EPISODE · Jul 12, 2023 · 8 MIN
సంచిక పొంగింది - ఎపిసోడ్ 4 | Sanchika Pongindi - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 4/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అమ్మాయి చెప్పింది.. మీరు చాలా ధైర్యం చెప్పారట. దాంతో తను ఇంటర్వ్యూ బాగానే చేసిందట. తనకు ఉద్యోగం రావచ్చు అంది." చెప్పింది కామాక్షి. "తను నేర్పు ఐనదే. కానీ కాస్తా భయం. అంతే." నవ్వుతూ అంది సంచిక. "ముందు.. చిక.. ఐ మీన్.. సంచిక అంతే. కొన్నింటి తర్వాత పరీక్షల భయం తనను వీడింది." నవ్వేడు శ్రీకర్. "మరే. నువ్వూ ఏం పోటుగాడివి కాదు. నువ్వు రాను రాను తేరినవాడివే." నవ్వింది సంచిక. అక్కడి వారంతా నవ్వుకున్నారు. "రిజల్ట్స్ నోటీస్ బోర్డులో పెడతారట. మేము చూసి తెల్పుతాం లే. ఏమీ వర్రీ వద్దు." చెప్పింది సంచిక.. వాగ్దేవితో. పిమ్మట.. సంచిక, శ్రీకర్ అక్కడ నుండి కదిలారు. మర్నాడు మధ్యాహ్నం.. తిరిగి ఆ ఇద్దరూ వాగ్దేవి వద్దకు వచ్చారు. "రిజల్ట్స్ ఇచ్చేశారు. మేము సెలెక్ట్ కాలేదు. నువ్వు అయ్యావు. కంగ్రాట్స్." చెప్పింది వాగ్దేవితో సంచిక. "అదేమిటి. మీరూ బాగానే చేశారన్నారుగా." నొచ్చు కుంటుంది వాగ్దేవి. "అంతే. వాళ్ల నార్మ్స్ వాళ్లవి. మాకు ఇది మామూలే." అన్నాడు శ్రీకర్. "కొరియర్ ద్వారా ఆర్డర్స్ ఇంటికి పంపుతున్నారట. వచ్చే సోమవారమే జాయినింగ్." చెప్పింది సంచిక. వాగ్దేవి ఏమీ అనలేదు. "అయ్యో. వచ్చే సోమవారమే. అమ్మాయి నెల రోజులు వరకు నడవ రాదట. వీల్ఛైర్ లోనే కదలాలట." చెప్పింది కామాక్ష్మి. "రేపు ఇంటికి పంపేస్తున్నారు." చెప్పింది వాగ్దేవి. "అలానా." అనేసింది సంచిక. "వీల్ఛైర్ లోనే ఆఫీసుకు వెళ్లొచ్చుగ." అనేశాడు శ్రీకర్. "ఈ రద్దీ రోడ్లు మీద వీల్ఛైర్ తో.. కష్టమే మరి." అంది సంచిక. "అలా అంటారా." దిగులవుతుంది కామాక్షి. ఆ వెంబడే.. "తను నడవ లేదు. నేనే తీసుకు వెళ్ల వలసి ఉంటుంది. ఎలాగో ఏమో. ఆఫీస్ లంటే నాకు తెలవదు." అంటుంది. "ఆంటీ. నోన్ట్ వర్రీ. మేము ఉన్నాం. మీకు అలవాటు పరుస్తాం. సరేనా." హామీలా అంది సంచిక. శ్రీకర్ దానికి వంతు పాడేడు. ఆ వెంబడే.. "మీ ఇల్లు ఎక్కడ." అడిగాడు. వాగ్దేవి అడ్రస్ చెప్పింది. ఈ లోగ.. "ముందు ఆ కంపెనీ వాళ్లని కలిసి.. వాగ్దేవి సిట్యువేషన్ చెప్పి.. వాళ్ల నుండి ఏమైనా ఫేవర్ సంపాదించ వచ్చేమో." అంది సంచిక. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/lHC49YyRdaM
Embed this episode
NOW PLAYING
సంచిక పొంగింది - ఎపిసోడ్ 4 | Sanchika Pongindi - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.