అత్తగారికి సంక్రమించింది పక్షపాతి అనే బిరుదు. యిలాంటి సమస్య ఎదురైయ్యింది తన అత్త గారింట గౌతమికి. గౌతమి తండ్రి వీరభద్రయ్య హైస్కూలు హెడ్ మాస్టర్, తల్లి జానకమ్మ. గౌతమికి ఒక తమ్ముడు వినోద్.. ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వున్నంతలో  ఓకే ఆడబిడ్డ కావడం చేత వీరభద్రయ్య దంపతులు గౌతమీ... పాండు రంగారావు వివాహాన్ని ఘనంగానే చేశారు. బిడ్డను సారె సాంప్రదాయాలతో అత్తగారి యింట్లోకి విడిచి పెట్టారు. గౌతమి అత్తగారు సూర్య కాంతమ్మ... మామగారు రామారావుగారు... మరదలు గిరిజ. రామారావు కాంట్రాక్టర్. గిరిజ పుట్టిన తర్వాత వీరికి వ్యాపారం బాగా కలిసి వచ్చింది. ఎన్నో కాంట్రాక్ట్సు తీసుకుని, సమయానికి పనులు పూర్తిచేసి మంచి పేరునూ... డబ్బునూ సంపాదించాడు. పెద్ద ఆఫీస్, నలభై మంది యింజనీర్లు, తదితర కార్య నిర్వాహకులు. నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, లారీలు... యితర సామాగ్రి కొనుగోలు చేసి ఏ-క్లాస్ కాంట్రాక్టర్ గా రాణిస్తున్నారు. మనిషి వ్యక్తిగతంగా చాలా వుత్తముడు, ధర్మాధర్మాలు... నీతి న్యాయాలు అంటే పట్టింపు.. దైవభక్తి... పదిమందికి మంచి చేయాలనే సంకల్పం కలవాడు. ఎంతో సౌమ్యుడు. యిల్లాలు సూర్యకాంతమ్మగారి చరిత్ర... ఆమె తండ్రి ఆ కాలంలో సారాయి కాచి అమ్మి ... క్రమేణా బ్రాందీ షాపు ఓపన్ చేసి... కొంత కాలానికి... డిస్ట్రిక్ట్ మొత్తం లిక్కర్ సప్లై చేసే లెవెల్ కు ఎదిగిన... ఏకాంబరం గారి ముద్దుల కూతురు. టెన్త్ వరకూ చదివింది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/bcLOKsATYuU

Episode metadata supplied by the publisher feed · Published Dec 16, 2022

Embed this episode

NOW PLAYING

సమతుల్యం | Samathulyam | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 19:21

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 19 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on December 16, 2022.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!