EPISODE · Dec 14, 2022 · 12 MIN
సంపత్ సినిమా కథలు - 3 | Sampath Cinema Kathalu - 3 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 3 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో కిరణ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మానసిక చికిత్సాలయానికి వస్తుంది కావ్య. కిటికీలో నుంచి కావ్యను చూసిన కిరణ్, ఆమె అందానికి ముగ్దుడై పోతాడు. తన పుట్టినరోజు సందర్భంగా పేషెంట్లకు పండ్లు పంచి పెడుతుందామె. తనను షాలిని అనే యువతి మోసం చేసి, డ్రగ్స్ రాకెట్ లో ఇరికించినట్లు లింగస్వామితో చెబుతాడు కిరణ్. ఇక 'సంపత్ సినిమా కథలు’ మూడవ భాగం చదవండి. నారాయణ- రంగా, బీమ ల దగ్గరకి వచ్చి "ఏమి చెప్పి ఆ నర్సింహను పంపించారు రా" అని అడిగాడు. "మళ్ళీ నీ జోలికి రాకుండా ‘ఆ పిచ్చోడు అవతారం దగ్గర అప్పు చేయాల్సిన ఖర్మ మా నారాయణకు ఏమి పట్టింది... వాడికే పెళ్ళాం ద్వార ఆస్తి కలసివచ్చి ఆమె పేరు మీద రెండు గెస్ట్ హౌస్ లు కొన్నాడు’ అని చెప్పాం” అన్నారు వాళ్ళు. "ఓహో అలాగా" " ‘అనవసరంగా నారాయణను అపార్థం చేసుకొన్నా’ అని చెప్పి వెళ్ళిపోయాడు" " అబ్బా.. మీరెంత మంచివాళ్లు రా.. ఇంక మిమ్మల్ని డ్యూటి విషయంలో సతాయించను" అంటూ " ఈరోజు మా గెస్ట్ హౌస్ లో మీకు మందు పార్టీ " అని చెప్పి ఆనందంగా వెళ్లిపోయాడు నారాయణ. "మనం ఇప్పుడు నాటకం ఆడామని తర్వాత వీడికి అసలు విషయం తెలిస్తే ఎలా" అన్నాడు భీమ. " తెలిసినప్పుడు ఇంకో ప్లాన్ వేద్దాం. ముందు మందు పార్టీ కి పోదాం " అన్నాడు రంగా. *** అది ఊటీలో కాలేజ్ రోడ్. ఆ రోడ్లోనే కిరణ్ సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా కావ్య, తన ఫ్రెండ్ మేరీ ఇద్దరూ ఎవరి సైకిల్ వారు త్రోసుకుంటూ వస్తున్నారు. వీళ్ల వెనక ఒక ఇద్దరు స్టూడెంట్స్ రాజు, రవి.. వాళ్లు కూడా ఎవరి సైకిల్ వాళ్లు తోసుకుంటూ వస్తూ, కావ్యను ఆట పట్టిస్తున్నారు. "కావ్యా కరుణించవా..... ఈ ప్రేమదాసుడు నీవు లేక బ్రతక లేడు" "అబ్బా.. రోజూ ఈ రాజుగాడు ఈ డైలాగ్స్ తో ప్రాణం తీస్తున్నాడు. ఎలాగైనా వీడికి బుద్ది చెప్పలి" అంది కావ్య. అప్పుడే మేరీ మాట్లాడుతూ "చూడవే.. ఇంకో బకరా నీవంక అలాగే చూస్తున్నాడు" అంది. అంతే.. ఎదురుగా సైకిల్ ఆపి తననే కళ్ళు ఆర్పకుండా చూస్తున్న కిరణ్… వెంటనే కావ్య ఏదో గుర్తుకు వచ్చినట్టు కిరణ్ ని చూస్తూనే "బావా.. బావా...ఇంత లేట్ గా వచ్చవేమి బావా " అంటూ "మేరీ.. నీకు చెప్పలేదు కదా.. మా బావ.. నిన్న హైదరాబాద్ నుండి వచ్చాడు " అంది. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/KT4aG9JgGx4
Embed this episode
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 3 | Sampath Cinema Kathalu - 3 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.