EPISODE · Jul 18, 2023 · 8 MIN
సంచిక పొంగింది - ఎపిసోడ్ 5 | Sanchika Pongindi - Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 5/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 5/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) డోర్ బెల్ మోగుతుంది. కామాక్షి డోర్ తెరిచింది. ఎదురుగా.. శ్రీకర్. కామాక్షి పలకరించింది. లోనికి ఆహ్వానించింది. హాలులో వాగ్దేవి వీల్ఛైర్ లో ఉంది. శ్రీకర్ అక్కడి సోఫాలో కూర్చున్నాడు. "కాఫీ తేనా బాబూ" అడిగింది కామాక్షి. "అడగడం ఏంటి. తే. " చెప్పింది వాగ్దేవి. "లేదు లేదు. వద్దు. నా బ్రేక్ఫాస్ట్ ఐ.. గంట కూడా కాలేదు." చెప్పాడు శ్రీకర్. ఆ వెంబడే.. "ఆంటీ అలా కూర్చొండి. " అన్నాడు. కామాక్షి మరో సోఫా కుర్చీలో కూర్చుంది. "సంచిక.. వాగ్దేవి ప్లేస్ లో రిపోర్ట్ ఇచ్చింది. నేను హాజరయ్యాను. అటు నుండే నేరుగా ఇలా వచ్చాను. " చెప్పాడు శ్రీకర్. "అంతా సవ్యమేగా బాబూ. " అంది కామాక్షి. "ఏమీ కంగారు లేదు. వాగ్దేవి తేలికయ్యే వరకు.. తన వర్క్ ను సంచిక చేసి పెట్ట గలదు. " చెప్పాడు శ్రీకర్. "మీ సాయంని మరవం బాబూ. " చెప్పింది కామాక్షి. "ముమ్మాటికి. మీ తీరులు మమ్మల్ని కుదుట పెట్టాయి. థాంక్స్. " చెప్పింది వాగ్దేవి. "మరదే. ఆ కంపెని వాళ్లు ఛాన్స్ ఇచ్చారు. లేక పోతే మేము చేసేది ఏమీ ఉండదు. " చెప్పాడు శ్రీకర్. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/Oc7ImGMIUWs
Embed this episode
NOW PLAYING
సంచిక పొంగింది - ఎపిసోడ్ 5 | Sanchika Pongindi - Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.