సంఘం చెక్కిన చిత్తరువు | Sangham Chekkina Chittaruvu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com episode artwork

EPISODE · Feb 17, 2023 · 15 MIN

సంఘం చెక్కిన చిత్తరువు | Sangham Chekkina Chittaruvu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంఘం చెక్కిన చిత్తరువు రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆశతోనే కలిగేది జననం. ఆశతోనే సాగేను జీవితం. పొద్దు తిరిగిన వయస్సులో వుండవలసిన ఆశ ఎవరికైనా ఒక్కటే.. ఆత్మీయుల సన్నిధి.. ఆత్మానందం.. శాంతి. అది అనాధల ఆశ్రమం. నిర్వాహకురాలు ‘పావని మాత’. అందరూ ఆమెను ఆ పేరుతొ పిలుస్తారు. కానీ ఆమె అవివాహిత. ఆశ్రమవాసులు ఆమెను అలా గౌరవంగా పిలుస్తారు. ఆశ్రమానికి ‘మాతా శరణాలయం’ అని పేరు. బాంబే నుంచి వచ్చి.. ఐదేళ్ళ క్రిందట ఆ ఆశ్ర మాన్ని స్థాపించింది. ఆ భవన నిర్మాణానికి పది హేను లక్షలు ఖర్చు పెట్టింది. నాలుగు ఎకరాల స్థలంలో భవంతి.. ముప్పై గదులతో రెండు అంతస్తులతో ఆ ప్లాట్ నైరుతీ భాగంలో ఆ భవన నిర్మాణం జరిగింది. సహృదయులైన.. కొందరు పావనిని కలసి.. విరాళాలను యిచ్చారు. మూడు సంవత్సరాల క్రిందట.. ప్రాధమిక విద్యా కేంద్రాన్ని కూడా ఆ ఆవరణలో నిర్మించింది. దాదాపు నూటయాభైమంది పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారు. ఆశ్రమం చుట్టూ రకరకాల చెట్లు, పూలమొక్కలు నాటించి.. ఆశ్రమ వాసులను ఎంత ఆదరాభిమానాలతో చూచుకొంటుందో.. అదే రీతిగా వాటి సంరక్షణను చేస్తూవుంది పావని. ఆశ్రమవాసులు రెండువందల మంది మాత ఆధ్వర్యాన అన్ని పనులు నిర్వర్తిస్తూ ఆనందగా వుంటారు. అక్కడ ఉన్నవారికి.. వారి గత జీవిత చేదు జ్ఞాపకాలు తప్ప.. వేరే చింతలూ లేవు. మాయదారి మనస్సు గతాన్ని మరువలేదుగా!.. ఈ సమస్య అక్కడవున్న వారికే కాదు, పావనికీ వుంది. మనస్సుకు మరిచే గుణం వుంటే.. మనస్సుల్లో ఎలాంటి అలజడి వుండదుగా!.. కాని అలాంటి శక్తీ.. మనస్సుకు లేదే!.. &&&&& “సార్!.. నమస్కారం!.. ” “ఎవరండీ మీరు?.. ” “నేను మాతా ఆశ్రమం నుంచి వచ్చాను. నాపేరు రాంబంటు. మా మాత పావనిగారి ఆరోగ్యం మూడు రోజులుగా సరిగా లేదు. హాస్పిటల్ కు వెళదామంటే వారు నిరాకరిస్తున్నారు. మీరు వచ్చి మా మాతను చూడాలి సార్ !.. ” కన్నీటితో కోరాడు రాంబంటు. “మీ మాత పెరేమిటీ?.. ” ఆశ్చర్యంతో అడిగాడు డాక్టర్ శ్రీరామ్. “పావనీ మాత.. ” చెప్పాడు రాంబంటు. శ్రీరాం.. కొన్ని క్షణాలు ఆలోచించాడు. మనస్సులో ఏదో సందేహం.. అనుమానం.. ఆవేదన.. నిట్టూర్చి.. “పదండి.. ” కుర్ఛీ నుండి లేచాడు శ్రీరామ్. రాంబంటు ముందు.. వెనుక శ్రీరామ్ బయలు దేరారు. తన కార్లో అరగంటలో ఆశ్రమాన్ని చేరారు. వారంరోజుల క్రిందట ఆవూరికి.. డి. ఎం. ఓ. గా శ్రీరాం వచ్చాడు ప్రభుత్వ హాస్పిటల్ కు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/YLVlgMUoSwU

Episode metadata supplied by the publisher feed · Published Feb 17, 2023

Embed this episode

Ready to play

సంఘం చెక్కిన చిత్తరువు | Sangham Chekkina Chittaruvu | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com

0:00 15:36

No transcript for this episode yet

We transcribe on demand. Request one and we'll notify you when it's ready — usually under 10 minutes.

No similar episodes found.

No similar podcasts found.

Frequently Asked Questions

How long is this episode of Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories?

This episode is 15 minutes long.

When was this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode published?

This episode was published on February 17, 2023.

Can I download this Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories episode?

Yes. Use the download control on the episode player to save the publisher-provided media file.
URL copied to clipboard!