EPISODE · Dec 21, 2022 · 14 MIN
సంపత్ సినిమా కథలు - 4 | Sampath Cinema Kathalu -4 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
from Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories · host Mana Telugu Kathalu
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 4 రచన : S. సంపత్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తనను వెంబడిస్తున్న కుర్రాళ్లను తప్పించుకోవడానికి కిరణ్ ను ‘బావా’ అని పిలుస్తుంది కావ్య. సుజాతకు కాల్ చేసి పలకరిస్తాడు రాజారావు. ఆమె అతనితో మాట్లాడటానికి ఇష్టపడదు. కావ్యను సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు కిరణ్. ఇక 'సంపత్ సినిమా కథలు’ నాలుగవ భాగం చదవండి. తనను ఫాలో అవుతూ సైకిల్ ఆపిన కిరణ్ను చూస్తూ కావ్య తల బాదుకుంటూ "ఆ రాజు టార్చర్ ప్రేమ వదిలింది అనుకుంటే ఈ కొత్త టార్చర్ ప్రేమ ఒకటి మొదలు అయ్యింది." అంది. "కావ్యా! నీవు ఆ రాజు గాడి ప్రేమతో పోల్చకు. నేను నిన్ను చూసిన తొలి చూపులోనే నీ అందానికి దాసుడ్ని అయిపోయాను. " "అబ్బా ఈ డైలాగ్స్ మా కాలేజీ లో ఇప్పటికీ వంద మంది చెప్పారు. కొత్త డైలాగ్ ఏదైనా చెప్పు". "ఏందే.. నీవు ఏమైనా పెద్ద అందగత్తె అనుకుంటున్నావా, ఆ కళ్ళు చూడు అబ్బా.. గుడ్లగూబల ఉన్నాయి.. ఆ పెదవులు చూడు.. అచ్చం గాడిద పెదలలా ఉన్నాయి.. ఆ మెడ చూడు కొంగలా.. ఇంకకా కిందకు పోతే.." "చాలు చాలు.. ఆపు" అంటూ సైకిల్ మీద ఉన్న కిరణ్ను చేతితో ఒక్క తోపు తోసి, సైకిల్ మీదనే వుంది కదా అక్కడ నుంచి పోదామని స్పీడ్గా సైకిల్ మీద రయ్యి మంటూ పోతుంది. అప్పుడే ఆ రోడ్డులో పోతున్న ఒక కారు కావ్యను డీ కొట్టబోతుంటే ఆమె వెనకాల ఆదే స్పీడ్గా సైకిల్ మీద వస్తున్న కిరణ్ ఆమెను పక్కకు తోసేసరికి ఇద్దరు పట్టు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడి పోయారు. ఇదే అదనుగా నీళ్లలో తేలిపోతూన్న కావ్యను అలా వడిసి పట్టుకోగానే సిగ్గుతో ముడుచుకొనిపొయి అక్కడి నుంచి తడిసి ఉన్న బట్టలతోనే వెళ్ళి, పడిఉన్న సైకిల్ను లేపుకొని దాని మీద వెళ్ళిపోయింది. కావ్యను అలా చూస్తు కిరణ్ కూడ సంతోషం పట్ట లేక గట్టిగా నవ్వుతూ అలా నీళ్లలో స్విమ్మింగ్ చేసుకుంటూ ఉండిపోయాడు. ఇంటికి సైకల్ మీద వచ్చిన కావ్య తడి గుడ్డలతో కనపడగానే సుజాత "ఏమైంది అలా తడిసిపోయి వచ్చావు" అని అడిగింది. "ఏమీ లేదమ్మా! కారు వాడు కాస్త మీదికి వస్తుంటే కంట్రోల్ తప్పి పక్కల ఉన్న చెరువు లో పడిపోయా" "దెబ్బలు ఏమీ తగలలేదు కదా" "నాకేమీ కాలేదు" "బట్టలు మార్చుకొని వస్తా" అంటూ రూంలో కి వెళ్ళింది కావ్య బట్టలన్నీ విప్పుకుంటూ అక్కడే ఉన్న అద్దంలో తన అందాలను చూసుకుంటూ, వయస్సు వచ్చాక తొలిసారి ఒక పురుషుడు తనను నీళ్ళలో వడిసి పట్టుకునే దృశ్యం గుర్తుకు వచ్చి వళ్ళు ఊహల్లో తేలిపోతూ ఏదోలా అయ్యింది కావ్యకు. *** గెస్ట్ హౌస్ నారాయణ, రంగ భీమ ముగ్గురూ మందు మీద జోరుగా వున్నారు. "ఒరే.. అది మందురా.. నీళ్లు తాగినట్లు తాగుతున్నారు. ఇప్పటికే ఫుల్ బాటిల్ అయ్యి రెండో బాటిల్ సగం అయ్యింది". తలబాదుకున్నా డు నారాయణ మళ్ళీ మాట్లాడుతూ. "ఇంకా ఆ నరసింహ నుంచి తప్పించుకునే ప్లాన్ చెప్పలేదు." "డోంట్ వర్రీ నారాయణ " మత్తు లో ఊగుతూ అన్నాడు రంగ. Read the full story on www.manatelugukathalu.com ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును. దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ). https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ కథను యూట్యూబ్ లో చూడండి. Video link https://youtu.be/29PUXpNPBso
NOW PLAYING
సంపత్ సినిమా కథలు - 4 | Sampath Cinema Kathalu -4 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com
No transcript for this episode yet
Similar Episodes
Apr 21, 2026 ·13m
Apr 19, 2026 ·16m
Apr 17, 2026 ·13m
Apr 13, 2026 ·11m
Apr 11, 2026 ·16m