EPISODE · Nov 16, 2022 · 11 MIN
సంపత్ సినిమా కథలు - 1 | Sampath Cinema Kathalu - 1 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 1 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) S. సంపత్ కుమార్ గారి ధారావాహిక సంపత్ సినిమా కథలు ప్రారంభం రేపు సాయంత్రం 6 గంటలకు అప్పాయింట్మెంట్ ఇప్పుడు సాయంత్రం 6 గంటలు అబ్బా ఇంక 24 గంటలు ఒకపక్క ఆనందం మరోపక్క ఒకటే టెన్షన్ అప్పాయింట్మెంట్ అంటే డాక్టర్ది కాదు అందరు అప్పాయింట్మెంట్ అంటే అదే అని సాధారణంగా అనుకుంటారు ఒక సినీ ప్రొడ్యూసర్ నా కథ వినడానికి ఇచ్చిన సమయం అది ఒక ప్రముఖ డైరెక్టర్ రేకమొండేషన్ ద్వారా. రాత్రంతా నిద్ర పట్టలేదు. కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి లేకుంటే ఏవో చిన్న చిన్న కథలు రాసుకొని వార పత్రికలకు పంపి వాళ్ళు ఇచ్చే రేమునిరేషనుతో తృపిపడలి అనుకున్న నాకు ఇప్పుడు సువర్ణ అవకాశం వచ్చింది. రాసుకున్న కథ ఇప్పటికే వందసార్లు చదవుకున్నాను. ముందు స్టోరీ లైన్ చెప్పి, నచ్చితే కథ ఎలా చెప్పాలి అనేది ప్రిపేర్ అయ్యాను. ఇంక కథ నచ్చితే స్క్రిప్ట్ వర్క్ తయారు చేసుకోవచ్చు . తెల్లారింది. సమయం ఉదయం 6 గంటలు. రాత్రి నిద్రరాక 2 గంటలు తర్వాత నిద్రపట్టింది. ఇప్పుడు ఉదయం 6 గంటలు ఇంక సాయంత్రం 6 గంటలు ఎప్పుడవుతుందా అని ఎదురుచూస్తున్న మధ్యలో ఫ్రెండ్స్ నుండి కాల్స్ వస్తున్న అసలు విషయము చెప్పలేదు. ముందుగా చెబితే అయ్యే పని కాకుండ పోతుందని. సమయం సాయంత్రం 5 గంటలు. రెకమెండ్ చేసిన డైరెక్టర్ కాల్. రెడీగా ఉండు కారు వస్తుందని. 15 నిమిషాల తర్వాత కారు వచ్చి నా రూమ్ ముందు ఆగింది. కారు వస్తుందని తెలుసు. వచ్చే ముందే నీటుగా రెడీ అయివున్న. నేను ఎక్కిన కారు డైరెక్టర్ ఇంటిముందు ఆగింది. అప్పటీకే ఆయన కూడ రెడీగా ఉన్నాడు. కారు జూబ్లీహిల్లుసులో ఒక అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అప్పుడు టైం సాయంత్రం పది నిమిషాలు తక్కువ 6 గంటలు. కరెక్ట్ టైముకు వచ్చాం. నీవు కథ చెప్పబోయే ప్రొడ్యూసర్ అపార్ట్మెంట్ ఇదే అన్నాడు డైరెక్టర్. చిరునవ్వుతో " అవునా" అంటూ తల ఊప. లిఫ్టులో సెకండు ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 15 దగ్గర కొచ్చి కాలింగ్ బెల్ నొక్కగానే, ప్రొడ్యూసర్ పర్సనల్ అసిస్టెంట్ డోర్ తీసి , డైరెక్టరును చూడగానే నవ్వుతు నమస్కారం పెట్టాడు . ప్రొడ్యూసర్ ఆపీసు రూంలో కూర్చున్నాము. ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ మేము తాగిన వెంటనే ప్రొడ్యూసర్ వచ్చాడు. నమస్కారాలు అయిన వెంటేనే, "ప్రముఖ హీరోతో నేను తీసిన క్లాస్ మూవీ అనుకుంతా రిజల్ట్ ఇవ్వలేదు .ఇప్పుడు ఉన్న కొత్తతరం మాస్ ఫాలోయింగ్ బట్టి అన్ని హంగులు ఉన్న కమర్షియల్ సినిమా ఇప్పుడు ఉండే ప్రముఖ హీరోలతో చెద్దామంటున్నాను మరి వైరెటి గా ఉండే కథ నీ దగ్గర ఉంది అని మా డైరెక్టర్ అన్నాడు. అయితే ముందు నేను ఆ కథ విన్న తర్వాత బాగుంటే మనం ఇప్పుడు ఉండే ఏ హీరో బాగుంటడో చూసి ఆ హీరోకు కథ వినిపిద్దాము" అంటూ ప్రొడ్యూసర్ నా వంక చూస్తూ కథ చెప్పమన్నాడు. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/6rYgXQUSH0w
Embed this episode
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 1 | Sampath Cinema Kathalu - 1 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.